stab to death
-
ఘోరం.. గోడపై మూత్రం పోశాడని వెంటాడి చంపారు
ఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. బిజీ మార్కెట్లో అంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి మరీ కత్తితో హతమార్చింది ఓ గ్రూప్. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఇలా హత్యకు దారి తీసింది. మయాంక్(25) అనే హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి.. గురువారం సాయంత్రం ఓ ఇంటి గోడపై మూత్రం పోశాడు. అయితే ఆ ఇంటి యాజమానురాలు మయాంక్‌ను మందలించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.. ఆమెను మయాంక్ దుర్భాషలాడడంతో వివాదం పెద్దది అయ్యింది. ఆమె కొడుకు మనీష్ జోక్యం చేసుకోవడంతో.. అతనిపైనా దాడికి దిగాడు మయాంక్. దీంతో మనిష్.. తన స్నేహితులను పిలిచి.. మయాంక్‌ను వెంబడించారు. దక్షిణ ఢిల్లీ డీడీఏ మార్కెట్ సమీపంలో మాలవియా నగర్ దగ్గర అంతా చూస్తుండగానే మయాంక్‌ను వెంటాడి పొడిచి చంపేశారు. ఘటన తర్వాత నిందితులంతా తలోదిక్కు పారిపోయారు. మయాంక్‌ను స్థానికులు ఎయిమ్స్‌ను తరలించినప్పటికీ.. లాభం లేకుండా పోయింది. సీసీ టీవీ ఫుటేజీలో ఈ హత్య ఘటన నమోదు కాగా.. సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. నిందితులు మనీష్, రాహుల్, అశిశ్, సూరజ్‌లను పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యోందతం వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు వాళ్లు. A hotel management student was stabbed to death on road in full public view in #Delhi. The attack was captured on CCTV. The incident happened at a market in #MalviyaNagar. Mayank was with a friend at the market when 4-5 people came running towards him with knives: #DelhiPolice pic.twitter.com/fJiVfMDneN — Hate Detector 🔍 (@HateDetectors) August 12, 2022 -
భర్తను చంపి.. ఫేస్బుక్లో పోస్ట్ చేసి
న్యూఢిల్లీ: మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి. క్షణికావేశంలో.. ప్రేమాభిమానాలను మరిచి రాక్షసులుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కొకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను చంపి.. ఈ సమాచారాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాప్రయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన మహిళ తన భర్తతో కలిసి 2013 నుంచి దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్పూర్ ఎక్స్టెన్షన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. భార్యాభర్తలిద్దరు వేర్వేరు ఇన్సూరెన్స్ కంపెనీల్లో పని చేస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇంత వరకు సంతానం కలగలేదు. ఇక ఇద్దరి మధ్య సంబంధాలు కూడా సరిగా ఉండేవి కావని ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈ క్రమంలో శనివారం భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో సదరు మహిళ భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. (చదవండి: ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా..) ఇక సోమవారం ఈ ఎఫ్బీ పోస్ట్‌ని గమనించిన పక్కింటి వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం అందిచండంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్ లోపలి వైపు లాక్ చేసి ఉండటంతో.. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ సదరు మహిళ భర్త చనిపోయి రక్తపు మడుగులో పడి ఉండగా.. ఇక నిందితురాలు కొన ఊపిరితో కొట్టుకుంటుంది. తక్షణమే పోలీసులు ఆమెని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే సదరు మహిళ మీద కేసు నమోదు చేశారు. ఇక ఆమె కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేయాలని భావిస్తున్నారు. -
25 కత్తిపోట్లు, కామాంధుడు హతం!
భోపాల్: లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపట్ల ఓ మహిళ అపర కాళికలా మారింది. అతనిపై తిరబడి కత్తితో 25 పోట్లు పొడిచింది. నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో గత సోమవారం జరిగింది. మృతున్ని బ్రిజ్‌భూషన్ శర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అశోక్ నగర్లో నివాసముండే శర్మ తనపై గత 15 ఏళ్లుగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు శర్మ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దాంతోపాటు ఆ వీడియోలు తీసి ఇన్నేళ్లుగా బ్లాక్మెయిల్ చేశాడని తెలిపింది. (చదవండి: ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం) పెళ్లి చేసుకుని తన బతుకు తాను బతుకున్నా విడిచిపెట్టలేదని వాపోయింది. ఆనాటి వీడియోతో నిత్యం వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు కూడా అతని తీరు మారలేదని తెలిపింది. పని నిమిత్తం తన భర్త బయట వెళ్లాడని, అదే సమయంలో తప్పతాగి వచ్చిన శర్మ తనపై అఘాయిత్యానికి పూనుకున్నాడని చెప్పింది. తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశానని వెల్లడించింది. ఆ కామాంధుడి వల్ల తన జీవితం నాశనమైందని, తన ఇద్దరు పిల్లలు, భర్తకు దూరంగా జైలు జీవితం గడపాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, నిందితురాలిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు. (చదవండి: కన్నేసి... కాటేసి..) -
చూస్తే పిచ్చోళ్లే.. కానీ అతి కిరాతకులు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దారుణంగా పొడిచి చంపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని బీజాదండి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనేరి గ్రామంలో ఈ దారుణ హత్యలు జరిగాయి. మతి స్థిమితం సరిగా లేని హరీష్ సోని, అతని సోదరుడు సంతోష్ సోని ఈ హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ఇంటి ముందర నుంచి ఏదైనా వాహనం హారన్ సౌండ్ చేస్తూ వెళ్తే గొడ్డలి చేత పట్టుకుని వెంబడిస్తారని.. వారి ఎదురుగా ఫోన్లో మాట్లాడితే.. దాడి చేసేవారని పోలీసులు తెలిపారు. హత్యల గురించి తెలియడంతో పోలీసులు హరీష్, సంతోష్‌లను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. కానీ నిందితులు గొడ్డలి, కత్తి, కారం పోడితో పోలీసుల మీద దాడి చేశారు. దాంతో కాల్పులు జరపడంతో ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో మరొకిరిని గ్రామస్తులు వెంటాడి చంపేశారు. (పదేళ్ల బాలుడు పది లక్షలు కొట్టేశాడు) -
తండ్రి దారుణ హత్య.. జూమ్‌కాల్‌లో లైవ్
వాషింగ్టన్: తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ భయానక దృశ్యాన్ని జూమ్ వీడియో చాట్‌లో ఉన్న వారు చూసి పోలీసులకు కాల్ చేశారు. వివరాలు.. అమిటీవిల్లేలోని సౌత్ ఓక్స్ హాస్పిటల్ సమీపంలో నివాసం ఉంటున్న డ్వైట్ పవర్స్(70) గురువారం తన స్నేహితులతో జూమ్ యాప్‌లో వీడియో చాట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన డ్వైట్ పవర్స్ కొడుకు స్కల్లీ పవర్స్(32) కత్తితో తండ్రిపై దాడి చేసి చంపేశాడు. జూమ్ వీడియో చాట్‌లో ఉన్న డ్వైట్ స్నేహితులు ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూశారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అయితే పోలీసులు వచ్చే లోపే స్కల్లీ అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ గంటల వ్యవధిలోనే స్కల్లీని అరెస్ట్ చేశారు పోలీసులు. తండ్రికొడుకుల మధ్య అసలేం జరిగింది..ఎందుకు స్కల్లీ తండ్రిని చంపాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. -
చనిపోతూ.. బిడ్డకు జన్మనిచ్చింది
లండన్ : ఎనిమిది నెలల గర్భిణిపై కత్తితో దాడి చేసి చంపిన ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమె గర్భంలోని శిశివును వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాలు.. క్రొయిడన్ ప్రాంతలో శనివారం రాత్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎనిమిదినెలల గర్భిణి మహిళను పోలీసులు గుర్తించారు. సదరు మహిళ కత్తిపోట్లకు గురయ్యి ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అయితే మహిళ చనిపోతుందని భావించిన వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులోని బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం ఈ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ మృతితో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మహిళను ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. -
చంపి సూట్‌కేస్‌లో కుక్కి..
మెల్బోర్న్ : గత ఆదివారం నుంచి ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సిడ్నీలోని సౌత్ వేల్స్ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే అనగా బుధవారం ఆమె మాజీ ప్రియుడు హర్ష వర్థన్ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కన్పించలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కానీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతిరెడ్డి అదృశ్యం, హత్య వెనక మిస్టరీ ఉన్నట్లు భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా మెక్ డోనాల్డ్‌కు ప్రీతి వెళ్లినట్లు.. ఆ సమయంలో ఆమెతో పాటు హర్ష వర్థన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు తెలపాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
తల్లిదండ్రులు, చెల్లెలిపై బీటెక్ విద్యార్థి కిరాతకం
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తన ‘స్వేచ్ఛ’కు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు, చెల్లెలిపై కోపం పెంచుకున్న బీటెక్ విద్యార్థి, వారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు. చివరికి నేరాన్ని అంగీకరించి కటకటాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... మిథిలేశ్ అనే ఇంటీరియర్ డిజైనర్ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నాడు. కొడుకు సూరజ్(19).. గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. స్నేహితులతో తిరగొద్దని, వాళ్లను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న సూరజ్.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా తన మొబైల్ చెక్ చేస్తూ వారికి తన గురించి చాడీలు చెబుతున్న చెల్లెల్ని(16) కూడా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన సూరజ్.. బెడ్రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. కట్టుకథ అల్లాడు.. హత్య చేసిన తర్వాత ఇరుగుపొరుగు వారిని పిలిచిన సూరజ్ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వారికి అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు. ఈ ఘటనతో ఉలికిపడ్డ పక్కింటి వారు సూరజ్‌ను సముదాయించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే సూరజ్ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. విచారణ జరుపుతున్న క్రమంలో హత్యకు కారణం దొంగలు కాదని.. తన తల్లి, చెల్లెలిని కత్తితో పొడిచింది తండ్రేనని.. అందుకే ఆయనను చంపానని సూరజ్ పోలీసులకు చెప్పాడు. కానీ మిథిలేశ్‌కు అలాంటి వాడు కాదని.. భార్యా పిల్లలను ప్రేమగా చూసుకునే వాడని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో సూరజ్‌ని మరోసారి లోతుగా విచారించారు. ఈ క్రమంలో కామన్ గేట్ తాళం చెవి ఆధారంగా నిందితుడు సూరజేనని కనిపెట్టగలిగారు. 2013లో కిడ్నాప్ నాటకం... చిన్ననాటి నుంచే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సూరజ్‌కు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ సరిపోయేది కాదు. అంతేకాకుండా తమది సంపన్న కుటుంబమైనా తల్లిదండ్రులు తనకి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని 2013లో కిడ్నాప్ నాటకం ఆడాడు. స్నేహితుల దగ్గరే కొన్నాళ్లపాటు ఉన్న సూరజ్ కిడ్నాప్ అయ్యానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేశాడు. -
సుపారీ హత్య
► వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు ► ఆస్తి తగాదాలే కారణం: పోలీసుల అదుపులో ఇద్దరు బహదూర్‌పురా: ఆస్తి తగాదాల నేపథ్యంలో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపారు. హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ హత్య జరిగింది. ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ కథనం ప్రకారం... మూసాబౌలికి చెందిన మీర్జా ఖలీల్ బేగ్ (50) ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి. ఇతని ఖదీర్‌బేగ్ అనే సోదరుడున్నాడు. వీరి కుటుంబానికి ఓ ఇల్లు ఉంది. ఖలీల్‌బేగ్‌కు చెప్పకుండానే సోదరుడు ఖదీర్‌బేగ్ ఆ ఇంటిని ముజుబుల్లా షరీఫ్ అనే వ్యక్తికి విక్రయించాడు. విషయం తెలుసుకున్న ఖలీల్ బేగ్ నన్ను సంప్రదించకుండా.. నా ఇల్లు ఎలా కొన్నావని షరీఫ్‌తో గొడవ పడ్డాడు. ఇంటి విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్... ఖలీల్‌బేగ్‌ను హత్య చేయించాలని నిర్ణయించాడు. కొందరికి సుపారీ ఇచ్చి రంగంలో దింపాడు. సోమవారం ఉదయం 10 గంటలకు ఐదురుగు దుండగులు మూసాబౌలీలో ఖలీల్ బేగ్‌ను కత్తులతో పొడిచి అతిదారుణంగా చంపేశారు. హతుడి కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు ఏడుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఐదుగురు ఈ హత్యలో పాల్గొనట్టు గుర్తించామని, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూసాబౌలి చౌరస్తాలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.