friendshipday
-
ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!
Best Smartwatches Under Rs. 1500: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో టెక్నాలజీ వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. నేడు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాకుండా స్మార్ట్‌వాచ్‌లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ. 1500 కంటే తక్కువ ధర వద్ద లభించే లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 (Fastrack Revoltt FS1) రూ. 1200 వద్ద అందుబాటులో ఉన్న 'ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1' ఎక్కువ ప్రజాదరణ పొందిన బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. దీనిని ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. 1.83 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా పొందింది. 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. నాయిస్ క్రూ (Noise Crew) మన జాబితాలో రెండవ స్మార్ట్‌వాచ్ 'నాయిస్ క్రూ'. దీని ధర రూ. 1499 మాత్రమే. దీనిని రిటైల్ స్టోర్స్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 1.38 ఇంచెస్ రౌండ్ డిస్ప్లే కలిగి ఐపీ68 రేటింగ్ పొందుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది. పెబుల్ ఫ్రాస్ట్ ప్రో (Pebble Frost Pro) రూ. 1299 వద్ద లభించే పెబుల్ బ్రాండ్ 'ఫ్రాస్ట్ ప్రో' స్మార్ట్‌వాచ్ మంచి ప్రజాదరణ పొందిన లేటెస్ట్ మోడల్. ఇది 1.96 ఇంచెస్ డిస్ప్లే కలిగి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రొటేటింగ్ వంటి ఆఫ్షన్స్‌తో పాటు వినియోగదారులకు ఆధునిక కాలంలో ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! నాయిస్ ఐకాన్ బజ్ (Noise Icon Buzz) మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌వాచ్ నాయిస్ ఐకాన్ బజ్. రూ. 1299 వద్ద లభించే ఈ వాచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 1.69 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఈ లేటెస్ట్ ప్రొడక్ట్ బ్లూటూత్ కాలింగ్ వంటి వాటితో పాటు వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా పొందుతుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! ఫైర్-బోల్ట్ నింజా టాక్ (Fire-Boltt Ninja Talk) ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన నింజా టాక్ ధర రూ. 1499. రౌండ్ డయల్ డిజైన్ కలిగి చూడ చక్కగా కనిపించే ఈ వాచ్ ఎంతోమంది వినియోగద్రూలకు ఇష్టమైన ఉత్పత్తి. 120 స్పోర్ట్స్ మోడ్స్‌తో బ్లూటూత్ కాలిగి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారుని ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. -
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ!
-
స్నేహమేరా జీవితం
కరీంనగర్ కల్చరల్ : స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలో యువతీయువకులు వేడుకలు నిర్వహించుకున్నారు. అల్ఫోర్స్ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినులు జీఏకే గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించుకున్నారు. కళాశాల కరస్పాండెంట్ వి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ విజయం సాధించినప్పుడు చప్పట్లు చరిచేవారు, విషాధంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే వారు లేని జీవితం వృథా అన్నారు. వివేకానంద విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నారులు ఫ్రెండ్షిప్ బాండ్లు కట్టుకున్నారు. విద్యాసంస్థ చైర్మన్ సౌగాని కొమురయ్య, డైరెక్టర్ అనుదీప్, జి.మల్లేశం, పి.శ్రీకాంత్, కరస్పాండెంట్ రాజేశ్వర్, జగత్పాల్రెడ్డి, రవి పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఎస్సారార్ కళాశాల తెలుగు అధ్యాపకులు కొత్తిరెడ్డి మల్లారెడ్డి, జన్నారం ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సంపతి కవిత, గ్రంథాపాలకురాలు శకుంతల, గ్రంథాలయ నిర్వాహకులు ఎం.డీ.గఫార్, శంకర్, శ్రీలత, రమ, రాజు, సంతోష్, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీ కార్యాలయంలో.. ఎంపీ వినోద్‌కుమార్ కార్యాలయంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు జక్కుల నాగరాజు, నాయకులు ఓరుగంటి ఆనంద్, రాజు, జీఎస్ ఆనంద్, ఫర్వేజ్, నాయక్, సుదర్శన్ పాల్గొన్నారు. పారమితలో మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్ పారమిత పాఠశాలలో చిన్నారులు ఫ్రెండ్షిప్ బాండ్స్ కట్టుకున్నారు. పారమిత ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ తివారీ, కోఆర్డినేటర్స్ అరుణ్, హేమ, శ్రీలత పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే
ఖానాపూర్ : ఫ్రెండ్షిప్ డే వేడుకల సంబరాలు మండలంలో అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కడపత్రి తిలక్‌రావు, జిల్లా సహాయ కార్యదర్శి శేక్ అజ్జర్, మండల అధ్యక్షుడు శ్రీరాములు తిరుపతిల ఆధ్వర్యంలో విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడంతో పాటు ఫ్రెండ్షిప్ బాండ్ కట్టారు. కార్యక్రమంలో నాయకులు రైస్బేగ్, ఎనగందుల శ్రీనివాస్, లాండేరి రంజిత్, మొహిన్, వార్డెన్ నారాయణ, సిబ్బంది వసంత్ తదితరులున్నారు. పలు యువజన సంఘాలు, స్నేహితులు... మండల కేంద్రంలోని లైస్ యూత్ క్లబ్, సింహసేన యూత్లతో పాటు పలువురు స్నేహితులు వేర్వేరుగా సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాల్లో లైస్ యూత్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, ఆకుల రవి, వంశి, జుబేర్, రమేశ్, హరీశ్, సింహిసేన యూత్ అధ్యక్షుడు షకిల్, గుగ్గిల్ల సతీశ్, సాడిగె ప్రసాద్, దివాకర్, శోభన్, మనోజ్, రంజిత్, పొశెట్టి, సంతోశ్, సాయి, కష్ణ, హరీశ్ తదితరులున్నారు. -
స్నేహగీతం
అమ్మ, నాన్న, ప్రేమ... ఎంత చిన్నపదాలు! స్నేహం.. నేస్తం.. దోస్త్... ఎంత చిన్న పదాలు! మరెంత చిత్రమో... ఈ అలతి అలతి అక్షరాల పదాలే జీవితాన్ని ఎంత అర్ధవంతం చేస్తాయి! బతుకుకు ఎంత అందాన్నిస్తాయి! అవధుల్లేని జీవన పయనంలో ఈ అనుబంధాలే కదూ మనల్ని నడిపిస్తాయి! చిన్ననాటి తప్పటడుగుల నుంచి ప్రాజ్ఞత నేర్పిన పరుగుల వరకు అడుగడుగునా అల్లుకున్న అల్లిబిల్లి స్నేహాలే బతుకులో తీపిని రుచి చూపిస్తాయి.. జీవితాన్ని నిత్యనూతనం చేస్తాయి.. ఈ స్నేహగీతాలే, చెలిమి పలుకులే నిన్నూ నన్నూ, సమస్త మానవాళినీ కలుపుతాయి.. నిలుపుతాయి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే! ఈ రోజు తలపులోకి రాగానే..ఎద లోతులో..ఏ మూలనో..నిదురించే జ్ఙాపకాలు నిద్రలేస్తున్నాయి కదూ! ఔను ఫ్రెండ్‌షిప్‌డే అంటే ఎన్నో జ్ఞాపకాలు..మరెన్నో మధుర స్మతులు కళ్లముందు కదలనిదెవరికి? ఆగొద్దు.. ఆలోకంలో అలానే విహరించండి! ఒక్కసారి కళ్లు మూసుకోండి... అద్భుత స్నేహ ప్రపంచం కనిపిస్తోంది కదూ... ఊహలాటి అద్వితీయ అనుభవం.. మీకే తెలిసిన అపురూప భావం కదలాడుతోంది కదూ ఎంజాయ్ చేయండి.. ఆనాటి కబుర్లు... ఆ స్నేహితుల చిలిపి చేష్టలు... కళ్లలో, మనసులో నింపుకోండి తనివితీరా నవ్వుకోండి.. ఫ్రెండ్ దగ్గరగా ఉంటే హాయిగా హగ్ చేసుకోండి. కనీసం స్మార్ట్ ఫోన్ తీసుకోండి. విష్ చేస్తూ ఓ మెసేజ్ పెట్టండి. ఫ్రెండ్ నుంచి వచ్చే సందేశాన్ని మదిలో మననం చేసుకోండి.. సష్టిలో తీయనిది స్నేహమే అనుకుంటూ సంతోషంగా స్నేహగీతం పాడుకోండి. -
మతాలు వేరైనా.. ఫ్రెండ్ షిప్ ఒక్కటే
స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ. భాషకందని కమ్మటి భావన.చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. బుడి బుడి అడుగుల బాల్యంలో అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే.. పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకున్నవి మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ స్కూలో.. కాలేజీలోనో ఊపిరి పోసుకునే స్నేహం.. జీవితంలో ఒక విడదీయరాని బంధమైపోతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలై.. మనిషన్నవాడు మాయమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడో ఒక చోట ఉన్నతమైన స్నేహాలు వెలుగు రే ఖలై దారి చూపుతుంటాయి. అమ్మా, నాన్న, అన్నా, చెల్లీ.. బంధాలన్నీ దేవుడిస్తే, మనకుమనం ఇచ్చుకునే ఏకైక బంధం స్నేహం. అంతగొప్ప స్నేహానికి హ్యాట్సాఫ్ చెబుతూ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాలివి.. చార్మినార్: మతాలు వేరైనా... వారిద్దరి మనసులు ఒక్కటే. దాదాపు 40 ఏళ్లకు పైగా ప్రాణ స్నేహితులు. ఒకరు రెడ్‌రోజ్ గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సయ్యద్ హమీదుద్దీన్ కాగా... మరొకరు ప్రముఖ వ్యాపారి, మీరాలంమండి మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య. వీరిద్దరు పాతబస్తీలో నాలుగు దశాబ్దాలుగా స్నేహం కొనసాగిస్తున్నారు. వివాహాది శుభకార్యాలతో పాటు పండుగలు, ఇతర కార్యక్రమాల్లో ఇరు కుటంబాలు తప్పనిసరిగా కలుసుకుంటాయి. ఒకప్పుడు వ్యాపారం నిమిత్తం బేగంబజార్‌లో వీరిద్దరూ స్నేహితులుగా మారారు. అదే స్నేహాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. హమీదుద్దీన్ ఈదిబజార్‌లో నివాసముంటుండగా... గాజుల అంజయ్య మీరాలంమండిలో నివాసముంటున్నారు. మతాలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుంది.