ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ శామ్‌సంగ్ కి చెందిన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో విడుదల కానుంది. కానీ, విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ ఫోన్ ధర లీక్ అయింది. ఈ ఫోన్ ను రెండు ర్యామ్ వేరియెంట్లలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిని జూన్ లో యూరోపియన్ మార్కెట్లో రూ.20,000 ధర ట్యాగ్ తో ప్రారంభించారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ జూన్ లోనే లాంఛ్ చేశారు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ, గెలాక్సీ ఏ22 5జీ ఆగస్టులో రావచ్చు అని సమాచారం.
దీనిలో ప్రధానంగా 48 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హైలైట్ చేయబడ్డాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు భారతదేశంలో బాగా మార్కెట్ ఉంది. ఇవి బడ్జెట్, మిడ్ రేంజ్ లో ఉంటాయి. వీటి ధర 10 నుంచి 20 వేల రూపాయల మధ్య ఉంటుంది. శామ్‌సంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఏ22 5జీని భారతదేశంలో రెండు మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది. దీని 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.19,999గాను, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.21,999కు తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది.
గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్
- 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే
- 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు
- మీడియాటెక్ డిమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్
- 48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా
- 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
- 15డబ్ల్యు ఫాస్ట్ చార్జర్
Comments
Please login to add a commentAdd a comment