చంపి సూట్‌కేస్‌లో కుక్కి.. | Preethi Reddy Indian origin Dentist Murdered in Australia | Sakshi
Sakshi News home page

ఎన్నారై వైద్యురాలు దారుణ హత్య

Published Wed, Mar 6 2019 10:03 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Preethi Reddy Indian origin Dentist Murdered in Australia - Sakshi

మెల్‌బోర్న్‌ : గత ఆదివారం నుంచి ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఎన్నారై డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సిడ్నీలోని సౌత్‌ వేల్స్‌ ప్రాంతంలో పార్క్‌ చేసి ఉన్న ఆమె కారులోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే అనగా బుధవారం ఆమె మాజీ ప్రియుడు హర్ష వర్థన్‌ కూడా రోడ్డు ప్రమాదంలో  చనిపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు.

సెయింట్‌ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కన్పించలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కానీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతిరెడ్డి అదృశ్యం, హత్య వెనక మిస్టరీ ఉన్నట్లు భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా మెక్‌ డోనాల్డ్‌కు ప్రీతి వెళ్లినట్లు.. ఆ సమయంలో ఆమెతో పాటు హర్ష వర్థన్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు తెలపాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement