
గణేశ్‌నాయక్ (ఫైల్)
దొడ్డబళ్లాపురం: ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతూ రైలుపట్టాలపై వెళ్తున్న యువకునికి అదే చివరి ఘడియ అయ్యింది. రైలు ఢీకొని మృతిచెందిన సంఘటన ఉత్తరకన్నడ జిల్లా కారవార తాలూకాలో చోటుచేసుకుంది. బావికేరి నివాసి గణేశ్‌నాయక్ (24) మృతుడు.
తాలూకాలోని అమదళ్లి వద్ద ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం గణేశ్ చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ రైలుపట్టాలపై నడుస్తుండగా మడగావ్–మంగళూరు ఇంటర్‌సిటీ రైలు వేగంగా ఢీకొంది. దీంతో గణేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా ఇయర్‌ఫోన్స్ చెవిలోనే ఉన్నాయి. కారవార రైల్వేపోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.