happy sunday
-
బీ.. హ్యాపీ...
-
విజయవాడలో కలర్ఫుల్గా హ్యాపీ సండే
-
విజయవాడలో హ్యాపీ సండే!
-
తీరాన ఎగసింది..ఆనందతరంగం
కార్పొరేష¯ŒS ఆధ్వర్యంలో పుష్కరఘాట్‌లో ‘హ్యాపీ సండే’ అలరించిన మున్సిపల్ స్కూల్ విద్యార్థుల ఆటాపాటా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సరదాగా ‘టగ్ ఆఫ్ వార్’ రాజమహేంద్రవరం సిటీ : వరదవేళ గోదావరిలో నీరు ఉరకలెత్తిట్టు.. ఆ నదీతీరాన ఉన్న పుష్కరఘాట్‌లో ఆదివారం ఆనందోత్సాహాలు పరవళ్లు తొక్కాయి. రేవు ఆటపాటలకు నెలవైంది. పిన్నలూ, పెద్దలూ, మాన్యులూ, సామాన్యులూ ఆ సందడిలో భాగస్వాములయ్యారు. నగర ప్రజల ఉమ్మడి వేదికగా విభిన్న రకాల కార్యక్రమాలతో రూపొందించిన ‘హ్యాపీ సండే’ తొలిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులతో రెండు గంటల పాటు ఉల్లాసంగా గడిచింది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కమిషనర్ విజయరామరాజు అధికారులు ఒక జట్టుగా, ఎంపీ మురళీమోహ¯ŒS, మిగిలిన ప్రజాప్రతినిధులు మరోజట్టుగా టగ్ ఆఫ్ వార్ సరదాగా సాగింది. కబడ్డీ, ఖోఖో, రంగవల్లుల పోటీలు నిర్వహించారు.రక్త పరీక్షలు, మెహిందీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రూ.10 నుంచి రూ.1000 లవరకూ ఫ్యాన్సీ నెంబర్ల నోట్లు, వివిధరకాల ప్టాస్టిక్ వస్తువుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నీటి ఆవశ్యకత గూర్చి చిన్నారి ఇచ్చిన ప్రదర్శన అలరించింది. నగర పాలక సంస్థ పాఠశాలల చిన్నారులు జాతీయత ఉట్టిపడే గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తీ¯ŒSమార్, కరాటే, బురక్రథ వంటి అంశాలు అలరించాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలి ప్రయత్నం విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఆదివారాల్లో మరింత ఆనందంగా ఉండే విధంగా రూపొందిస్తామన్నారు. ఎంపీ మురళీమోహ¯ŒS మాట్లాడుతూ వంటల పోటీలు, యోగా వంటి అంశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు రాంబాబు, గొర్?రల సురేష్, కొమ్మ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హుషారుగా హ్యాపీ సండే
-
హుషారుగా హ్యాపీ సండే
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం సందడిగా సాగింది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రజలు బందర్ రోడ్డు పై నిర్వహించిన హ్యాపీసండే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, సంగీతం, నృత్యాలతో యువత అందరినీ అలరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు , వాకర్స్ అసోసియేషన్లు, కాలనీ కమిటీలు, యూత్ అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపైన కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్ వంటి అంశాలను ప్రదర్శిస్తూ క్రీడాకారులు అందరిని అకట్టుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ గ్రీన్‌ఎర్త్ సొసైటీలు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాయి. మట్టి వినాయకుడిని పూజించాలంటూ ప్రచారం నిర్వహించాయి. పాప్ గీతాలు, సినీ సంగీతంతో కళాకారులు అందరినీ అలరించాయి. పలు కళాశాల, పాఠశాల విద్యార్థులతో పాటు నగర ప్రజలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ట్రాఫిక్ డీసీపీ కాంతిరాణా టాటా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
స్నేహమేరా జీవితం
కరీంనగర్ కల్చరల్ : స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలో యువతీయువకులు వేడుకలు నిర్వహించుకున్నారు. అల్ఫోర్స్ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినులు జీఏకే గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించుకున్నారు. కళాశాల కరస్పాండెంట్ వి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ విజయం సాధించినప్పుడు చప్పట్లు చరిచేవారు, విషాధంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే వారు లేని జీవితం వృథా అన్నారు. వివేకానంద విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నారులు ఫ్రెండ్షిప్ బాండ్లు కట్టుకున్నారు. విద్యాసంస్థ చైర్మన్ సౌగాని కొమురయ్య, డైరెక్టర్ అనుదీప్, జి.మల్లేశం, పి.శ్రీకాంత్, కరస్పాండెంట్ రాజేశ్వర్, జగత్పాల్రెడ్డి, రవి పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఎస్సారార్ కళాశాల తెలుగు అధ్యాపకులు కొత్తిరెడ్డి మల్లారెడ్డి, జన్నారం ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సంపతి కవిత, గ్రంథాపాలకురాలు శకుంతల, గ్రంథాలయ నిర్వాహకులు ఎం.డీ.గఫార్, శంకర్, శ్రీలత, రమ, రాజు, సంతోష్, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీ కార్యాలయంలో.. ఎంపీ వినోద్‌కుమార్ కార్యాలయంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు జక్కుల నాగరాజు, నాయకులు ఓరుగంటి ఆనంద్, రాజు, జీఎస్ ఆనంద్, ఫర్వేజ్, నాయక్, సుదర్శన్ పాల్గొన్నారు. పారమితలో మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్ పారమిత పాఠశాలలో చిన్నారులు ఫ్రెండ్షిప్ బాండ్స్ కట్టుకున్నారు. పారమిత ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ తివారీ, కోఆర్డినేటర్స్ అరుణ్, హేమ, శ్రీలత పాల్గొన్నారు. -
హ్యాపీ..హ్యాపీ సండే
విజయవాడ సెంట్రల్ : ఆటపాటలతో కుర్రకారు స్టెప్పులేశారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద ఒక్కటై కబడ్డీ.. కబడ్డీ.. అంటూ కూతపెట్టారు. రాక్‌బ్యాండ్ డాన్స్, జానపద నృత్యాలతో ఇరగదీశారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే బందరు రోడ్డు రెండున్నర గంటల పాటు యువత కేరింతలతో హోరెత్తింది. యూత్ జోష్.. పెద్దల హుషారు కలగలిసిన హ్యాపీ‘సండే’ సందడిగా సాగింది. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వై స్క్రీన్స్ సహకారంతో డీప్ ట్రస్ట్‌లు హ్యాపీ సండే నిర్వహించాయి. బందరురోడ్డులో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్దకు ఉదయం ఆరు గంటలలోపే పెద్ద ఎత్తున చిన్నారులు, యువత చేరుకున్నారు. కుటుంబ సమేతంగా హాజరై ఎంజాయ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సతీమణి ఆండాళ్లు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. వీరపాడిండియన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వాలీబాల్ ఆడారు. స్టెప్ బై స్టెప్ డాన్స్ ఇనిస్టిట్యూట్ కళాకారుల డాన్స్, రాక్ బ్యాండ్ డాన్స్, వివిధ జానపద నృత్యాలు అలరించాయి. పిల్లలు, పెద్దలు వాలీబాల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, స్కేటింగ్, రన్నింగ్, టెన్నికాయిట్, తొక్కుడు బిళ్ల, ఉప్పులకుప్ప..వయ్యారి భామ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన అంబారి సత్యనారాయణ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన స్కిప్పింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులు 2కె రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేటర్ నజీర్ హుస్సేన్, కో–ఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి, నగరపాలక సంస్థ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎస్వీఎస్ చౌదరి, ఈఈ ధనుంజయ, యూసీడీ పీవో ఎంవీ.సత్యనారాయణ, డీప్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్, పోలీస్ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.