Mobiles for sale
-
ఫోన్ నీటిలో పడిందా..? ఇలా చేయండి..
ప్రతి ఒక్కరి జీవితంలోను ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ఫోనో..ఫీచర్ఫోనో ఏదో ఒకటి తప్పకుండా ఉపయోగిస్తున్నారు. అయితే మనదో..మనకు తెలిసిన వారి ఫోన్ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం చూస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చేయకూడనివి.. నీటిలో తడిచిన వెంటనే ఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయటం కానీ, ఫోన్‌ను షేక్ చేయటం కాని చేయవద్దు. మీకు ఫోన్ గురించి తెలిసినా ఓపెన్ చేయవద్దు. ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల వారంటీ కోల్పోవలసి వస్తుంది. తడిసిన ఫోన్‌పై గాలిని ఊదే ప్రయత్నం చేయకూడదు. దాంతో నీరు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. అవగాహన లేకుండా ఎలాంటి హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి. చేయాల్సినవి.. వారెంటీ, ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఇన్సూరెన్స్ అయిపోతే ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తోపాటు మైక్రో ఓఎస్డీకార్డ్ను తొలగించాలి. రిములబుల్ బ్యాటరీ ఫోన్ అయితే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని చాలా సున్నితంగా ఫోన్లోని తడి భాగాలను తుడవాలి. తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అయితే జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి అందులో ఫోన్‌ను ఉంచి కప్పివేయాలని, అందువల్ల తేమశాతం తగ్గుతుందని కొందరు సూచిస్తుంటారు. అయితే దాంతో పూర్తిగా ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా అలా చేసినా మళ్లీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. -
'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్!
'బిగ్ దివాళీ సేల్' పేరుతో అక్టోబర్ 17(ఆదివారం) నుంచి ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దివాళీ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై 80శాతం, 70శాతం డిస్కౌంట్లో అందిస్తుంది. వీటితో పాటు పలు బ్యాంకుల డెబిట్ కార్డ్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ అధికారికంగా తెలిపింది. ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్ -2021 ♦ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ 2021 అక్టోబర్ 17తో ప్రారంభమై అక్టోబర్ 23తో ముగియనుంది ♦ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 16, 12am నుంచి ప్రారంభం కానుంది. ♦ మిగిలిన కొనుగోలు దారులు అక్టోబర్ 17, 12 am నుంచి ప్రారంభం కానుంది. ♦ ఈ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 23 మధ్యాహ్నం 11.59గంటలకు ముగియనుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో పలు బ్యాంక్ ఆఫర్లు ఇలా ఉన్నాయి ♦ ఎస్బీఐ క్రెడిట్ నుంచి ప్రొడక్ట్ కొనుగోలు చేసినా ఈఏఎంఐ సౌకర్యంతో పాటు 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ♦ యాక్సెస్ బ్యాక్ , ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగంతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ♦ పేటీఎం యూపీఐ ట్రాన్సాక్షన్లపై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ♦ గతేడాది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.7,500వరకు డిస్కౌంట్ అందించింది. ఆ ఆఫర్ ఈ ఏడాది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ♦ ఫోన్ పే యూజర్లు సైతం ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఆఫర్లలలో సొంతం చేసుకోవచ్చు ♦ పలు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. ♦ డెబిట్ కార్డ్‌లపై ఈఎంఐ సౌకర్యం ♦ బజాజ్ ఫిన్ సర్వ్ కార్డ్ పై నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ♦ ల్యాప్ ట్యాప్ అండ్ గేమింగ్ కంప్యూటర్ పై ఆఫర్లు ♦ గేమింగ్ ల్యాప్‌టాప్ ఏసర్ ప్రిడేటర్(Acer Predator), ఎంఎస్ఐ గేమింగ్ మానిటర్ పై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ♦ హై ఫర్మామెన్స్ ల్యాప్ ట్యాప్‌లపై 40శాతం ఆఫర్ ♦ వర్క్ అండ్ ఎంటర్ టైన్మెంట్ ల్యాప్ ట్యాప్స్‌పై 50శాతం ఆఫర్ ♦ ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌ట్యాప్స్‌పై రూ.20వేల వరకు ఆఫర్ లో పొందవచ్చు. 70, 80శాతం డిస్కౌంట్లు బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం డిస్కౌంట్స్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్‌పై 80శాతం డిస్కౌంట్స్, టీవీ, గృహోపకరణాలపై 75శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..! -
విడుదలకు ముందే లీకైన గెలాక్సీ ఏ 22 5జీ ధర, ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ శామ్సంగ్ కి చెందిన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో విడుదల కానుంది. కానీ, విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ ఫోన్ ధర లీక్ అయింది. ఈ ఫోన్ ను రెండు ర్యామ్ వేరియెంట్లలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిని జూన్ లో యూరోపియన్ మార్కెట్లో రూ.20,000 ధర ట్యాగ్ తో ప్రారంభించారు. శామ్సంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ జూన్ లోనే లాంఛ్ చేశారు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ, గెలాక్సీ ఏ22 5జీ ఆగస్టులో రావచ్చు అని సమాచారం. దీనిలో ప్రధానంగా 48 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హైలైట్ చేయబడ్డాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు భారతదేశంలో బాగా మార్కెట్ ఉంది. ఇవి బడ్జెట్, మిడ్ రేంజ్ లో ఉంటాయి. వీటి ధర 10 నుంచి 20 వేల రూపాయల మధ్య ఉంటుంది. శామ్సంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఏ22 5జీని భారతదేశంలో రెండు మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది. దీని 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.19,999గాను, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.21,999కు తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు మీడియాటెక్ డిమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్ 48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 15డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ -
10 గంటల్లో 5 లక్షల మొబైల్స్ సేల్
మెట్రో నగరాల నుంచి భారీగా ఆర్డర్లు: ఫ్లిప్‌కార్ట్ న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పది గంటల్లో 5 లక్షల మొబైళ్లను విక్రయించింది. ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ స్థాయి అమ్మకాలు సాధించామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్నేసి ఫోన్లు విక్రయించడం రికార్డ్ అని ఫ్లిప్‌కార్ట్ హెడ్(కామర్స్ ప్లాట్‌ఫారమ్) ముకేశ్ బన్సాల్ పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 17(శనివారం)న ముగుస్తుంది. బుధవారం అర్థరాత్రి నుంచి అమ్మకాలు మొదలు పెట్టామని, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుంచి భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని బన్సాల్ వివరించారు. విశాఖపట్టణం, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్ వంటి టైర్ టూ నగరాల నుంచి కూడా డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొన్నారు. అమ్ముడైన ఈ 5 లక్షల మొబైల్ ఫోన్లలో మూడో వంతు వాటా 4జీ మొబైల్ ఫోన్లదేనని తెలిపారు. పది గంటల్లో ఐదు లక్షల మొబైల్ ఫోన్లు అమ్ముడవడం,. భారత్‌లో స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచి స్తోందని చెప్పారు. కాగా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం రోజున 10 గంటల్లో 10 లక్షల వస్తువులను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేస్తున్నామని, 5 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారని, రోజుకు కోటికి పైగా విజిట్స్ వస్తున్నాయని కంపెనీ అంటోంది.