తీరాన ఎగసింది..ఆనందతరంగం
-
కార్పొరేష¯ŒS ఆధ్వర్యంలో పుష్కరఘాట్లో ‘హ్యాపీ సండే’
-
అలరించిన మున్సిపల్ స్కూల్ విద్యార్థుల ఆటాపాటా
-
అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సరదాగా ‘టగ్ ఆఫ్ వార్’
రాజమహేంద్రవరం సిటీ :
వరదవేళ గోదావరిలో నీరు ఉరకలెత్తిట్టు.. ఆ నదీతీరాన ఉన్న పుష్కరఘాట్‌లో ఆదివారం ఆనందోత్సాహాలు పరవళ్లు తొక్కాయి. రేవు ఆటపాటలకు నెలవైంది. పిన్నలూ, పెద్దలూ, మాన్యులూ, సామాన్యులూ ఆ సందడిలో భాగస్వాములయ్యారు. నగర ప్రజల ఉమ్మడి వేదికగా విభిన్న రకాల కార్యక్రమాలతో రూపొందించిన ‘హ్యాపీ సండే’ తొలిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులతో రెండు గంటల పాటు ఉల్లాసంగా గడిచింది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కమిషనర్ విజయరామరాజు అధికారులు ఒక జట్టుగా, ఎంపీ మురళీమోహ¯ŒS, మిగిలిన ప్రజాప్రతినిధులు మరోజట్టుగా టగ్ ఆఫ్ వార్ సరదాగా సాగింది. కబడ్డీ, ఖోఖో, రంగవల్లుల పోటీలు నిర్వహించారు.రక్త పరీక్షలు, మెహిందీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రూ.10 నుంచి రూ.1000 లవరకూ ఫ్యాన్సీ నెంబర్ల నోట్లు, వివిధరకాల ప్టాస్టిక్ వస్తువుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నీటి ఆవశ్యకత గూర్చి చిన్నారి ఇచ్చిన ప్రదర్శన అలరించింది. నగర పాలక సంస్థ పాఠశాలల చిన్నారులు జాతీయత ఉట్టిపడే గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తీ¯ŒSమార్, కరాటే, బురక్రథ వంటి అంశాలు అలరించాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలి ప్రయత్నం విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఆదివారాల్లో మరింత ఆనందంగా ఉండే విధంగా రూపొందిస్తామన్నారు. ఎంపీ మురళీమోహ¯ŒS మాట్లాడుతూ వంటల పోటీలు, యోగా వంటి అంశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు రాంబాబు, గొర్?రల సురేష్, కొమ్మ శ్రీనివాస్ పాల్గొన్నారు.