ఆ‍స్ట్రేలియా అవార్డు రేసులో.. భారత సంతతి యువతి | NRI Natasha Jha Bhaskar shortListed For Young Australian Award | Sakshi
Sakshi News home page

ఆ‍స్ట్రేలియా అవార్డు రేసులో.. భారత సంతతి యువతి

Published Thu, Mar 10 2022 2:33 PM | Last Updated on Thu, Mar 10 2022 2:42 PM

NRI Natasha Jha Bhaskar shortListed For Young Australian Award - Sakshi

భారత మూలాలు ఉన్న ఆస్ట్రేలియా మహిళా నటాషా ఝా భాస్కర్‌ ప్రతిష్టాత్మక యంగ్‌ ఆస్ట్రేలియన్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ 2022 అవార్డుకి అడుగు దూరంలో నిలిచింది. ఈ అవార్డు కోసం ఇటీవల ప్రకటించిన 25 మందితో కూడిన తుది జాబితాలో నటాషా కూడా ఉంది. ప్రభుత్వ, పైవేటు రంగాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పని చేస్తున్న మహిళలను ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకున్నారు. 

భారత సంతతికి చెందిన నటాషా ఝా భాస్కర్‌ ఆస్ట్రేలియాలోని న్యూలాండ్‌ గ్లోబల్‌ గ్రూప్‌ (ఎన్‌జీజీ) జనరల్‌ మేనేజర్‌ హోదాలో పబ్లిక్‌ పాలసీ ఎక్స్‌పర్ట్‌గా పని చేస్తున్నారు. ఇండియా ఆస్ట్రేలియా సంబంధాల విషయంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. సిడ్నీలో ఆమె నివసిస్తున్నారు. ఇండియన్‌ పార్లమెంట్‌ పాలసీకి సంబంధించి ఆమెకు 12 ఏళ్ల అనుభవం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement