Samsung Level U2 Bluetooth Headset, శామ్‌సంగ్ కొత్త బ్లూటూత్ హెడ్ ఫోన్స్ విడుదల - Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ కొత్త బ్లూటూత్ హెడ్ ఫోన్స్ విడుదల

Published Fri, Feb 5 2021 2:19 PM | Last Updated on Fri, Feb 5 2021 3:30 PM

Samsung Released Level U2 Neckband Style Wireless Headphones - Sakshi

లెవల్ యూ2 నెక్‌బ్యాండ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను శామ్‌సంగ్ భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త హెడ్‌ఫోన్‌లు సింగిల్ ఛార్జీతో 500గంటల స్టాండ్‌బై టైమ్ ను అందిస్తాయి. శామ్సంగ్ 12ఎంఎం ఆడియో డ్రైవర్లతో పాటు వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపిఎక్స్ 2-రేటెడ్ బిల్డ్‌ను కూడా అందించింది. సరైన సౌండ్ అవుట్పుట్ కోసం శామ్‌సంగ్ స్కేలబుల్ కోడెక్ టెక్నాలజీని కూడా లభిస్తుంది. శామ్సంగ్ లెవల్ యు2 హెడ్‌ఫోన్‌లు మొదట నవంబర్‌లో దక్షిణ కొరియాలో విడుదల చేసింది.(చదవండి: రెడ్ మీ లవర్స్‌కు శుభవార్త..!) 

లెవల్ యూ2 హెడ్‌ఫోన్ ఫీచర్స్:
శామ్‌సంగ్ లెవల్ యూ2 హెడ్‌ఫోన్‌లు 12ఎంఎం డ్రైవర్లతో వస్తాయి. దీనిలో 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అందించడం విశేషం. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో పాటు రెండు మైక్రోఫోన్‌లతో వస్తుంది. ఇంకా ఏఏసీ, ఎస్‌బీసీ, స్కేలబుల్ కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది. లెవల్ యు2కి కనెక్ట్ చేసిన ఫోన్‌ను బయటకి తీయకుండా కాల్‌లను స్వీకరించడానికి, మ్యూట్ చేయడానికి, తిరస్కరించే విదంగా వీలు కల్పించారు. దీనిలో ఇన్‌బిల్ట్ బ్యాటరీ 500గం. స్టాండ్‌బై టైమ్, 18గం. మ్యూజిక్ ప్లేబ్యాక్, 13గం. టాక్‌టైమ్‌ను సింగిల్ ఛార్జ్ తో అందిస్తుంది. అలాగే ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉంది. ఈ హెడ్‌ఫోన్‌లు 41.5 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. దీని ధర మనదేశంలో రూ.1,999గా ఉంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement