
అమాజ్‌ఫిట్ నేడు తన జీటీఆర్ 2ఇ, జీటీఎస్ 2ఇ స్మార్ట్‌వాచ్‌ల ధరలను వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు రూ.9,999 అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు అమాజ్‌ఫిట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేయవచ్చు. అలాగే జీటీఆర్ 2ఇ అమెజాన్ ద్వారా లభిస్తుండగా, జీటీఎస్ 2ఇ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు జనవరి 19న ఫస్ట్ సేల్ కు రానున్నాయి.
ఫీచర్స్:
ఇటీవల ముగిసిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2021లో అమాజ్‌ఫిట్ రెండు స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది. అమాజ్‌ఫిట్ జీటీఆర్ 2ఇ 1.39-అంగుళాల అమోలెడ్ హెచ్‌డి డిస్‌ప్లేతో 326 పిపిఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇది 471 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 రోజుల బ్యాకప్‌ను అందిస్తుంది. దీనిలో 90కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను కొలవడానికి SpO2 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఒత్తిడి, నిద్రను ట్రాక్ చేయగలదు. జీటీఆర్ 2ఇలో హృదయ స్పందన మానిటర్ కూడా ఉంది. ఇందులో పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ హెల్త్ అసెస్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. జీటీఎస్ 2ఇలో 1.65-అంగుళాల హెచ్‌డి అమోలేడ్ డిస్ప్లే ఉంది. స్మార్ట్ వాచ్ జీటీఎస్ 2ఇ కూడా ఇదే లక్షణాలను కలిగిఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ సాధారణ వాడకంలో 14 రోజుల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment