3 వేలలోనే రెడ్ మీ స్మార్ట్ వాచ్‌ | Redmi First Smartwatch Announced For 45 Dollars | Sakshi
Sakshi News home page

3 వేలలోనే రెడ్ మీ స్మార్ట్ వాచ్‌

Published Sat, Nov 28 2020 10:32 AM | Last Updated on Sat, Nov 28 2020 12:23 PM

Redmi First Smartwatch Announced For 45 Dollars - Sakshi

రెడ్ మీ నోట్ 9 సిరీస్‌తో పాటు రెడ్ మీ బ్రాండ్ వాచ్‌ను కూడా చైనాలో షియోమీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ధరను 269యువాన్లుగా(సుమారు రూ.3,018) నిర్ణయించారు. రెడ్‌మి బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌వాచ్ ఇది. 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ తో పాటు అవుట్ డోర్ రన్నింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, నడక, కొలనులో వంటి ఏడు స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. దీని బరువు 35 గ్రాములు మాత్రమే. (చదవండి: బ్యాటరీ సేవింగ్ కోసం ఇలా చేయండి!)

రెడ్‌మి వాచ్ ఫీచర్స్ 

రెడ్‌మి వాచ్‌లో 324 పిపి పిక్సెల్ డెన్సిటీ, 2.5డి టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్‌తో 1.4-అంగుళాల (320x320 పిక్సెల్స్) ఎల్సీడీ ఆకారంలో ఉన్న స్క్రీన్‌ను ఇందులో అందించారు. దాదాపు 120 వాచ్ ఫేసెస్‌ను ఇందులో అందించారు. అందిస్తుంది. ఇది 5ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, అందువల్ల నీటిలో 50 మీటర్ల లోతువరకు పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 5.0, ఆ పైబడిన, ఐవోఎస్ 10.0+ ఆ పైబడిన ఫోన్లకు దీన్ని పెయిర్ చేసుకోవచ్చు. దీనిలో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్, జియో మాగ్నెటిక్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఇది 230 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది. ఇందులో మొత్తం ఏడు స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. వీటిలో ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, ఫ్రీస్టైల్ వంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందించారు. రెడ్‌మి వాచ్ 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ స్లీప్ ట్రాకింగ్, సెడెంటరీ మానిటరింగ్, రెస్టింగ్ హార్ట్ రేట్ 30 రోజుల రిపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

రెడ్‌మి వాచ్ ధరను చైనాలో 299 యువాన్లుగా (సుమారు రూ .3,300) నిర్ణయించారు. ఇది ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌ల కోసం 269 యువాన్ల(సుమారు రూ .3,000) తగ్గింపు రేటుతో లభిస్తుంది. ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ బ్లూ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌కు చెర్రీ పింక్, పింక్ గ్రీన్ స్ట్రాప్‌లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 1న నుంచి మి.కామ్‌లో లభిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement