సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన తొలి స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్ ను ఎలా వినియోగిస్తామో..స్మార్ట్‌వాచ్‌ను కూడా అలాగే ఉపయోగించుకునేలా స్మార్ట్‌వాచ్‌ను వచ్చే ఏడాది వేసవికి అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. పల్స్‌రేట్ తెలుసుకోవడంతోపాటు, రెండు కెమెరాలుతో పాటు, ఫిట్నెస్ కంపెనీల సేవలు లేదా హార్డ్‌వేర్‌లకు కూడా కనెక్ట్ కావచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా ఆపరేట్ చేయగలగడం మరో ఆకర్షణ. అమెరికా టెక్నాలజీ సైట్ ది వెర్జ్ కథనం ప్రకారం. సెకండ్, థర్డ్ జెనరేషన్ వాచ్‌లను కూడా లాంచ్ చేయనుంది. దీని సుమారు 400 డాలర్లు (సుమారు రూ .29,000) గా ఉంటుందట. ఇంకా పేరు పెట్టని ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, వైట్, గోల్డ్‌న్ రంగులలో లభించనుంది.
స్మార్ట్‌వాచ్ ఫీచర్స్
ఈ స్మార్ట్‌వాచ్ సాయంతో మెసేజెస్‌ను పంపడంతో పాటు హెల్త్, ఫిట్నెస్ గురించి తెలుసుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌లో రెండు కెమెరాల డిస్‌ప్లే ఉంటుంది. దీని సాయంతో యూజర్లు ఫోటోల్ని, వీడియోల్ని క్యాప్చర్ చేయవచ్చు. అలా క్యాప్చర్ చేసిన వీడియోల్ని ఇన్‌స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా షేర్ చేసే సదుపాయం ఉంది. స్మార్ట్‌వాచ్ ముందు భాగంలో ఉండే కెమెరా సాయంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. స్మార్ట్ వాచ్ వెనుక భాగంలో పూర్తి హెచ్ డీతో డీజికామ్ ఉంటుంది. ఈ డిజికామ్ ద్వారా యూజర్లు తీసుకున్న ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునేలా బ్యాక్‌ప్యాక్‌ల వంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఫేస్ బుక్ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్‌కు స్మార్ట్ వాచ్ అటాచ్ చేసే పనిలేకుండా ఎల్‌టిఇ కనెక్టివిటీని జోడించాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది. ఇందు కోసం యుఎస్ వైర్‌లెస్ క్యారియర్‌లతో కలిసి పనిచేస్తోంది. స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్‌లో వినియోగదారును ఆకట్టుకుని, ఆపిల్, హువావే, గూగుల్‌లకు గట్టి పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకువస్తున్నారని ది వెర్జ్ నివేదించింది.
చదవండి : Facebook షాక్: ట్రంప్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment