
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీ నియామకం జరిగింది. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్‌గాంధీ, పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డిని నియమించారు.మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్టు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగానికి అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment