
ప్రతీకాత్మక చిత్రం
మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితిలో ఓ వైద్యుడి భార్య అత్యుత్సాహానికి రోగి మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తపస్‌పాల్ అనే వ్యాపారి గత కొద్ది రోజులుగా పన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలిమెల సమితిలోని వైద్యుడు రవీంద్రనాథ్ వద్ద వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడు లేకపోవడంతో ఆయన భార్య బసంతి తానే స్వయంగా వ్యాపారి పన్ను తొలగించింది.
అయితే, ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే అతని పరిస్థితి విషమించింది. ఎంతసేపటికీ రక్తం ఆగకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు కలిమెల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్యుడితోపాటు అతని భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(చదవండి: ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా...)
Comments
Please login to add a commentAdd a comment