మాజీ ప్రియుడి కారణంగా ఓ ఎన్నారై యువతి చిక్కుల్లో పడింది. తనతో తిరిగి స్నేహం చేయలంటూ ఒత్తిడి చేస్తున్న అతనికి కుటుంబ సభ్యులతో కలిసి గట్టిగా బుద్ధి చెప్పింది. యువతి సాహచర్యం కోసం దిగజారి ప్రవర్తించిన ఆ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు.
అహ్మదాబాద్ నగరానికి చెందిన పార్థ్ చంపానేరి (23)కి స్థానికంగా ఉన్న యువతితో గతేడాది పరిచయమైంది. తర్వాత కాలంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు చాలా చనువుగా మెలిగారు. ఈ సమయంలో ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫోటోలను పార్థ్, తన ఫోన్‌లో షూట్ చేశాడు.
ఇటీవల మనస్పర్థలు రావడంతో ఆ యువకుడితో స్నేహానికి ఆమెకి చెక్ పెట్టింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి పోయింది. అయితే తనతో స్నేహం కొనసాగాలించాలంటూ ఆ పార్థ్ ఆ యువతిని వేధించడం ప్రారంభించారు. దీంతో అతని ఫోన్ నంబర్ బ్లాక్‌లో పెట్టింది.
తన ఫోన్ నంబర్ బ్లాక్ పెట్టడంతో నీచానికి దిగజారాడు పార్థ్. తామిద్దరు సన్నిహితంగా మెలిగిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ యువతి కుటుంబ సభ్యులకు సైతం పంపాడు. వెంటనే తన నంబర్ అన్ బ్లాక్ చేయాలని, తనతో మాట్లాడాలటూ కండీషన్ పెట్టాడు. అలా చేయని పక్షంలో పర్సనల్ వీడియోలను మరింతగా వైరల్ చేస్తానంటూ బెదిరించాడు.
పార్థ్ నుంచి వేధింపులు శృతిమించడంతో వెంటనే యువతి జరిగిన విషయం ఇండియాలో ఉన్న తండ్రికి తెలిపింది. వెంటనే అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పార్థ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. సోషల్ మీడియాతో పాటు అతని ఫోన్ నుంచి ఈ వీడియోలు డిలీట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అహ్మాదాబాద్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment