స్నేహమేరా జీవితం
Published Mon, Aug 8 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
కరీంనగర్ కల్చరల్ : స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలో యువతీయువకులు వేడుకలు నిర్వహించుకున్నారు. అల్ఫోర్స్ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినులు జీఏకే గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించుకున్నారు. కళాశాల కరస్పాండెంట్ వి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ విజయం సాధించినప్పుడు చప్పట్లు చరిచేవారు, విషాధంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే వారు లేని జీవితం వృథా అన్నారు. వివేకానంద విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చిన్నారులు ఫ్రెండ్‌షిప్ బాండ్‌లు కట్టుకున్నారు. విద్యాసంస్థ చైర్మన్ సౌగాని కొమురయ్య, డైరెక్టర్ అనుదీప్, జి.మల్లేశం, పి.శ్రీకాంత్, కరస్పాండెంట్ రాజేశ్వర్, జగత్‌పాల్‌రెడ్డి, రవి పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఎస్సారార్ కళాశాల తెలుగు అధ్యాపకులు కొత్తిరెడ్డి మల్లారెడ్డి, జన్నారం ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సంపతి కవిత, గ్రంథాపాలకురాలు శకుంతల, గ్రంథాలయ నిర్వాహకులు ఎం.డీ.గఫార్, శంకర్, శ్రీలత, రమ, రాజు, సంతోష్, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎంపీ కార్యాలయంలో..
ఎంపీ వినోద్‌కుమార్ కార్యాలయంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు జక్కుల నాగరాజు, నాయకులు ఓరుగంటి ఆనంద్, రాజు, జీఎస్ ఆనంద్, ఫర్వేజ్, నాయక్, సుదర్శన్ పాల్గొన్నారు.
పారమితలో
మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్ పారమిత పాఠశాలలో చిన్నారులు ఫ్రెండ్‌షిప్ బాండ్స్ కట్టుకున్నారు. పారమిత ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ తివారీ, కోఆర్డినేటర్స్ అరుణ్, హేమ, శ్రీలత పాల్గొన్నారు.
Advertisement
Advertisement