
ప్రముఖ జర్మన్-ఆడియో బ్రాండ్ సెన్‌హెయిసర్ భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల చేయని అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్, డిజే ఆపరేటర్స్ కోసం ఐఈ 900 ఇయర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు పేర్కొంది. కంపెనీ ఐఈ 900లో సెన్ హీసర్ కొత్త సృజనాత్మక ఎక్స్ 3ఆర్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల స్వచ్ఛమైన, సహజ ధ్వనిని ఆస్వాదించవచ్చు. మెరుగైన స్థిరత్వం కొరకు గోల్డ్ ప్లేటెడ్ ఎమ్ ఎమ్ సీఎక్స్ కనెక్టర్లతో సహ ఫీచర్స్ తో ఈ ఇయర్ ఫోన్లు వస్తాయి. సెన్ హీసర్ ఐఈ 900 ఇయర్ ఫోన్ల ధర వచ్చేసి రూ.1,29,900.
భారతదేశంలో ఇప్పటి వరకు లాంఛ్ చేసిన అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లు ఇవే. అయితే, ఈ ఇయర్ ఫోన్లను సెన్ హీసర్ వెబ్ షాప్ లో వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద హెడ్ ఫోన్లలో కనిపించే పొందికైన, కళాఖండం లేని "సెన్హీసర్ సౌండ్"ను అందించే ఐఈ 900లో సెన్ హీసర్ తన కొత్త ఎక్స్ 3ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ సిలికాన్ ఇయర్ అడాప్టర్లను, మూడు ఎలాస్టిక్ ఫోమ్ ఇయర్ అడాప్టర్ సెట్లను మూడు విభిన్న సైజుల్లో బండిల్ చేసింది. ఈ ఇయర్ ఫోన్ లు 7 మిమీ ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్ డ్యూసర్ ని కలిగి ఉంటాయి. ఇయర్ ఫోన్ లు సింగిల్ డ్రైవర్ సిస్టమ్ తో వస్తాయి. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. సెన్‌హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్‌ఫోన్స్, హెచ్‌డీ 25 మానిటరింగ్‌ను ఇండియాలో విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment