ధర ‘వింటే’ మతిపోతుంది! అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్‌ ఇవే.. | Louis Vuitton Launches Worlds Most Expensive Earphones | Sakshi
Sakshi News home page

ధర ‘వింటే’ మతిపోతుంది! అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్‌ ఇవే..

Published Sun, Dec 24 2023 9:56 PM | Last Updated on Mon, Dec 25 2023 9:12 PM

Louis Vuitton Launches Worlds Most Expensive Earphones - Sakshi

ఇప్పుడంతా స్మార్ట్‌ ఫోన్లు, గ్యాడ్జెట్‌లదే హవా. కళ్లు చెదిరే ధరతో ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటితోపాటు స్మార్ట్‌ వాచ్‌లు, ఇయర్‌ఫోన్స్‌, ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే స్థాయిలో లాంచ్‌ అవుతున్నాయి. అయితే ఈ ఇయర్‌ఫోన్స్‌ ధర తెలిస్తే మాత్రం నిజంగానే మతిపోతుంది! 

లూయిస్ విట్టన్ అనే కంపెనీకి చెందిన ఇయర్‌ఫోన్స్‌ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి. ఈ ఏడాది మార్చిలో హారిజన్ లైటప్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసి అభిమానులను విస్మయానికి గురి చేసింది.  వీటి ధర అక్షరాలా 1,660 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.38 లక్షలు. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఈ సొగసైన ఇయర్‌బడ్‌ల ధర సోషల్ మీడియాలో వైరల్‌ మారి వీటికి క్రేజ్‌ను పెంచాయి.

 

ప్రత్యేకతలెన్నో..
మతిపోగొట్టే ధరతోపాటు క్రేజీ ఫీచర్లు వీటి సొంతం. బ్రాండ్ ఐకానిక్ మోనోగ్రామ్ ప్యాట్రన్‌తో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఇయర్‌బడ్‌లను రూపొందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎలిమినేటింగ్ మైక్రోఫోన్, బ్లూటూత్ మల్టీపాయింట్ వంటివి వీటి ప్రత్యేకతలు. ఐదు రంగులలో లభ్యమయ్యే ఈ ఇయర్‌బడ్స్‌కు 28 గంటల బ్యాటరీ లైఫ్, గ్రేడియంట్‌ రంగులతో ప్రకాశించే సొగసైన స్టెయిన్‌లెస్ స్టీల్ ఛార్జింగ్ కేస్‌ స్పెషల్‌ ఫీచర్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement