ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు నమోదు చేసిన భారతీయ తల్లీకూతురు | Indian Australian mother daughter Create Record In Australian Royal Airforce | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు నమోదు చేసిన భారతీయ తల్లీకూతురు

Published Thu, May 19 2022 2:33 PM | Last Updated on Thu, May 19 2022 7:35 PM

 Indian Australian mother daughter Create Record In Australian Royal Airforce - Sakshi

ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కుటుంబం రికార్డు సృష్టించింది. రాయల్‌ ఆస్ట్రేలియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో స్థానం సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఆస్ట్రేలియా రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్థానం సాధించిన తల్లీ కూతుళ్లుగా ఇద్దరు రికార్డు సృష్టించారు. 

భారత్‌కు చెందిన మంజీత్‌ కౌర్‌ తన భర్త రూప్‌సింగ్‌తో కలిసి 2009లో స్టూడెంట్‌ వీసా మీద అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. అనంతరం రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్‌ వింగ్‌లో అధికారిగా 2017లో ఆమె చేరారు. ఆ తర్వాత ఐదేళ్లకు మంజీత్‌ కౌర్‌ కూతురు కుశ్రూప్‌కౌర్‌ సంధు 2022లో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ వుమన్‌గా ఉద్యోగం సాధించారు.

మంజీత్‌కౌర్‌ ఆస్ట్రేలియా ఎయిర్‌ఫోర్స్‌ మెడికల్‌ వింగ్‌లో పెట్టేప్పటికే కుశ్రుప్‌ 15 ఏళ్ల టీనేజర్‌గా ఉంది. అయితే దేశం కాని దేశంలో తన తల్లి సాధించిన ఘనతల నుంచి స్ఫూర్తి పొందిన కుశ్రుప్‌ పట్టుదలతో ఆస్ట్రేలియా ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా నియమితురాలైంది. మహిళలు ఏ రంగంలోనూ పురుషులకు తీసిపోరని ఈ తల్లీబిడ్డలు మరోసారి రుజువు చేశారు.

చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement