ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో తయారీ యూనిట్లను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. కర్ణాటకకు చెందిన ఏక్యూస్ గ్రూప్ యాపిల్ ఉత్పత్తుల తయారీదారుగా ఎదిగేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ట్రయిల్ స్టేజ్‌ను పూర్తి చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఒకవేళ ఈ ట్రయిల్ స్టేజ్‌లో యాపిల్ నిబంధనల ప్రకారం ఏక్యూస్ గ్రూప్ ఉత్పత్తులను తయారు చేస్తే, భారత్‌లో టాటా ఎలక్ట్రానిక్స్ తర్వాతి స్థానం కంపెనీదేనని భావిస్తున్నారు. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.
ఏక్యూస్ గ్రూప్ ప్రస్తుతం ఏరోస్పేస్ విడిభాగాలు, టాయ్స్ తయారీ రంగంలో సేవలందిస్తోంది. ఈ కంపెనీ ట్రయల్ దశను అదిగమిస్తే యాపిల్ ఉత్పత్తుల సరఫరాదారుల జాబితాలో చోటు సంపాదించిన రెండో భారతీయ కంపెనీగా నిలుస్తుంది. మ్యాక్‌బుక్ పర్సనల్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్‌లు, యాపిల్ ఉత్పత్తుల విడిభాగాలను తయారు చేసే ఏకైక దేశీయ సంస్థగా అవతరించే అవకాశం ఉంది. ఏక్యూస్ ట్రయల్‌కు సంబంధించి యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్ మెకానికల్ భాగాల ఉత్పత్తిని ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ ట్రయిల్‌కు సంబంధించి ఇరు కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టాటా ఎలక్ట్రానిక్స్ మాత్రమే యాపిల్‌కు భారతీయ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ఇది ఐఫోన్లను తయారు చేస్తోంది.
ఇదీ చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!
యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్‌ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తిని పెంచుతోంది. దేశీయంగా ఐఫోన్ తయారీ విభాగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్లు సమకూర్చింది. ఇందులో రూ.85,000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం కీలకంగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment