కమలా హారిస్‌ క్లియర్‌ విన్నర్‌ కాదా? | Kamala Harris Clear Winner In First Presidential Debate But | Sakshi
Sakshi News home page

కమలా హారిస్‌ క్లియర్‌ విన్నర్‌ కాదా?.. నెట్టింట కొత్త చర్చ

Published Wed, Sep 11 2024 4:41 PM | Last Updated on Mon, Oct 7 2024 10:37 AM

Kamala Harris Clear Winner In First Presidential Debate But

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య తొలి డిబేట్‌ వాడీవేడిగా సాగింది. అయితే, ఈ డిబేట్‌లో ఆద్యాంతం కమలదేపై చేయి నడిచిందంటూ అమెరికా మీడియా చెబుతుండగా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఓ కొత్త చర్చ మొదలైంది.

కమలా హారిస్ ఛీటింగ్‌ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దానికి ట్రంప్‌ మద్దతుదారులు జత కలవడంతో అది తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఈ చర్చకు కారణం..డిబేట్‌ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే.

పెన్సిల్వేనియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌ వేదికగా ట్రంప్‌-కమల మధ్య సంవాదం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరూ పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం ఈ డిబేట్‌ను అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. అయితే కమలకే ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ఇప్పుడు ఓ విమర్శ ఆమెను చుట్టుముట్టింది.

ఈ చర్చలో కమలా హారిస్‌ ధరించిన చెవిపోగులు సీక్రెట్‌ పరికరమని, వాటి సాయంతోనే ఆమె డిబేట్‌లో అంత అద్భుతంగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు. ఈమేరకు కొన్ని వెబ్‌సైట్‌ ఫొటోలను, రివ్యూలను చూపిస్తున్నారు.

‘‘డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో కమలా హారిస్‌ అద్భుతంగా మాట్లాడారు. ఇయర్‌రింగ్‌ మాదిరిగా ఉండే ఇయర్‌ఫోన్‌కు సంబంధించిన కథనం గుర్తుకు వచ్చింది’’ అని ఓ నెటిజన్‌, ఒబామా మాదిరిగానే కమలా బాగా మాట్లాడారన్న మరో యూజర్‌.. ఆమె ధరించిన చెవిపోగులు నోవా హెచ్‌1 ఆడియో ఇయర్‌రింగ్స్‌ మాదిరిగానే ఉన్నాయన్నారు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆమె రెగ్యులర్‌గా ధరించే ఇయర్‌రింగ్స్‌ అవని, వాటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.

ఇక.. ఫస్ట్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో విన్నర్‌గా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ గెలిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా చానెల్స్‌ అధికారికంగా ప్రకటించాయి. డిబేట్‌లో ట్రంప్‌, హారిస్‌ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటూ విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చాయి. 

  • డిబేట్‌లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు: ఫాక్స్‌ న్యూస్‌
  • కమలా హారిస్‌పై పైచేయి సాధించేందుకు ట్రంప్‌ అసంబద్ధ వాదనలు. అయితే టైం వేస్ట్‌ చేయకుండా ట్రంప్‌పై హారిస్‌ విరుచుకుపడ్డారు: 
    ఏబీసీ మీడియా
  • ఈ డిబేట్‌లో కమలా హారిస్‌దే భారీ విజయం: పొలిటికో
  • డిబేట్‌లో ట్రంప్‌ తనను తాను సమర్థించుకునేందుకు యత్నించారు. ట్రంప్‌ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి.  ఒక ప్రాసిక్యూటర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు కమల ప్రయత్నించారు: ది న్యూయార్క్‌ టైమ్స్‌
  • కమలా హారిస్‌ ప్రసంగంతో ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె పూర్తి సన్నద్ధతతో డిబేట్‌కు వచ్చారు: సీఎన్‌ఎన్‌

డిబేట్‌లో ఇద్దరి మధ్య విమర్శ-ప్రతివిమర్శల్లో.. హారిస్‌దే పైచేయిగా సాగిందని, ట్రంప్‌ ఘోరంగా తడబడ్డారంటూ యూఎస్‌ మీడియా పేర్కొంది. అలాగే.. స్వింగ్‌ స్టేట్స్‌లోనూ కమలకు మంచి మార్కులు పడ్డాయని తెలిపాయి.  మొత్తంగా హారిస్‌ ఈ డిబేట్‌లో క్లియర్‌ విన్నర్‌ అని తేల్చేశాయి.

ఇదీ చదవండి: ట్రంప్‌ ఏమాత్రం మారలేదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement