
ఘటనా స్థలంలో మోహన్ మృతదేహం
కోలారు: ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందాడు. ఈఘటన నగరంలోని సంతేగేట్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. కేరళకు చెందిన మోహన్(53) మూడు రోజుల క్రితం కేరళనుంచి తన ఇద్దరు శిష్యులతో కలిసి నగరానికి వచ్చాడు. ఎంబీ రోడ్డులోని లాడ్జిలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
మంగళవారం ఓ ఇంట్లో పూజలు చేసేందుకు బయల్దేరాడు. సైడ్ ఇవ్వాలని వెనుక కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ మోగించాడు. అయితే మోహన్ చెవులకు ఇయర్‌ఫోన్స్ ఉండటం వల్ల హారన్ వినిపించలేదు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. తలపై చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచచెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఎస్‌ఎన్‌ఆర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అతని శిష్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment