heart patient
-
Hyderabad Marathon: లింగం.. మారథాన్ సింగం! హార్ట్ పేషెంట్ అయినా..
సాక్షి, హైదరాబాద్: లింగం వయసు 50 ఏళ్లు. ఫుల్ మారథాన్ (42 కిలోమీటర్లు) పూర్తి చేశాడు. ఇది అంత పెద్ద విశేషమేమీ కాదు...కానీ అతను వెల్డింగ్ పనిచేసే సామాన్యమైన కార్మికుడు. అంతేకాదు హార్ట్ పేషెంట్ కూడా. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే లింగం ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని ఫుల్ మారథాన్ పూర్తి చేశారు. అయితే ఈ ఘనత సాధించిన హార్ట్ పేషెంట్‌గా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా లింగం, ఆయనకు వైద్యం చేసిన డా.మురళీధర్ బాబీ ‘సాక్షి’తో ఆ వివరాలు పంచుకున్నారు. కరోనా అనుకుంటే... వెల్డర్‌గా పనిచేస్తున్న లింగం రెండేళ్ల క్రితం తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఇఎస్ఐ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ సమస్యకు కారణం కరోనా అని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే పరీక్షల అనంతరం వైద్యులు ఇది కరోనా కాదని, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ అని..అప్పటికే లింగంకు తెలియకుండా రెండుసార్లు స్ట్రోక్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. ఆయనకు కొన్ని మందులు రాసిచ్చి వాడమన్నారు. కొద్దిరోజుల తర్వాత నిమ్స్‌కు రిఫర్ చేశారు. నిమ్స్‌లో యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేసి బ్లాక్స్ లేవని, అయితే ఆయన గుండెకు పంపింగ్ సామర్థ్యం బాగా తక్కువగా..అంటే 18కి దిగిపోయిందని డాక్టర్లు తేల్చారు. రిహాబ్‌తో రీచార్జ్ డాక్టర్ మురళీధర్ నిర్వహించే కార్డియాక్ రిహాబ్ సెంటర్ ప్రోగ్రామ్‌లో లింగం చేరారు. అక్కడ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల మందులు, చికిత్సలతో పాటుగా రెగ్యులర్‌గా ట్రెడ్మిల్ వ్యాయామం, ఆహారంలో రైస్ బాగా తగ్గించి కాయగూరలు, మొలకలు వంటివి బాగా పెంచారు. తద్వారా పంపింగ్ సామర్థ్యాన్ని 53 శాతానికి మెరుగుపరిచారు. ఫలితంగా గత ఏడాదిలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేసిన లింగం...మంచి అలవాట్లు కొనసాగిస్తూ గుండెను మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫుల్ మారథాన్‌ను కూడా పూర్తి చేయగలిగారు. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్!
విమాన ప్రమాదంలో తండ్రీ- కూతుర్ని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని ఇప్పుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్న ఓ డాక్టర్‌ను. ఇలా ప్రాంతాలు వేరైనా ఆయా ఘటనల్లో బాధితుల్ని రక్షిస్తుంది మాత్రం వస్తువులే. మనం ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ అనే సినిమా డైలాగుల్ని వినే ఉంటాం. కానీ పై సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాల్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. వస్తువుల్ని సరిగ్గా వినియోగించుకుంటే మనుషుల ప్రాణాల్ని కాపాడుతాయని నిరూపిస్తున్నాయి. తాజాగా ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ డెంటిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్ 'సిరీల్4, సిరీస్ 5, సిరీస్ 6, సిరీస్ 7' లలో ఈసీజీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఈసీజీ యాప్' చేసే పని ఏంటంటే హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీని మెజర్ చేసి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్ వాచ్‌కు రెడ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో బాధితుల్ని వెంటనే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. హర్యానాకు చెందిన నితేష్ చోప్రా (34) వృత్తి రీత్యా డెంటిస్ట్. గతేడాది నితేష్‌కు అతని భార్య నేహా నగల్ ఈసీజీ యాప్ ఫీచర్ ఉన్న యాపిల్ వాచ్ 'సిరీస్ 6' ని బహుమతిగా ఇచ్చింది. అయితే నితేష్‌కు తాను ధరించిన యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఫీచర్ గురించి తెలియదు. ఈ నేపథ్యంలో మార్చి 12న నితేష్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడి భార్య వాచ్‌లో ఈసీజీ యాప్‌ను చెక్ చేయమని భర్తకు సలహా ఇచ్చింది. వెంటనే నితేష్ యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అతని గుండె పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేసింది. వాచ్ అలెర్ట్‌తో నితేష్ హుటాహుటీన వైద్యుల్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..నితేష్ గుండెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో ఉన్న తన భర్త ప్రాణాల్ని యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ మెయిల్ చేసింది. "నా భర్తకు 30వ పుట్టిన రోజు సందర్భంగా యాపిల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే వాచ్ నా భర్త ప్రాణాల్ని కాపాడుతుందని అనుకోలేదు. ప్రమాదంలో ఉన్నాడని స్మార్ట్ వాచ్ హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నా భర్త ఆరోగ్యం కుదుట పడింది. నా భర్తకు జీవితాన్ని ప్రసాదించిన మీకు, అందులో భాగమైన టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మెయిల్లో పేర్కొంది. అనూహ్యంగా నేహా మెయిల్‌కు టిమ్ కుక్ స్పందించారు. సకాలంలో మీ భర్తకు ట్రీట్మెంట్ అందినందుకు చాలా సంతోషిస్తున్నాను. స్మార్ట్ వాచ్ మీ భర్తను కాపాడిందనే విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ టిమ్ కుక్ నేహా మెయిల్‌కు రిప్లయి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
ఛాతిని తెరవకుండానే గుండెకు ‘ఇంపెల్లా’
సాక్షి, సిటీబ్యూరో: తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ వృద్ధునికి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యతో బాధపడుతూ ఈ నెల 14న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు 2డిఎకో పరీక్ష నిర్వహించగా, రక్తనాళాలు పూడుకుపోయి గుండె పంపింగ్ సామర్థ్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆయనకు కాలేయ మార్పిడి చికిత్స కూడా జరిగింది. దెబ్బతి న్న వాల్వ్‌ను పునరుద్ధరించేందుకు సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. కానీ రోగి వయసు రిత్యా ఇది రిస్క్‌తో కూడిన పనిగా వైద్యులు భావించారు. ఆ మేరకు ఆస్పత్రి గుండె వైద్యనిపుణులు డాక్టర్ అంజు కపాడియా, డాక్టర్ రాజీవ్‌మీనన్, డాక్టర్ స్వరూప్, డాక్టర్ ఉదయ్ కిరణ్‌లతో కూడిన వైద్య బృందం ఛాతిని తెరువకుండానే ‘ఇంపెల్లా’ వైద్య పరికరాన్ని గుండెకు అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న డివైజ్‌గా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. చదవండి: Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్ ప్రశంసలు -
శరత్‌ను పరామర్శించిన కేసీఆర్
-
శరత్‌ను పరామర్శించిన కేసీఆర్
హైదరాబాద్: సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్సుతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శరత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం పరామర్శించారు. శరత్ ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శరత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని... మరో రెండు మూడు సార్లు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు కేసీఆర్‌కు వివరించారు. శరత్ కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్మెట్టకు చెందిన కొండా శరత్ (11)కు పుట్టుకతో గుండె కవాటానికి సంబంధించిన వ్యాధి ఉంది. దాంతో అతని తల్లిదండ్రులు శరత్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించడానికి ఏర్పాటైన ‘మేక్ ఏ విష్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు గుండె జబ్బుతో బాధపడుతున్న శరత్‌ను కలిసి... నీకు ఏమైనా ఆశలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దాంతో తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని తాను ఆశపడుతున్నట్లు శరత్ వెల్లడించారు. ఆ విషయాన్ని 'మేక్ ఏ విష్' ప్రతినిధులు సీఎం కేసీఆర్ కలసి వివరించారు. దాంతో ఈ రోజు మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్‌ను కేసీఆర్ పరామర్శించారు. దాంతో శరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.