
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దారుణంగా పొడిచి చంపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని బీజాదండి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనేరి గ్రామంలో ఈ దారుణ హత్యలు జరిగాయి. మతి స్థిమితం సరిగా లేని హరీష్ సోని, అతని సోదరుడు సంతోష్ సోని ఈ హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ఇంటి ముందర నుంచి ఏదైనా వాహనం హారన్ సౌండ్ చేస్తూ వెళ్తే గొడ్డలి చేత పట్టుకుని వెంబడిస్తారని.. వారి ఎదురుగా ఫోన్‌లో మాట్లాడితే.. దాడి చేసేవారని పోలీసులు తెలిపారు. హత్యల గురించి తెలియడంతో పోలీసులు హరీష్, సంతోష్‌లను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. కానీ నిందితులు గొడ్డలి, కత్తి, కారం పోడితో పోలీసుల మీద దాడి చేశారు. దాంతో కాల్పులు జరపడంతో ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో మరొకిరిని గ్రామస్తులు వెంటాడి చంపేశారు.
(పదేళ్ల బాలుడు పది లక్షలు కొట్టేశాడు)
Comments
Please login to add a commentAdd a comment