వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెండ్‌షిప్ డే
Published Sun, Aug 7 2016 11:27 PM | Last Updated on Mon, Aug 27 2018 8:39 PM
ఖానాపూర్ : ఫ్రెండ్‌షిప్ డే వేడుకల సంబరాలు మండలంలో అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కడపత్రి తిలక్‌రావు, జిల్లా సహాయ కార్యదర్శి శేక్ అజ్జర్, మండల అధ్యక్షుడు శ్రీరాములు తిరుపతిల ఆధ్వర్యంలో విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడంతో పాటు ఫ్రెండ్‌షిప్ బాండ్ కట్టారు. కార్యక్రమంలో నాయకులు రైస్‌బేగ్, ఎనగందుల శ్రీనివాస్, లాండేరి రంజిత్, మొహిన్, వార్డెన్ నారాయణ, సిబ్బంది వసంత్ తదితరులున్నారు.
పలు యువజన సంఘాలు, స్నేహితులు...
మండల కేంద్రంలోని లైస్ యూత్ క్లబ్, సింహసేన యూత్‌లతో పాటు పలువురు స్నేహితులు వేర్వేరుగా సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాల్లో లైస్ యూత్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, ఆకుల రవి, వంశి, జుబేర్, రమేశ్, హరీశ్, సింహిసేన యూత్ అధ్యక్షుడు షకిల్, గుగ్గిల్ల సతీశ్, సాడిగె ప్రసాద్, దివాకర్, శోభన్, మనోజ్, రంజిత్, పొశెట్టి, సంతోశ్, సాయి, కష్ణ, హరీశ్ తదితరులున్నారు.
Advertisement
Advertisement