Apple Watch Series 8 : ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ప్రమాదంలో యూజర్లను కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation (అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వాచ్‌లోని ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.
స్మార్ట్ వేరబుల్ మార్కెట్లో యాపిల్ వాచ్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్నీ యాపిల్ వాచ్ సిరీస్‌ల కంటే యాపిల్ వాచ్ 8 సిరీస్ విభిన్నంగా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా క్యాలి ఫోర్నియాలో క్యూపార్టినో నగరంలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లో స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా నిర్వహించిన యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్‌లో టిమ్ కుక్ మహిళ ఆరోగ్యం కాపాడే లక్ష్యంగా విడుదల చేసిన యాపిల్ వాచ్ 8 సిరీస్ వాచ్ రించి మరిన్ని విషయాలు మీకోసం
ovulation (అండోత్సర్గము) గురించి
పెళ్లయిన జంటలన్నీ పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే ovulation (అండోత్సర్గము) గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి కోసమే అండోత్సర్గము అనే ఫీచర్‌ను తయారు చేసింది. టెంపరేచర్ సెన్సార్ తో పాటు హై ఎండ్ ఫీచర్లతో ఆపిల్ వాచ్ 8 ని పరిచయం చేస్తోంది. అయితే, మహిళల పర్సనల్ డేటా కేవలం వాళ్లు ధరించిన యాపిల్ వాచ్ 8లో నిక్షిప్తమై ఉంటుందని, ఆ డేటా యాపిల్ సర్వర్‌లలో స్టోర్ చేయడం లేదని జెఫ్ విలియమ్స్ స్పష్టం చేశారు.
డిస్‌ప్లే సూపర్
ఇప్పటికే యూజర్లు వినియోగిస్తున్న అన్నీ యాపిల్ వాచ్‌ల కంటే ఈ యాపిల్ 8 సిరీస్ వాచ్ కింగ్ మేకరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వాచ్‌లో ఉన్న అప్‌డేటెడ్ ఫీచర్లు ఇతర వాచ్‌లలో లేవని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాపిల్ వాచ్ 49 రెక్టాంగిలర్ డిస్‌ప్లే తో పాటు 2000నిట్స్‌ల బ్రైట్‌నెస్, చేతికి ధరించినప్పుడు తేలికగా ఉండేందుకు వాచ్ కేస్ టైటానియంతో తయారు చేయబడింది.
ఫిట్‌నెస్ ప్రియుల కోసం
ఫిట్‌నెస్ ప్రియులకోసం యాపిల్ తయారు చేసిన ఈ వాచ్ డిజైన్, స్లైడ్స్ లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్‌డేట్ చేసింది. కొత్త ఆరెంజ్ యాక్షన్ బటన్, బటన్ గార్డ్, రీడిజైన్ చేసిన క్రౌన్, sapphire క్రిస్టల్ డిస్‌ప్లే తో పాటు ఆ డిస్‌ప్లేను ప్రొటెక్ట్ చేసేందుకు రిమ్ సైజును పెంచింది. ఈ తరహా ఫీచర్‌ను శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రోలో కూడా మనం చూడొచ్చు.
కారు ప్రమాదంలో ఉంటే
కారు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించినట్లయితే, అత్యవసర సేవలకు కాల్ చేయడంలో సహాయపడటానికి సిరీస్ 8లో కొత్త గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచే యాక్సిలరోమీటర్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ మోషన్‌ను డిటెక్ట్ చేస్తుంది. wake-up screen వంటి ఆప్షన్‌కు కూడా ఈ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నారు.
ధర ఎంతంటే
యాపిల్ వాచ్ 8సిరీస్ ధర 499 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ..సెప్టెంబర్ 16 నుంచి కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment