శరత్ను పరామర్శించిన కేసీఆర్ | Telangana chief minister kcr meet with 11 years old heart patient | Sakshi
Sakshi News home page

శరత్ను పరామర్శించిన కేసీఆర్

Published Thu, Aug 14 2014 2:59 PM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Telangana chief minister kcr meet with 11 years old heart patient

హైదరాబాద్: సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్సుతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శరత్ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం పరామర్శించారు. శరత్ ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శరత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని... మరో రెండు మూడు సార్లు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు కేసీఆర్కు వివరించారు. శరత్ కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

వరంగల్ జిల్లా నర్మెట్టకు చెందిన కొండా శరత్ (11)కు పుట్టుకతో గుండె కవాటానికి సంబంధించిన వ్యాధి ఉంది. దాంతో అతని తల్లిదండ్రులు శరత్కు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించడానికి ఏర్పాటైన ‘మేక్ ఏ విష్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు గుండె జబ్బుతో బాధపడుతున్న శరత్ను కలిసి... నీకు ఏమైనా ఆశలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

దాంతో తాను తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడాలని తాను ఆశపడుతున్నట్లు శరత్ వెల్లడించారు. ఆ విషయాన్ని 'మేక్ ఏ విష్' ప్రతినిధులు సీఎం కేసీఆర్ కలసి వివరించారు. దాంతో ఈ రోజు మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ను కేసీఆర్ పరామర్శించారు.  దాంతో శరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement