Dentist
-
డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ఒక్కోసారి తమ జీవితాన్ని లేదా కెరీర్‌ని కోల్పోవాల్సి వస్తుంటుంది. 'వ్యైద్యో నారాయణ హరిః" అన్న మాటకు ఎంతో విలువ ఇచ్చి మరీ రోగి చికిత్స తీసుకోవడానికి వైద్యుడి వద్దకు వస్తాడు. వైద్యులు కూడా ఆ మాటను నిజం చేసేలా వారి సమస్యను నయం చేయాలే గానీ మరింత విపత్కర స్థితిలో పడేయకూడదు. ఇలా వైద్యుడి తప్పిదాల కారణంగా ప్రాణాలు లేదా భవితవ్యాన్ని కోల్పోయిన వారెందరో ఉన్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఒక స్పీచ్ థెరపిస్ట్. ఏం జరిగిందంటే..అలిసన్ వింటర్‌బోథమ్ అనే 55 ఏళ్ల స్పీచ్ థెరపిస్ట్ 2020 నవంబర్‌లో దంత వైద్యడు డాక్టర్ అరాష్ షహరాక్ వద్ద పంటి సమస్యకు చికిత్స తీసుకుంది. ఆమె కొంతకాలంగా కుడి జ్ఞాన దంతంతో ఇబ్బంది పడతుండంతో చికిత్స కోసం వైద్యుడు షహారాక్ వద్దకు వచ్చింది. అయితే ఈ జ్ఞానదంతం రిమూవ్ చేసే సర్జరీలో నాలుక తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత నుంచి అలిసన్ వింటర్‌బోథమ్ పరిస్థితి ఘెరంగా మారిపోయింది. ఆమె జిహ్వ నాడి దెబ్బతిని కొద్దిగా మాట్లాడినా భయానక నొప్పిని భరించాల్సి వచ్చేది. చెప్పాలంటే పెదవి విప్పి మాట్లాడాలంటేనే నరకం అనేలా పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. హాయిగా రెండు మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి. అసలు నాలుకకు సంబంధించిన చికిత్స ప్రక్రియలో ఇలాంటి రిస్క్ ఉంటుందని ముందుగా హెచ్చరించకపోవడంతోనే తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నానని అలిసన్ ఆరోపిస్తోంది. స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేసే నాకు ఈ పరిస్థితి కారణంగా తన కెరీర్ నాశనమయ్యిందంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అంతేగాదు తాను ఎదర్కొంటున్న ఈ నొప్పిని మంటతో పోల్చారు. మాట్లాడుతున్న ప్రతిసారి నాలుక కాలిపోతున్నట్లుగా జలదరింపు వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. అందువల్లో తాను రోజుకి ఇద్దరు లేదా ముగ్గురు క్లయింట్లకు మాత్రమే స్పీచ్థెరపిస్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నాని పిటిషన్లో వివరించారు. అందుకుగానూదంత వైద్యుడు తనకు దాదాపు రూ. 11 కోట్లు వరకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైద్యుడు షహరక్ మాత్రం తాను అతనికి ఈ చికిత్స ప్రక్రియ గురించి కూలంకషంగా వివరించానని, ఇలా ఇంత పెద్ద రిస్క్ ఎదురవ్వుతుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. న్యాయస్థానం వాదోపవాదాలు, విచారణ అనంతరం ఏం తీర్పు ఇస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి క్రిటికల్ సర్జరీ విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలు గురించి పేషంట్‌కి వివరించి లేదా సన్నద్ధం చేసి గానీ వైద్యలు ముందుకుపోకూడదు. అలా కాదని ముందుకువెళ్లితే ఒకవేళ రోగికి ఏదైన నష్టం వాటిల్లితే అందుకు భాద్యులు ఎవరూ అనేది ఒక్కసారి ఆలోచించండి.(చదవండి: హెల్త్‌కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!) -
ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!
రోజుకి రెండు, మూడు సార్లు బ్రష్ చేసుకోండి అని దంత వైద్యులు చెప్పడం చూశాం. పైగా పడుకునే ముందు తప్పనసరిగా బ్రెష్ చేయండి అని చెబుతారు. అయితే ఇక్కడొక దంత వైద్యురాలు అందుకు విరుద్ధంగా బ్రెష్ చేసుకోవద్దని, ముఖ్యంగా ఆ మూడు సమయాల్లో బ్రష్ వెంటనే చేయొద్దని సలహాలిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ తెగ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే..? సహజంగా డాక్టర్లు బ్రష్ చేయమని చెబుతుంటారు. అలాంటిది ఈవిడ మాత్రం ఆ మూడు సమయాల్లో బష్ చేయొద్దనడం ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఇలా చెబుతోంది లండన్‌కి చెందిన డాక్లర్ షాదీ మనో చెహ్రీ. ఆమె తప్పనిసరిగా ఆ మూడు సమయాల్లో బ్రష్ చేయకుడదని చెప్పారు. ముఖ్యంగా అల్పాహారం, స్వీట్లు, వాంతులు అయినప్పుడు అస్సలు బ్రష్ చేయకూడదట. ఆ టైంలో పీహెచ్ స్థాయిలు లేదా నోటిలో ఆమ్లత్వం ఎక్కువగా అవుతాయట. ఏదైనా తిన్నప్పుడూ దంతాల మీద బ్యాక్టీరియాయా ఆ పదార్థాలను జీవక్రియ చేసి యాసిడ్‌గా మారుస్తుంది. ఆ టైంలో లాలాజలం బఫర్లు తిరిగి పనిచేయడానికి కనీసం 30 నుంచి 60 నిమిషాలు పడుతుంది. అలాగే వాంతులుచేసుకున్నప్పుడూ కూడా నోరంతా చేదుగా ఉండి ఆమ్లత్వంగా ఉంటుంది. అంటే పుల్లని విధంగా.. చెత్ల టేస్ట్‌గా ఉండే ఫీల్ ఉంటుంది. అందుకని మనం వెంటనే బ్రష్ చేసేస్తాం. కానీ ఆ టైంలో కూడా అస్సలు చేయకూడదట. ఆ విధమైన ఫీల్ తగ్గేంతవరకు ఓపిక పట్టి నిధానంగా బ్రష్ చేసుకోవాలని చెబతున్నారు. అంతసేపు ఓపిక పట్టలేం అనుకుంటే చక్కెర లేని మౌత్ఫ్రెష్నర్లు లాంటి చూయింగ్ గమ్‌లు లేదా ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వినియోగించచ్చొని సూచించారు చెహ్రీ. (చదవండి: నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం. మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్‌కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్‌ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ. ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్‌గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ. నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి! ‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్‌లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది. మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. View this post on Instagram A post shared by 🦋Dr. Rathi Anshu / Sustainability/Plant care tips , DIY, Decor (@myplantsmygarden) జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది. నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ. -
చిన్న క్లూ లేకుండా ప్లాన్ చేసి భార్యను అంతమొందించాడు..కానీ చివరికి
చాలా తెలివిగా ప్లాన్ చేసి భార్యను కడతేర్చాడు. చివరికి వైద్యులు కూడా బ్రెయిన్ డెడ్‌తో ఆమె చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఐతే ఒక నెలలో మూడుసార్లు ఆస్పత్రి పాలై ఒకేలాంటి లక్షణాలను చూపించడంతో ప్రారంభమైన అనుమానమే..అసలు కుట్రని బయటపెట్టించి హంతకుడిని పట్టించేలా చేసింది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని క్రెయిగ్ అనే డెంటిస్ట్ భార్య ఏంజెలా సడెన్‌గా చనిపోయింది. వైద్యులు కూడా ఆమె బ్రెయిన్‌డెడ్ అన్నారు. ఐతే ఒకే నెలలో మూడు సార్లు ఆస్పత్రికి వెళ్లడం ఒకేలాంటి లక్షణాలను చూపించడం తదితరాలను పరిశీలించిన పోలీసులు అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె మెడికల్ రిపోర్టు ఆధారంగా ఆమె శరరీంలో ఆర్సెనిక్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో పోలీసులు ఆమెను భర్తే హత్య చేశాడనే అనుమానంతో క్రెయిగ్‌ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను విచారణలో ఆమెకు క్రమం తప్పకుండా తానే స్వయంగా ప్రోటీన షేక్‌లు ఇస్తున్నట్లు తెలిపాడు. వాటిని తాగిన కొద్దిసేపటిలోనే అనారోగ్యానికి గురై ఆస్పత్రికి చేరడం జరిగందని, ఇలా మొత్తం మూడుసార్లు జరిగిందని పోలీసులు చెప్పారు. చివరిసారి ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయే పరిస్థితికి దారితీసిందన్నారు. అలాగే అతడు ఎలాంటి క్లూ లేకుండా ఎలాంటి విషంతో హతమార్చవచ్చో ఆన్లైన్లో పలుమార్లు శోధించినట్లు తెలిపారు. ఎన్నిగ్రాములు సైనేడ్ కలిపితే పోస్ట్‌మార్టంలో గుర్తించలేరో తెలసుకుని మరీ ఈ దారుణానికి ఒడగట్టాడని చెప్పారు. అంతేగాదు భార్య రెండురోజుల్లో ఆస్పత్రిలో చేరుతుందనగా కూడా పోటాషియం సైనేడ్‌ని ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఏంజెలా సోదరి టోనీ కోఫోడ్ కూడా నిందితుడు క్రెయిగ్ టీనేజ్ నుంచే అశ్లీలతలకు బానిసయ్యాడని, చాలామంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపింది. తన భార్య ఏంజెలాకు క్రెయిగ్ ఈ డ్రగ్‌ని సుమారు ఐదేళ్ల క్రితం నుంచి ఇస్తున్నట్లు చెపింది. అదీగాక అతడి భార్య ఏదో మత్తుమందు తాగినట్లు అనిపించిదంటూ తన భర్త మొబైల్‌కు మెసేజ్ చేసిందని కూడా పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు ఆ వ్యక్తిపై పలు ఆరోపణలు మోపి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంతవరకు కూడా తన ఆరుగురు పిల్లలను సైతం కలిసేందుకు వీలులేదని కోర్టు అతనికి స్పష్టం చేసింది. (చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..) -
వైద్యుడి భార్య అత్యుత్సాహం.. పన్ను నొప్పితో వెళితే ప్రాణాలు తీసింది..
మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితిలో ఓ వైద్యుడి భార్య అత్యుత్సాహానికి రోగి మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తపస్‌పాల్ అనే వ్యాపారి గత కొద్ది రోజులుగా పన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలిమెల సమితిలోని వైద్యుడు రవీంద్రనాథ్ వద్ద వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడు లేకపోవడంతో ఆయన భార్య బసంతి తానే స్వయంగా వ్యాపారి పన్ను తొలగించింది. అయితే, ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే అతని పరిస్థితి విషమించింది. ఎంతసేపటికీ రక్తం ఆగకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు కలిమెల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యుడితోపాటు అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా...) -
డెంటిస్ట్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: బనశంకరిలో చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంత వైద్యురాలు శైమా ఉదంతం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు తేలింది. ఆమెను పుట్టింటివారు రానివ్వకపోవడమే కారణమని బయట పడింది. కొడగు జిల్లా విరాజపేటకు చెందిన శైమా బీడీఎస్ చదువుతూ, సహచరుడు నారాయణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లలేదు. దీంతో కొన్నాళ్లకు శైమా తల్లి దిగులుచెంది విరాజపేటలో ఆత్మహత్య చేసుకుంది. ఈ పరిణామాలతో పుట్టింటివారు శైమాను తమ ఇళ్లకు రానివ్వలేదు. ఆమె నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినప్పటికీ ఎవరూ సరిగా మాట్లాడలేదు. ఈ పరిణామాలతో విరక్తి చెంది కూతురికి ఉరివేసి, తానూ ప్రాణాలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (కాలేజ్ డేస్‌లో లవ్ ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా ఎందుకు?) -
కడప వైద్యుడికి అత్యున్నత పురస్కారం
పోరుమామిళ్ల: వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల రాఘవేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ వెంకటరత్నకుమార్ అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీలో అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ డెంటిస్ట్రీ ఆఫ్ పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రపంచంలో దంత వైద్యంలో అత్యున్నత పురస్కారం ‘ది హ్యారీ డబ్లు్య.ఎఫ్.డ్రస్సెల్’ అవార్డు సాధించారు. ఈ విద్య అభ్యసించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డాక్టర్‌గా వెంకటరత్నకుమార్ నిలిచారు. కోర్సు పూర్తి చేసి అవార్డును సొంతం చేసుకోవడమే కాక అమెరికాలోని వాషింగ్టన్ ‘రివార్డ్స్ డెంటల్ క్లినిక్’లో దంత వైద్యుడిగా రూ.1.25 కోట్ల వేతన ప్యాకేజీతో నియమితులయ్యారు. కాగా, రత్నకుమార్ 2014లో కడప రిమ్స్‌లో దంత వైద్యంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. రత్నకుమార్ తండ్రి రుద్రవరం శ్రీనివాసులు విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. తల్లి దేవి గృహిణి. -
కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ
సాక్షి, బెంగళూరు: నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది. బిడ్డకు మానసిక వైకల్యం అనే కారణంతోనే తల్లి నాలుగో అంతస్తు నుంచి పడేసిందని, హత్య కేసు నమోదు చేసి తల్లి సుష్మాను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ డీసీపీ శ్రీనివాసగౌడ శనివారం తెలిపారు. బిడ్డను విసిరేస్తున్న దృశ్యం, నిందితురాలు సుష్మా భార్య చేసిన హత్యను సీసీ కెమెరాల్లో చూసిన భర్త కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆమెకు బిడ్డ భారమనిపించి ఉంటే నేనే పోషించేవాడనని చెప్పాడు. కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య సుష్మాపై ఎస్ఆర్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా బిడ్డను వదిలించుకోవాలని రైల్లో వదిలేసి వచ్చింది. అయితే ఒక ఎన్‌జిఒ సభ్యులు గాలించి కుటుంబానికి అప్పగించారు. చిన్నారిని అంతమొందించాలని అనేకసార్లు ప్రయత్నాలు చేసిందని విచారణలో తేలింది. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు 2017లోనూ ఇదే మాదిరి ఘటన కాగా, 2017లో బెంగళూరు జేపీ నగరలో సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. స్వాతి సర్కార్ అనే ప్రైవేటు స్కూల్ టీచర్.. తన కూతురు శ్రేయ సర్కార్ మానసిక వైకల్యంతో బాధపడుతోందని విరక్తి చెంది పాపను నాలుగో అంతస్తు నుంచి రెండుసార్లు కిందకు పడవేయడంతో పాప చనిపోయింది. తరువాత స్థానికులు ఆ తల్లిని పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి చావబాదారు. ఆ తల్లికి మతిస్థిమితం లేదని తేలింది. -
పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త!
What Is Dental Abscess: పంటిలోపలి భాగంలో... అంటే పన్ను చిగురుతో కనెక్ట్ అయ్యే చోట... చిగురులోగానీ లేదా లోపల ఎముక భాగంలోగానీ... ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ చీము చేరడాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అలా వచ్చిన యాబ్సెస్ ఒకవేళ పంటి చివరి భాగంలో ఉంటే ఆన్ని ‘పెరియాపికల్ యాబ్సెస్’ అనీ, అదే చిగురులో ఉంటే దాన్ని ‘పెరీడాంటల్ యాబ్సెస్’ అని అంటారు. నిజానికి మన నోళ్లలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అలాంటప్పుడు నోట్లో పన్ను దెబ్బతిన్నా... అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత అదే అంశం ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. పంటి చిగురుకు ఇన్ఫెక్షన్ కారణంగా దాన్నిండా చీము చేరడం వల్ల ‘పంటి ఆబ్సెస్’ వచ్చినప్పుడు తొలుత ఆ భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ చిగురుకూ పాకుతుంది. పంటిని వదులు చేయవచ్చు. యాబ్సెస్ ఓ చిన్నగడ్డలా ఉండి, ఒక్కోసారి అది చిదిమినట్లుగా కూడా అవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు నొప్పి లేదంటే అదేదో తగ్గిపోయిందని కాదు. అలా నిర్లక్ష్యం చేస్తే పంటి ఆబ్సెస్లోని చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు. అది చాలా రకాల కాంప్లికేషన్లకు దారి తీయవచ్చు. పంటి ఆబ్సెస్ ఉన్నచోట తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడల్లా జిల్లుమంటుంది. అదేకాదు... నమలగానే జిల్లుమన్నట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో డెంటిస్ట్‌కు చూపించకపోతే ఆ ఇన్ఫెక్షన్ దేహంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఆ సమస్యను నివారించడంతోపాటు మున్ముందు వచ్చే ఇతర దుష్ప్రభావాలను ముందే అరికట్టడం కోసం నోటిలో/పళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డెంటిస్ట్‌కు చూపించుకోవాలి. చదవండి👉🏾Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్!
విమాన ప్రమాదంలో తండ్రీ- కూతుర్ని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని ఇప్పుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్న ఓ డాక్టర్‌ను. ఇలా ప్రాంతాలు వేరైనా ఆయా ఘటనల్లో బాధితుల్ని రక్షిస్తుంది మాత్రం వస్తువులే. మనం ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ అనే సినిమా డైలాగుల్ని వినే ఉంటాం. కానీ పై సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాల్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. వస్తువుల్ని సరిగ్గా వినియోగించుకుంటే మనుషుల ప్రాణాల్ని కాపాడుతాయని నిరూపిస్తున్నాయి. తాజాగా ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ డెంటిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్ 'సిరీల్4, సిరీస్ 5, సిరీస్ 6, సిరీస్ 7' లలో ఈసీజీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఈసీజీ యాప్' చేసే పని ఏంటంటే హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీని మెజర్ చేసి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్ వాచ్‌కు రెడ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో బాధితుల్ని వెంటనే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. హర్యానాకు చెందిన నితేష్ చోప్రా (34) వృత్తి రీత్యా డెంటిస్ట్. గతేడాది నితేష్‌కు అతని భార్య నేహా నగల్ ఈసీజీ యాప్ ఫీచర్ ఉన్న యాపిల్ వాచ్ 'సిరీస్ 6' ని బహుమతిగా ఇచ్చింది. అయితే నితేష్‌కు తాను ధరించిన యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఫీచర్ గురించి తెలియదు. ఈ నేపథ్యంలో మార్చి 12న నితేష్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడి భార్య వాచ్‌లో ఈసీజీ యాప్‌ను చెక్ చేయమని భర్తకు సలహా ఇచ్చింది. వెంటనే నితేష్ యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అతని గుండె పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేసింది. వాచ్ అలెర్ట్‌తో నితేష్ హుటాహుటీన వైద్యుల్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..నితేష్ గుండెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో ఉన్న తన భర్త ప్రాణాల్ని యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ మెయిల్ చేసింది. "నా భర్తకు 30వ పుట్టిన రోజు సందర్భంగా యాపిల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే వాచ్ నా భర్త ప్రాణాల్ని కాపాడుతుందని అనుకోలేదు. ప్రమాదంలో ఉన్నాడని స్మార్ట్ వాచ్ హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నా భర్త ఆరోగ్యం కుదుట పడింది. నా భర్తకు జీవితాన్ని ప్రసాదించిన మీకు, అందులో భాగమైన టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మెయిల్లో పేర్కొంది. అనూహ్యంగా నేహా మెయిల్‌కు టిమ్ కుక్ స్పందించారు. సకాలంలో మీ భర్తకు ట్రీట్మెంట్ అందినందుకు చాలా సంతోషిస్తున్నాను. స్మార్ట్ వాచ్ మీ భర్తను కాపాడిందనే విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ టిమ్ కుక్ నేహా మెయిల్‌కు రిప్లయి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
కృత్రిమ ‘చెయ్యిచ్చాడు’
మిలన్: ఇటలీలో ఆయనో డెంటిస్టు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం సుతారమూ ఇష్టం లేదు. సోమవారం నుంచి దేశంలో ‘సూపర్ హెల్త్ పాస్’ నిబంధన అమల్లోకొస్తోంది. టీకా తీసుకున్న వారికి జారీచేసే ఈ పాస్ చూపితేనే సినిమా థియేటర్, రెస్టారెంట్, బార్లు, సాంస్కృతిక వేదికల్లోకి అనుమతిస్తారు. దాంతో 57 ఏళ్ల ఈ డెంటిస్టు అతి తెలివిని ప్రదర్శించాడు. తన చేయిని షర్ట్‌లోపల (ఛాతి భాగానికి కట్టేసుకొని) పెట్టుకుని భుజానికి సిలికాన్‌తో చేసిన కృత్రిమ చెయ్యిని తగిలించాడు. బీయిలా సిటీలో గురువారం టీకా కేంద్రానికెళ్లి టీకా వేయాలని కృత్రిమ చేతి స్లీవ్స్‌ను పైకి లేపాడు. పరధ్యానంగా నర్సు టీకా వేసేస్తుందని అనుకొన్నాడు. అయితే నర్సు ఫిలిప్పాకు చేయి పట్టుకోగానే అనుమానం వచ్చింది. ‘చర్మం చల్లగా ఉంది. అత్కుక్కుంటోంది. రంగులో తేడా ఉంది. ఒక చెయ్యి ప్రమాదంలో కోల్పోయి ఉంటాడు. పొరపాటున కృత్రిమ చెయ్యి ఇచ్చాడని అనుకొన్నాను. మరో చెయ్యి ఇవ్వమని కోరగా.. ఆయన అసలు నిజం బయటపెట్టాడు. తనకు వ్యాక్సినేషన్ ఇష్టం లేదని, పాస్ కోసమే ఇలా చేశానన్నాడు’ అని ఫిలిప్పా వెల్లడించారు. ఇటలీలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో మనోడు ససేమిరా అంటే... ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. పాస్ కోసం ఇప్పుడిలా చేసి దొరికిపోయాడు. అతని వివరాలతో ఉన్నతాధికారులకు నర్సు ఫిర్యాదు చేసింది. ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. -
ముగ్గురు డెంటిస్టులున్నా.. ఒక్కరూ చూడలే..చివరికి!
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. వారం రోజుల క్రితం అనంతారం గ్రామానికి చెందిన బాలయ్య అనే వృద్ధుడు శ్వాసకోశ సంబంధిత సమస్యతో జిల్లా ఆసుపత్రిలో చేరాడు. అప్పటినుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజులు క్రితం ఆయనకు పంటి సమస్య వచ్చింది. అన్నం తినలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని స్టాఫ్ నర్సులకు తెలియజేయగా వారు దంత వైద్యులకు మూడు రోజులుగా సమాచారం ఇస్తున్నారు. చదవండి: ‘నేను ఐపీఎస్ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్.. పెళ్లి చేసుకుందాం’ ఆసుపత్రిలో ముగ్గురు డెంటిస్టులు ఉన్నా ఒక్కరు కూడా పేషెంట్ వద్దకు వచ్చి, చూడలేదు. చివరకు శుక్రవారం ఓ డాక్టర్ బెడ్ వద్దకు రాకుండా, పేషెంట్‌ను చూడకుండానే ఒక క్రీమ్ పేరు రాసి, వాడమని పంపించడం గమనార్హం. ఆసుపత్రిలో అడిగేవారు లేకపోవడంతో పేషెంట్లను పట్టించుకునేనాథుడే కరువయ్యాడని బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి, రోగులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్ రెడ్డి -
Health Tips: నోరు అపరిశుభ్రంగా ఉంటే క్యాన్సర్తోసహా.. ఎన్నో సమస్యలు..
నోరు మంచిదైతే ఊరే కాదు... ఒళ్లూ మంచిదవుతుంది. ఈ కొత్త సామెత ఏమిటని ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు తెలుసా? అనేక అనారోగ్యాలకు మన నోరే రహదారి. అదెలాగంటే... ఎప్పుడూ నోరు శుభ్రంగా ఉంచుకుని, నోటి ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే గుండెజబ్బులూ, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి అనేక జబ్బులను నివారించుకోవచ్చు. గుండెకు కీడు చేసే ఇన్ఫెక్షన్లు నోరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు... అక్కడి నుంచి గుండెకు పాకి జబ్బును కలగజేస్తాయి. అంతేకాదు... నోరు పరిశుభ్రంగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఫలితంగా అనేక జబ్బులకు అదే కారణమవుతుంది. అంతేకాదు... అపరిశుభ్రమైన నోరు లేదా అక్కడ చేరే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అక్కడ వచ్చే కొద్దిపాటి సమస్యలైన పళ్లలో రంధ్రాలు (క్యావిటీస్), చిగుర్ల సమస్యలు (జింజివైటిస్, పెరియోడాంటైటిస్) వంటి వాటికి తేలికపాటి చికిత్సలు తీసుకుంటూ ఉంటే... పెద్ద పెద్ద జబ్బులను చాలా చవగ్గా నివారించివచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! అధ్యయనం తాలూకు కొన్ని గణాంకాలివి... ఇటీవలి కరోనా కారణంగా నోటి సమస్యలకు చికిత్స చేయించుకోవడం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు మొదటి లాక్డౌన్ దశలో దాదాపు 90 లక్షల మంది చిన్నారులు చిన్నపాటి దంతసమస్యల చికిత్సలకు సైతం పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఒక అధ్యయనం ప్రకారం... మన దేశంలో 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి దంతవైద్యుల దగ్గరికి వచ్చే చిన్నారుల శాతం 34% నుంచి 10% కి పడిపోయింది. యుక్తవయస్కుల విషయానికి వస్తే... చికిత్సకు వచ్చే పెద్దవారి సంఖ్య గత రెండేళ్లలో 32.6% నుంచి 23.6%కు పడిపోయింది. ఫలితంగా పెరుగుతున్న ముప్పు... దాంతో మునుపు తేలిగ్గా నివారితమైపోయే చాలా జబ్బుల ముప్పు ఇప్పుడు భారీగా పొంచి ఉన్నట్లు ఈ గణాంకాల వల్ల తేటతెల్లమవుతోంది. ప్రాథమికంగా చేసే స్క్రీనింగ్‌తో లేదా చిన్నపాటి సమస్య దశలోనే అంటే... పళ్లలోని రంధ్రా(క్యావిటీ)లకు చిన్నపాటి ఫిల్లింగులు, అరిగిన పళ్లకు క్రౌన్స్ అమర్చడం అనే కొద్దిపాటి చికిత్సలు, పళ్లను శుభ్రం చేసే స్కేలింగ్స్లతో తప్పిపోయే చాలా చాలా పెద్ద అనర్థాల ముప్పు ఇప్పుడు పొంచి ఉందని అర్థం. ఈ అధ్యయనాల ఆధారంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... నిన్నటి వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్యాండమిక్ ముప్పు ఇప్పుడు కొద్దిగా ఉపశమించినందువల్ల ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, చిగుర్ల సమస్యలు లేకుండా చూసుకోవడం, ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని మొగ్గ దశలోనే స్కేలింగ్, నోటి ఇన్ఫెక్షన్లకు సాధారణ చికిత్సతోనే కట్టడి చేస్తే ఎంతో పెద్ద జబ్బులనూ ముందే నివారించవచ్చన్న అవగాహనను పెంచుకోవడం చాలా ముఖ్యం. - డాక్టర్ వికాస్ గౌడ్ సీనియర్ దంతవైద్యులు, ఈస్థటిక్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ చదవండి: Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్! -
ఎండర్ఫుల్ కుకీస్
డాక్టర్ మినాల్ కబ్రా, మహారాష్ట్రలోని జల్నా నగరంలో డెంటిస్ట్. తన దగ్గరకు వచ్చే పేషెంట్లను పరీక్ష చేస్తున్నప్పుడు ఆమెకో సంగతి తెలిసింది. ముఖ్యంగా పిల్లలను పరీక్ష చేస్తున్నప్పుడు ‘ఇది వ్యక్తిగత అనారోగ్యం కాదు, సామాజిక అనారోగ్యం’ అని తెలిసింది. సమస్య మనుషుల్లో కాదు, వారు తింటున్న ఆహారంలో అని నిర్ధారణ అయింది. పిల్లలు తింటున్న చాక్లెట్లు పిల్లల దంతాలను తినేస్తున్నాయని అర్థమైంది. దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారు తినాల్సిన చిరుతిండ్ల మీద కూడా దృష్టి పెట్టాలి. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు మాటల్లో చెప్పడం ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదిది. సమస్య మూలాన్ని మార్చేయాల్సిందే. అందుకే రాగి, జొన్న, ఓట్, అవిసె గింజలు, కొబ్బరి, తోటకూర గింజలు, మునగ ఆకు, గోధుమ పిండి, బెల్లం, అల్లం, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన దినుసులతో పిల్లలు ఇష్టపడే కుకీ బిస్కెట్లు తయారు చేయిస్తోంది డాక్టర్ మినాల్ కబ్రా. మినాల్ పిల్లల ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, పర్యావరణ హితాన్ని కూడా అదే స్థాయిలో కోరుకుంటోంది. అదేంటంటే... ఆమె తయారు చేయిస్తున్న కుకీస్ ఏవీ అగ్నిపక్వాలు కాదు మొత్తం అర్కపక్వాలే. అంటే సూర్యకిరణాల వేడితో తయారవుతాయన్న మాట. వందకు చేరాలి డాక్టర్ మినాల్ కబ్రా రెండేళ్ల కిందట ‘కివు’ పేరుతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. ‘‘మా జల్నాలో ఏడాదిలో మూడు వందల రోజులు మంచి ఎండ ఉంటుంది. ప్రకతి ఇచ్చిన వనరును ఉపయోగించుకోవడంకంటే మించిన ఆలోచన ఏముంటుంది? అందుకే సోలార్ ఎనర్జీతో పని చేసే కుకీ మేకింగ్ యూనిట్ డిజైన్ చేయించుకున్నాను. మామూలుగా అయితే ప్రతి కుకీ తయారీలో ఐదు గ్రాముల కార్బన్ డయాకై ్సడ్ విడుదలై పర్యావరణంలో కలుస్తుంది. సోలార్ ఎనర్జీ ఉపయోగించడం వల్ల ఈ మేరకు నివారించవచ్చు. 2016 నుంచి ఏడాది పాటు సొంతంగా ప్రయోగం చేశాను. రెండేళ్ల కిందట పరిసర గ్రామాల్లో గ్రామానికి ఇద్దరు చొప్పున మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి సోలార్ బేకింగ్ యూనిట్లను ఇచ్చాను. ఇందులో నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు, వాళ్లు నా ఉద్యోగులూ కాదు. ఎవరి యూనిట్‌కి వాళ్లే యజమానులు. నేను కేవలం ‘ఏం చేయాలి, ఎలా చేయాలి’ అనే సూచనలు మాత్రమే ఇస్తాను. మార్కెట్ చేయడానికి ఒక వేదికను కల్పించానంతే. ఈ ఉత్పత్తులు ఇప్పటి వరకు పదిహేడు పట్టణాల్లో మొత్తం 72 స్టోర్లకు చేరాయి. వీటిని వంద క్లస్టర్లకు చేర్చాలనేది నా లక్ష్యం. ఇప్పటి వరకు 825 కిలోల కర్బన కాలుష్యాలను నివారించగలిగాం. మరోసారి చెబుతున్నాను నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు. ఒక సమాజహితమైన పని చేయడమే నా ఉద్దేశం. ఈ ప్రాక్టీస్ దేశమంతటా విస్తరింపచేయడం, కొనసాగింపచేయడం కోసం పని చేస్తాను. డెంటిస్ట్‌గా నా ప్రాక్టీస్ కొనసాగుతుంది’’ అన్నారు డాక్టర్ మినాల్. డాక్టర్ మినాల్ చేసిన ప్రయత్నం గ్రామీణ మహిళలకు మంచి ఉపాధి మార్గంగానూ మారింది. ఖర్చులు పోగా రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు మిగులుతున్నాయని చెప్పింది మినాల్ దగ్గర శిక్షణ తీసుకుని కుకీలు చేస్తున్న స్వప్న. -
వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఏం ప్రయోజనం.. వైరస్ మళ్లీ సోకింది
లండన్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఇటీవలే కరోనా బారిన పడి, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అతనికి కరోనా ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనా సోకకముందు పంత్ ఎక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అని బీసీసీఐ వర్గాలు ఆరా తీస్తుండగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. జూన్ 29న పంత్.. వెంబ్లీ స్టేడియంలో యూరో ఛాంపియన్షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్ లేకుండానే అభిమానులతో సెల్ఫీలు దిగాడు. కాగా, పంత్ ఇక్కడే కరోనా బారినపడ్డాడని అందరూ భావించారు. కానీ, అతనికి చాలా గ్యాప్ తరువాత అంటే జులై 8న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంటే పంత్‌కు ఫుట్‌బాల్ స్టేడియంలో కరోనా సోకలేదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మధ్యలో అతను జులై 5, 6 తేదీల్లో ఓ దంత వైద్యుడి సంప్రదించాడు. జులై 7న రెండో డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాడు. ఆ మరుసటి రోజే అంటే జులై 8న అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే అతనికి దంత వైద్యశాలలోనే వైరస్ సోకి ఉండవచ్చని బీసీసీఐ ప్రాధమిక నిర్ధారణకు వచ్చింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక కూడా పంత్.. వైరస్ బారిన పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంత్‌కు కరోనా డెల్టా వేరియంట్ వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో రుజువైనట్లు సమాచారం. -
డెంటల్ డాక్టర్‌ను పెళ్లాడిన 'సాహో' భామ
బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన దంతవైద్యుడు తుషన్ బిండీతో ఎవెలిన్ పెళ్లి జరిగింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్న తుషన్, ఎవెలిన్ అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో కోవిడ్ నియమ నిబంధనలతో ఈ ఏడాది మే 15న బ్రిస్బేన్‌లో వివాహం చేసుకున్నారు. తాజాగా తన పెళ్లి ఫొటోలను ఎవెలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నన్ను బాగా అర్థం చేసుకున్న నా బెస్ట్ ఫ్రెండ్ నా జీవితభాగస్వామి అయ్యారు. మేం ఇద్దరం కలిసి భార్యాభర్తలుగా జీవిస్తున్నందుకు చాలా హ్యాపీ. న్యూ లైఫ్.. న్యూ స్టార్ట్’’ అని పేర్కొన్నారు ఎవెలిన్. ‘ఏ జవానీ హై దీవాని, మై తేరా హీరో, జబ్ హ్యారీ మెట్ సెజల్’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు ఎవెలిన్. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’లో ఎవెలిన్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్ మృతి
న్యూఢిల్లీ: కరోనా ఎందరిని బలి తీసుకుందో.. ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేసిందో లెక్కేలేదు. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తుంది. కోవిడ్ బారిన పడి సామాన్యులే కాదు.. వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరినో మహమ్మారి నుంచి కాపాడిన డాక్టర్లు.. చివరికి వైరస్ చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దేశ రాజధానిలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ప్రెగ్నెంట్ అయిన డాక్టర్ కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డ చనిపోయింది. ఆ కడుపుకోతను తట్టుకోలేకపోయిన తల్లి.. మరుసటే రోజే మరణించింది. ఇక చివరి రోజుల్లో ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. ఢిల్లీకి చెందిన డాక్టర్ డింపుల్ అరోరా చావ్లా అలియాస్ దీపిక డెంటిస్ట్‌గా పని చేస్తుండేవారు. మూడేళ్ల బాబు ఉండగా.. ప్రస్తుతం రెండోసారి గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు. కానీ పది రోజుల తర్వాత ఆమె ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం ప్రారంభమయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలో భాగంగా ఆమెకు రెమిడెసివర్ ఇంజక్షన్‌తో పాటు రెండు సార్లు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. కానీ లాభం లేకపోయింది. ఆ ఎఫెక్ట్ కడుపులోని బిడ్డ మీద పడింది. చిన్నారి హృదయస్పందన ఆగిపోయింది. దాంతో వైద్యులు ఆపరేషన్ చేసి మృత పిండాన్ని తొలగించారు. అన్ని రోజుల పాటు ధైర్యంగా ఉన్న డింపుల్ బిడ్డను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనను అనుభవించారు. ఆ బాధ తట్టుకోలేక మరుసటి రోజే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కోవిడ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో.. ఆరోగ్యం ఎంతలా క్షీణిస్తుందో తెలియజేప్తు ఓ వీడియో తీశారు. దీనిలో డింపుల్ ‘‘ఎంతో ఇబ్బంది పడుతూ ఈ వీడియో తీశాను. ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే. కరోనాను లైట్ తీసుకోకండి. పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కనీసం మాట్లాడలేకపోతున్నాను. నేను చేసే విన్నపం ఒక్కటే. మీ ఆత్మీయుల కోసమైనా మాస్క్ ధరించండి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరితో మాట్లాడినా మాస్క్ ధరించే మాట్లాడండి.. ప్రాణాలు కోల్పోవడం కన్నా మాస్క్ ధరించడం ఎంతో ఉత్తమం’’ అని వేడుకున్నారు. ఇక ప్రస్తుతానికైతే మన దగ్గర గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించలేదు. కనుక వీరు వ్యాక్సిన్ తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: ముంబైలో కరోనా కల్లోలం.. చేతులెత్తి మొక్కిన మేయర్ -
ఉన్నచోటే ఉండిపోకండి కొత్తవి నేర్చుకోండి
గౌరికి నది ఇరుకై పోయింది. సముద్రంలోకి వెళ్లింది. నది అంటే న్యూఢిల్లీ లోని ‘ఎయిమ్స్’. అందులో డెంటిస్ట్ గౌరి. సముద్రం అంటే న్యూయార్క్‌లోని డబ్ల్యూ.ఎం.ఎస్.! పన్నెండేళ్లుగా పసిఫిక్ మహా సముద్రం లాంటి ఆ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇష్టంగా ఈతకొడుతూ ఉన్నారు గౌరీ. అందులోని అన్ని డిపార్ట్మెంట్ల పని నేర్చుకుని, అన్ని డిపార్ట్మెంట్లకు టీమ్ లీడర్‌గా చేశారు. ఆపరేషన్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్సా్ఫర్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్.. అన్నీ నేర్చుకున్నారు. పసిఫిక్ సముద్రం అన్ని ఖండాలను టచ్ చేస్తూ ఉన్నట్లుగానే సముద్రం లాంటి తన కంపెనీలో అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు గౌరి. ప్రస్తుతం ఆమె ఆ కంపెనీలోనే హెల్త్ కేర్ విభాగానికి బిజినెస్ యూనిట్ లీడర్ గా ఉన్నారు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మనం నిరర్థకంగా ఒడ్డున పడ్డట్లేనని అంటారు గౌరి పురి. ఉన్నచోటే ఉండి పోవద్దంటారు. గౌరీపురి తన ఈడు పిల్లల్లో కాస్త భిన్నంగా ఉన్న అమ్మాయి. కనుక ఇప్పుడూ భిన్నంగానే ఉన్నారని అనుకోవచ్చు. పదేళ్ల వయసులోని ఆమె భిన్నత్వం గురించి మొదట తెలుసుకుందాం. పిల్లలు ఆటలు ఆడే వయసులో కిందపడటం, దెబ్బలు తగలడం, అప్పుడప్పుడు రక్తం వారి కంట పడటం సహజంగా జరిగేదే. అప్పుడు మిగతా పిల్లలు భయంతో కళ్లు మూసుకుంటే గౌరి మాత్రం ఏ మాత్రం బెదురు లేకుండా ఆ దెబ్బలు తగిలిన పిల్లలకు గాయం దగ్గర తుడిచి, శుభ్రం చేసేవారట. ‘‘ప్రాథమిక చికిత్స వంటిది అనుకోండి’’ అని ఇప్పుడా సంగతులను నవ్వుతూ గుర్తు చేసుకుంటారు గౌరి. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉంటుంది వాళ్ల కుటుంబం. గౌరి అక్కడే పుట్టి పెరిగారు. 21వ యేట న్యూఢిల్లీలోని ‘ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్’లో డెంటల్ సర్జన్‌గా తనకో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె అక్కడ పని చేసింది రెండున్నరేళ్లే. తర్వాత ఆర్నెల్లు సెలవు పెట్టి.. ‘నది కాదు నాకు కావలసింది, సముద్రం’ అని అనుకుని న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లి డబ్లు్య.ఎన్.ఎస్. కంపెనీలో చేరిపోయారు! డబ్లు్య.ఎన్.ఎస్. అంటే వరల్డ్ నెట్వర్క్ సర్వీసెస్. బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్లు 1996లో ముంబైలో ప్రారంభించిన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ అది. ప్రపంచం అంతటా బ్రాంచీలు ఉన్నాయి. గౌరి కోరుకున్నట్లుగా నిజంగా అది సముద్రమే. 2007లో అందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. డెంటల్ సర్జన్కి బిజినెస్ మేనేజ్మెంట్తో ఏం పని? యూఎస్ మార్కెట్లో హెల్త్ క్లెయిమ్‌లను చక్కబెట్టడానికి వాళ్లకొక ఇండియన్ మెడికల్ డాక్టర్ కావలసి వచ్చింది. అక్కడ ఆమె 60 మంది డాక్టర్ల బృందాన్ని నడిపించాలి. గౌరి వెంటనే యూఎస్ విమానం ఎక్కేశారు. ఆ తర్వాత ఆమె కెరీర్ అంతా అంత ఎత్తులోనే ఎగురుతూ ఉంది. నేర్చుకోవడం ఆమెకు ఇష్టం. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఏ సబ్జెక్టునూ తనది కాదు అనుకోరు. అక్కడ టీమ్‌ని నడుపుతూనే ఆపరేషన్ థియేటర్స్ అని, బోర్డ్ రూమ్స్ అని లేకుండా అన్ని విభాగాల విధాన నిర్ణయాల గురించి తెలుసుకున్నారు. నిర్ణయ విధానాలను గమనించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చేరగానే మొదట బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్‌ల నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు. మూడేళ్లకే ఆ సముద్రం కూడా బోర్ కొట్టేసింది గౌరికి! సముద్రంలో ఇంకా తనకు తెలియని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని గాలించారు. డబ్లు్య.ఎన్.ఎస్. ఒక పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లు డబ్లు్య.ఎన్.ఎస్. ఖండాంతర శాఖలుగా విస్తరించి ఉంది. పైగా గౌరికి ఒకే సీట్లో హాయిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మన కెరీర్ అక్కడితో ఆఖరు అంటారు. తను చేస్తున్న పని చేస్తూనే ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ఉన్న తమ కంపెనీ వ్యవహారాలను కూడా యూఎస్ నుంచే ఆమె నడిపించారు. రోజుకు కనీసం 18 నుండి 20 గంటలు పని చేస్తారు గౌరి. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ‘‘పనే నా శక్తి’’ అని నవ్వుతారు గౌరి. కష్టం ఊరికే పోతుందా? 2017లో ఆమెకు ఎవరూ ఊహించనంత పెద్ద ప్రమోషన్. డబ్లు్య.ఎన్.ఎస్.లోని హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ యూనిట్లకు ఆమె బిజినెస్ లీడర్ అయ్యారు! ఈ మూడేళ్లలో మళ్లీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్స్ఫార్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్లో పట్టు సాధించారు. గౌరి హెల్త్ కేర్ యూనిట్‌ను చేపట్టినప్పుడు 7 శాతం మాత్రమే ఉన్న ఆ విభాగం రాబడి ఇప్పుడు ఆమె నేతృత్వంలో 20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆమె మొత్తం కలిపి 4 వేల మంది డాక్టర్లు, కోడర్స్, ఫార్మసిస్టులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌ను లీడ్ చేస్తున్నారు! వారిలో ఒక్క సీనియర్ కూడా ఇప్పటివరకు ఆమె టీమ్ నుంచి వెళ్లిపోలేదు. ఎందుకు వెళ్లిపోతారు? ఆమె దగ్గర పని చేయడమంటే ఆమెతో సమానంగా పని చేయడమేనన్న గొప్ప గుర్తింపును పొందుతున్నప్పుడు! ‘‘కొత్త విషయాలను నేర్చుకోడానికి యువ వృత్తి నిపుణులు చిన్నతనంగా భావించకూడదు. నేర్చుకోవడం అన్నది నన్ను ఈ వయసులోనూ యవ్వనోత్సాహంతో ఉంచుతోంది.’’ – గౌరి పురి (38), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డబ్లు్య.ఎన్.ఎస్. -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వాళ్లతో ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలి. ఆ చిన్నారుల వునసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. వాళ్ల పట్ల కన్సర్న్ చూపాలి. పిల్లలు నిద్రకు ఉపక్రమించే సవుయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) పెట్టకూడదు. సమస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే మౌత్ గార్డ్స్, మౌత్‌పీసెస్ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్) సమస్యలు – వూల్ అక్లూజన్, పళ్లు వదులుకావడం (లూజెనింగ్), పళ్లు పడిపోవడం, దడవ ఎముక జాయింట్ (టెంపోరో వూండిబులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణలను కలవాల్సి ఉంటుంది. చదవండి: ఈ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే.. -
నటుడి ప్రేమ పెళ్లి, ఆ వెంటనే హనీమూన్
లాక్డౌన్లో సామన్యులతో పాటు సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే వారంతా శుభ ముహూర్తాలు చూసుకుంటూ లగ్న పత్రికలు రాయించేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే టీవీ నటుడు కృష్ణ శెట్టి తన మనసు దోచుకున్న అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. తన ప్రియురాలు, డెంటిస్ట్ ప్రగ్యాను అగ్నిసాక్షిగా పెళ్లాడాడు. మంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరణ్ కుంద్రా, పౌలొమి దాస్ కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. పెళ్లైన వెంటనే తన అర్ధాంగిని వెంటేసుకుని కూర్గ్‌లో హనీమూన్‌కు వెళ్లాడు కృష్ణ శెట్టి. "నాకు పెళ్లైందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చేతులకు, కాళ్లకు మెహందీ, కాలి వేళ్లకు రింగు చూశాక అవును, నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఇదంతా కలలా అనిపిస్తోంది. అయితే ఇదంత ఈజీగా ఏమీ జరగలేదు. నా సోదరి ద్వారా ప్రగ్యాను కలిశాను. చూడగానే ఒకరికి ఒకరం నచ్చేశాం. అయితే ప్రగ్యా తల్లిదండ్రులు మాత్రం నాతో పెళ్లంటే తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే నటుడి జీవితం ఎప్పుడెలా ఉంటుందోనని భయపడ్డారు! ఆమెను ఓ ఇంజనీర్‌కో, డాక్టర్కో ఇద్దామనుకున్నారు. కానీ మేమందరం ఓసారి సమావేశమైనప్పుడు మా మధ్య ఉన్న ప్రేమను చూసి వారు కూడా ఒప్పేసుకున్నారు. ఏదేమైనా అర్థం చేసుకునే అర్ధాంగి దొరకడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Krishna Shetty (@ikrishnashetty) చదవండి: ‘మిస్ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్ మళ్లీ కలిపింది -
సెట్ టాప్ బాక్స్ రీఛార్జ్ అంటూ వచ్చి దారుణం
సాక్షి, లక్నో: నేరగాళ్లు ఏ వైపునుంచి చొరబడి ఎలా ప్రాణాలకు ముప్పు తెస్తారో తెలియని పరిస్థితి. సెట్ టాప్ బాక్స్‌ను రీఛార్జ్ చేయాలంటూ నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఒక మహిళా వైద్యురాల్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆందోళన రేపింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ నిషా సింఘాల్ (38) ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దంతవైద్యురాలుగా పని చేస్తున్నారు. ఈమె భర్త అజయ్ సింఘాల్ సర్జన్‌గా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సెట్ టాప్ బాక్స్ రిపేర్ అంటూ ఇంట్లోకి వచ్చాడు దుండగుడు. అకస్మాత్తుగా నిషాపై కత్తితో దాడిచేసి గొంతుపై దారుణంగా పొడిచాడు. ఆ తరువాత వేరేగదిలో ఉన్న పిల్లలపైనా ఎటాక్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి విధుల్లో ఉన్న నిషా భర్త అజయ్ హుటాహుటిన ఇంటికి చేరి భార్యాపిల్లలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిషా కన్నుమూయగా, చిన్నారులిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కేబుల్ టీవీ టెక్నీషియన్ శుభం పాథక్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం అతడిని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చోరీకి ప్రయత్నించి హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నా మన్నారు. -
12 గంటల్లో కిడ్నాపర్ల ఆటకట్టు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్‌లోని ఓ దంత వైద్యుడి కిడ్నాప్ కేసును సై బరాబాద్ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిం దితుల్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని హైదరాబాద్‌లోనే పట్టుకోగా, మరొకరిని అనంతపురం జిల్లా పోలీసుల సహకారంతో రాప్తాడు మండలం వద్ద అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ బుధవారం మీడియాకు వివరించారు. సులువుగా డబ్బు సంపాదించాలని.. కిస్మత్పుర గ్రామంలో నివాసముంటున్న దంతవైద్యుడు బెహజాత్ హుస్సేన్ బండ్లగూడలో ఇటీవల మూడు అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ క్లినిక్‌ను ఇటీవల ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న మిగతా ఫ్లోర్లు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఆస్ట్రేలియాలో ఉండే హుస్సేన్ భార్య సమీప బంధువు ముస్తాఫా రెండు నెలల కింద హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో బండ్లగూడలోని హుస్సేన్ డెంటల్ క్లినిక్‌పై అంతస్తులోని ఫ్లాట్లు అద్దెకు ఉన్నాయని ముస్తాఫా తెలుసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ ఆర్థిక సలçహాదారుగా పనిచేసే ముస్తాఫా అక్కడ విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి బ్యాంకుల్లో చాలా రుణాలు చేశాడు. అవి చెల్లించలేక 2019 మార్చిలో భారత్‌కు తిరిగి వచ్చాడు. పుణే, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించి ఆస్ట్రేలియాలో తనతో పాటు పనిచేసిన ముబసిర్ అహ్మద్ అలియాస్ కాలేద్తో కలసి ఆయా ప్రాంతాల్లో తిరిగాడు. అయితే చాలా అప్పులు ఉండటంతో ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించేందుకు హుస్సేన్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు లాగొచ్చని పథకం రచించాడు. పని మనిషిని పెట్టి మరీ.. ఫలక్‌నుమాకు చెందిన మహమ్మద్ రహీంను హుస్సేన్ ఫ్లాట్‌లో హౌస్‌కీపర్‌గా పని కుదుర్చుకుని దంత వైద్యుడి కదలికలపై ముస్తాఫా నిఘా పెట్టాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు వైద్యుడితో పాటు టెక్నీషియన్ మాత్రమే ఆ క్లినిక్‌లో ఉన్నట్లు రహీం ఫోన్లో దుండగులకు తెలిపా డు. కిడ్నాప్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పుణేకు చెందిన సుమిత్, అక్షయ్, విక్కీ, సల్మాన్‌లు బుర్ఖాలు ధరించి క్లినిక్‌లోకి వెళ్లా రు. బొమ్మ పిస్టల్‌తో బెదిరించి గాయపరి చా రు. టెక్నీషియన్ కాళ్లు, చేతులు కట్టేసి ము ఖానికి గుడ్డ కట్టారు. ఆ తర్వాత వైద్యుడిని ఆయన కారులోనే కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటున్న మహమ్మద్ ఇమ్రాన్, ఇర్ఫాన్‌ల ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో వైద్యుడి కుటుం బసభ్యులకు రూ.10 కోట్లు ఇస్తే విడిచి పెడతామంటూ వాయిస్ మెసేజ్ పంపారు. అయి తే, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వైద్యుడిని తీసుకెళ్లేందుకు కర్ణాటక ఉడిపికి చెందిన పునీత్, సంజయ్, సిరి, పృథ్వీల బృందం బొలెరో వాహనంలో రాత్రి 12 గంట ల సమయంలో బయల్దేరింది. కాగా, కిడ్నాప్ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్ల కారు అనంతపురం వైపు వెళ్తున్నట్లు నిర్ధారించుకుని, అనంతపురం ఎస్పీలకు సమాచారం అందించారు. సజ్జనార్ పర్యవేక్షణలో 12 బృందాలు కిడ్నాప్ విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చాలెంజ్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 12 బృందాలను పంపారు. దాదాపు 100 మందికిపైగా అధికారులు ఈ కేసును ఛేదించేందుకు రాత్రంతా పనిచేశారు. బండ్లగూడలోని డెంటల్ క్లినిక్ ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నం బర్లు గుర్తించారు. హౌస్‌కీపర్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే కూకట్పల్లి ఎల్లమ్మ బండ వద్ద నివాసముండే మహమ్మద్ ఇమ్రాన్, ఇర్ఫాన్లను, రెడ్‌హిల్స్‌లో పుణేకు చెందిన సుమిత్, అక్షయ్, వికీ దత్తా షిండేలను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు బెంగళూరుకు వెళ్తున్న మార్గంలోని ఏపీ, కర్ణాటక పోలీసులకు వాహనం వివరా లు ఇవ్వడంతో నిఘా పెట్టారు. తెలంగాణ స రిహద్దులోనే దొరకాల్సిన వీరు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే అనంతపురం ఎస్పీ సత్య యేసుబాబును అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ల ఆట కట్టించిన ‘అనంత’పోలీసులు తొలుత బొలెరో వాహనాన్ని అనంతపురం పోలీసులు ఆపే ప్రయత్నం చేయ గా, కిడ్నాపర్లు అతివేగంగా బెంగళూరు వైపు పోనిచ్చారు. దీంతో రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటుకులపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్, రాప్తాడు ఎస్ఐ పీవై ఆంజనేయులు రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి వద్ద వాహన తనిఖీ చేశారు. దీంతో కిడ్నాపర్లు కుడి వైపు టర్న్ తీసుకుని బుక్కచెర్ల వైపు వెళ్లారు. వెంటనే పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు. అదే సమయంలో ఎస్ఐ ఆంజనేయులు అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో బుక్కచెర్ల గ్రామ సరిహద్దుల్లో రాళ్లు, ముళ్ల కంపలు అడ్డు పెట్టారు. అటునుంచి బుక్కచెర్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు దారి లేకపోవడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కిడ్నాపర్లను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు వారిలో ఒక దుండగుడిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా దంత వైద్యుడు హుస్సేన్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. కిరాతకంగా హింసించి, కాళ్లతో తొక్కి, చేతి గోళ్లు పీకేశారు. ఏపీ డీజీపీ అభినందన దంత వైద్యుడిని సురక్షితంగా కాపాడి, కిడ్నాప్ చేసిన దుండగుడిని ధైర్యంగా పట్టుకున్నందుకు అనంతపురం జిల్లా పోలీసులను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. -
దంత వైద్యుడి కిడ్నాప్.. భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్‌కు చెందిన దంత వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలిస్తుండగా అనంతపురం పోలీసులు భగ్నం చేశారు. వైద్యుడిని రక్షించి ఓ కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారయ్యారు. బుధవారం వేకువజామున సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని హిమాయత్ నగర్ దర్గా సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ బెహజాట్ హుస్సేన్‌ను బురఖాలు ధరించిన వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. అతడి కుటుంబీకులకు ఫోన్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేయగా.. వారు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు అనంత వైపు వెళ్తున్నట్టు నిర్ధారించుకున్నారు. కర్నూలు, అనంతపురం ఎస్పీలకు సమాచారం అందించి కిడ్నాప్‌ను ఛేదించాల్సిందిగా కోరారు. కిడ్నాపర్ల ఆట కట్టించిన ‘అనంత’ పోలీసులు రంగంలోకి దిగిన అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు మంగళవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలకు ఆదేశించారు. బుధవారం వేకువజామున అనంతపురంలోని తపోవనం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. కిడ్నాపర్లు అతి వేగంగా బెంగళూరు వైపు పోనిచ్చారు. దీంతో అక్కడి పోలీసులు రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటుకులపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్, రాప్తాడు ఎస్ఐ పీవై ఆంజనేయులు రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి వద్ద డాల్ఫిన్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి దగ్గర కాపుగాశారు. దీనిని గమనించిన కిడ్నాపర్లు కుడి వైపు మలుపు తీసుకుని కారును బుక్కచెర్ల వైపునకు మళ్లించారు. వెంటనే పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు. ఎస్ఐ ఆంజనేయులు అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బుక్కచెర్ల గ్రామంలోకి కారు రాకుండా గ్రామస్తులు రాళ్లు, ముళ్ల కంపల్ని అడ్డుగా పెట్టగా.. కిడ్నాపర్లకు దారి తెలియక బుక్కచెర్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు దారి లేకపోవడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కిడ్నాపర్లను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు వారిలో ఒకర్ని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన నలుగురు పరారయ్యారు. పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా డెంటిస్ట్ హుస్సేన్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. డాక్టర్‌ను రక్షించి కారును, అందులో ఉన్న ఓ రివాల్వర్, ఒక కత్తి, మత్తు మందు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కిడ్నాపర్లను కూడా పట్టుకునేందుకు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డీజీపీ అభినందన అనంతపురం జిల్లా పోలీసులను ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అభినందించారు. యంత్రాంగం సకాలంలో స్పందించి డెంటిస్ట్ కిడ్నాప్‌ను భగ్నం చేసి, కిడ్నాపర్ల ముఠాను పట్టుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు. -
‘పది నిమిషాలు గడిస్తే నన్ను చంపేసేవాళ్లు’
సాక్షి, హైదరాబాద్ : మరో పది నిమిషాలు పోలీసులు ఆలస్యం చేస్తే దుండగులు కచ్చితంగా తనను చంపేసేవారని కిడ్నాప్‌కు గురైన డెంటల్ డాక్టర్ హుస్సేన్ అన్నారు. తనను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చనిపోతానని అనుకున్నానని, పోలీసుల కృషితో బతికి బయటపడ్డానని తెలిపారు. కిడ్నాప్ చేసిన నిందితుడు ముస్తఫా తనతో మర్యాదగా ప్రవర్తించేవాడని, ఎక్కడా అనుమానం రాకుండా తనను అపహరించారని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం తన క్లీనిక్ దగ్గరికి ముస్తఫా కారు వచ్చి వెళ్లిందని, ఆ తర్వాత కొద్ది సేపటికే తన క్లీనిక్ లోపకిలి కొంతమంది బురఖా ధరించి వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పారు. కాగా, డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. 12 గంటల్లో కేసును ఛేదించి, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇతర రాష్ట్రాల పోలీసులు బాగా సపోర్ట్ చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ముఖ్యంగా అనంతపురం పోలీసులు చాలా కోపరేట్ చేశారని ప్రశంసించారు. ‘కిడ్నాప్‌కు ప్లాన్ చెసిన ప్రధాన సూత్రధారి ముస్తఫా హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు. ఆస్ట్రేలియాలో బిజినెస్ చేస్తూ ముస్తఫా నష్టపోయాడు. దీంతో ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చి పూణే, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆస్ట్రేలియా లో ఉన్న సమయంలోనే పరిచమైన ఖాలీడ్తో కిడ్నాప్‌కు స్కెచ్ వేశారు. తన దగ్గర బంధువు అయిన డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కిడ్నాప్ స్కెచ్‌కు రెండు టీమ్ లను ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ నుండి కిడ్నాప్ చేసిన డాక్టర్ ను కూకట్‌పల్లికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు డాక్టర్ ను తరలించేందుకు మరో టీంను రెడీ చేసుకున్నారు. సుమిత్ ,అక్షయ్, విక్కీ , సల్మాన్ లు క్లినిక్ లో ఉన్న హుస్సేన్‌ను బూరఖా ధరించి దాడి చేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 48 గంటల్లో రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. మొత్తం 12 టీమ్‌లు రంగంలోకి దిగి 12 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించాం. ఈ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచి సహకారం చేశారు. ముఖ్యంగా అనంతపురం పోలీసులు అద్భుత సహకారం అందించారు’ అని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు. -
సూసైడ్ నోట్లో ఏముందో?
ఇటీవల చోటుచేసుకున్న దంత వైద్యురాలు మాధవీలత ఆత్మహత్య ఘటన నంద్యాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. భర్తతో అన్యోన్యంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్లో ఉన్న వివరాలు పోలీసులు బయటకు చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణకిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత(47) మెడిసిన్ చదుకునే సమయంలో ప్రేమించుకొని, 20 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో సొంతంగా శ్రీరమణ కాస్మొటిక్ దంతవైద్యశాలను నడుపుతున్నారు. వీరికి మెడిసిన్ చదివే కుమారుడు ఉన్నాడు. పట్టణంలోని టెక్కె భరతమాత ఆలయం వద్ద ఇల్లు కొనుగోలు చేసి, ఇక్కడే నివాసం ఉంటూ ఆసుపత్రిని నడుపుతున్నారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్.. ఈనెల 16న మాధవీలత(47) ఆత్మహత్య చేసుకుంది. భర్తతో ఎలాంటి ఇబ్బందులు లేవని, వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని మృతురాలి తండ్రే చెబుతున్నాడంటే వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు విలేకరులకు వెల్లడించిన టూటౌన్ సీఐ కంబగిరిరాముడు.. అందులో ఏముందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించనట్లు తెలుస్తోంది. అసలు మాధవీలత మృతి మిస్టరీని పోలీసులు ఛేదిస్తారా.. లేక కేసును నీరుగారుస్తారా.. అన్న విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దర్యాప్తులో భాగంగానే సూసైడ్ నోట్లో ఉన్న వివరాలను బయటకు వెల్లడించడం లేదని టూటౌన్ సీఐ కంబగిరిరాముడు చెబుతున్నారు.