Best Smartwatches Under Rs. 1500: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో టెక్నాలజీ వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. నేడు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాకుండా స్మార్ట్‌వాచ్‌లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ. 1500 కంటే తక్కువ ధర వద్ద లభించే లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 (Fastrack Revoltt FS1)
రూ. 1200 వద్ద అందుబాటులో ఉన్న 'ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1' ఎక్కువ ప్రజాదరణ పొందిన బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. దీనిని ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. 1.83 ఇంచెస్ డిస్‌ప్లే కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా పొందింది. 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా పొందుతుంది.
నాయిస్ క్రూ (Noise Crew)
మన జాబితాలో రెండవ స్మార్ట్‌వాచ్ 'నాయిస్ క్రూ'. దీని ధర రూ. 1499 మాత్రమే. దీనిని రిటైల్ స్టోర్స్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 1.38 ఇంచెస్ రౌండ్ డిస్‌ప్లే కలిగి ఐపీ68 రేటింగ్ పొందుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది.
పెబుల్ ఫ్రాస్ట్ ప్రో (Pebble Frost Pro)
రూ. 1299 వద్ద లభించే పెబుల్ బ్రాండ్ 'ఫ్రాస్ట్ ప్రో' స్మార్ట్‌వాచ్ మంచి ప్రజాదరణ పొందిన లేటెస్ట్ మోడల్. ఇది 1.96 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రొటేటింగ్ వంటి ఆఫ్షన్స్‌తో పాటు వినియోగదారులకు ఆధునిక కాలంలో ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే!
నాయిస్ ఐకాన్ బజ్ (Noise Icon Buzz)
మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌వాచ్ నాయిస్ ఐకాన్ బజ్. రూ. 1299 వద్ద లభించే ఈ వాచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 1.69 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఈ లేటెస్ట్ ప్రొడక్ట్ బ్లూటూత్ కాలింగ్ వంటి వాటితో పాటు వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా పొందుతుంది.
ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి!
ఫైర్-బోల్ట్ నింజా టాక్ (Fire-Boltt Ninja Talk)
ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన నింజా టాక్ ధర రూ. 1499. రౌండ్ డయల్ డిజైన్ కలిగి చూడ చక్కగా కనిపించే ఈ వాచ్ ఎంతోమంది వినియోగద్రూలకు ఇష్టమైన ఉత్పత్తి. 120 స్పోర్ట్స్ మోడ్స్‌తో బ్లూటూత్ కాలిగి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారుని ఎంతగానో అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment