విమాన ప్రమాదంలో తండ్రీ- కూతుర్ని
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రక‍్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని
ఇప్పుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్న ఓ డాక్టర్‌ను. ఇలా ప్రాంతాలు వేరైనా ఆయా ఘటనల్లో బాధితుల్ని రక్షిస్తుంది మాత్రం వస్తువులే.
మనం ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ అనే సినిమా డైలాగుల్ని వినే ఉంటాం. కానీ పై సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాల్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. వస్తువుల్ని సరిగ్గా వినియోగించుకుంటే మనుషుల ప్రాణాల్ని కాపాడుతాయని నిరూపిస్తున్నాయి. తాజాగా ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ డెంటిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది.
యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్ 'సిరీల్4, సిరీస్ 5, సిరీస్ 6, సిరీస్ 7' లలో ఈసీజీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఈసీజీ యాప్' చేసే పని ఏంటంటే హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీని మెజర్ చేసి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్ వాచ్‌కు రెడ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో బాధితుల్ని వెంటనే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు.
హర్యానాకు చెందిన నితేష్ చోప్రా (34) వృత్తి రీత్యా డెంటిస్ట్. గతేడాది నితేష్‌కు అతని భార్య నేహా నగల్ ఈసీజీ యాప్ ఫీచర్ ఉన్న యాపిల్ వాచ్ 'సిరీస్ 6' ని బహుమతిగా ఇచ్చింది. అయితే నితేష్‌కు తాను ధరించిన యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఫీచర్ గురించి తెలియదు. ఈ నేపథ్యంలో మార్చి 12న నితేష్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడి భార్య వాచ్‌లో ఈసీజీ యాప్‌ను చెక్ చేయమని భర్తకు సలహా ఇచ్చింది. వెంటనే నితేష్ యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అతని గుండె పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేసింది.
వాచ్ అలెర్ట్‌తో నితేష్ హుటాహుటీన వైద్యుల్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..నితేష్ గుండెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో ఉన్న తన భర్త ప్రాణాల్ని యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ మెయిల్ చేసింది.
"నా భర్తకు 30వ పుట్టిన రోజు సందర్భంగా యాపిల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే వాచ్ నా భర్త ప్రాణాల్ని కాపాడుతుందని అనుకోలేదు. ప్రమాదంలో ఉన్నాడని స్మార్ట్ వాచ్ హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నా భర్త ఆరోగ్యం కుదుట పడింది. నా భర్తకు జీవితాన్ని ప్రసాదించిన మీకు, అందులో భాగమైన టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు మెయిల్‌లో పేర్కొంది.
అనూహ్యంగా నేహా మెయిల్‌కు టిమ్ కుక్ స్పందించారు. సకాలంలో మీ భర్తకు ట్రీట్మెంట్ అందినందుకు చాలా సంతోషిస్తున్నాను. స్మార్ట్ వాచ్ మీ భర్తను కాపాడిందనే విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ టిమ్ కుక్ నేహా మెయిల్‌కు రిప్లయి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.
చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్
Comments
Please login to add a commentAdd a comment