ex lover
-
మాజీ లవర్‌కు ఫుడ్ ఆర్డర్.. జొమాటో ఇచ్చిన ట్విస్ట్ వేరే లెవల్
భోపాల్: ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్.. జొమాటో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో మొబైల్, అందులో యాప్ ఉంటే చాలు.. కేవలం ఒక క్లిక్‌తో కస్టమర్లు వద్దకే పుడ్ డెలివరీ చేస్తుంది. తాజాగా ఓ ఘటనపై జోమాటో సంస్థ స్పందించి ట్వీట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడి కోసం జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత జొమాటో అనితకు ఊహించిన షాకిచ్చింది. అంకిత పెట్టిన పుడ్ ఆర్డర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంది. అనగా డెలివరీ అందుకున్న కస్టమర్ ఆ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అంకిత ఆర్డర్ పెట్టింది తన మాజీ లవర్ కోసం... అతనేమో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. ఇలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు జరిగింది. దీంతో ఏకంగా జొమాటోనే జోక్యం చేసుకుంది. "భోపాల్‌కు చెందిన అంకితా దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై పుడ్ పంపడం ఆపండి. ఇది మూడోసారి - అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నాడు" అని ట్వీట్ చేసింది. దీంతో పాటు అదనంగా .."దయచేసి ఎవరైనా అంకితా ఖాతాలో క్యాష్ ఆన్ డెలవరీ బ్లాక్ చేసినట్లు చెప్పగలరు. ఆమె ఈ విషయం తెలియక 15 నిమిషాలకు ఒకసారి మళ్లీ ప్రయత్నిస్తోంది" అని తెలిపింది. కాగా ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో 9 లక్షల వ్యూస్, 12,000 లైక్‌లు, 855 రీట్వీట్లు వచ్చాయి.ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు .. ఈ ఐడియా ఏదో బాగుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay! — zomato (@zomato) August 2, 2023 చదవండి ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. ఏకంగా కాలేజ్‌కి -
‘ఆమెది భరించలేని మోసం.. గుండెలోతుల్లో ఆ బాధను అనుభవించా!’
-
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్‌తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్‌ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్‌ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్‌లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్‌ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్‌లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్‌కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్‌లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త పెళ్లికొడుకును చంపింది మాజీ ప్రియుడే!
క్రైమ్: ప్రేమించానంది. వెంట తిరిగింది. కానీ, చివరకు తనను కాదని మరో వ్యక్తిని వివాహమాడింది. అది తట్టుకోలేకపోయాడు. మరిచిపోలేని గుణపాఠం నేర్పాలనుకున్నాడు. డేంజరస్ కానుకతో మాజీ ప్రేయసి సహా ఆమె అత్తింటివాళ్లందరినీ చంపాలని ప్లాన్ వేశాడు. కానీ, అది వికటించి కొత్త పెళ్లి కొడుకు, అతని సోదరుడు చనిపోయారు. చివరకు సైకో ప్రియుడు పోలీసులకు దొరికిపోయాడు. ఛత్తీస్‌గఢ్ ఖబిర్దామ్ హోం థియేటర్ పేలుడు ఘటనలో మిస్టరీని స్థానిక పోలీసులు చేధించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని.. కావాలనే చేసిన పని అని తేల్చారు పోలీసులు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఆమె అత్తింటి కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఏప్రిల్ 1వ తేదీన హేమేంద్ర మేరావికి స్థానికంగా ఉండే ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా భారీగా కానుకలు వచ్చాయి. ఆ మరుసటి రోజు కానుకలు ఉంచిన గదిలోకి హేమేంద్ర, కుటుంబ సభ్యులు వెళ్లారు. అందులోంచి హోం థియేటర్‌ను తీయగా.. అది భారీ విస్పోటనంతో పేలిపోయి హేమేంద్ర అక్కడికక్కడే మరణించాడు. పేలుడు ధాటికి ఆ గది గోడలు, పైకప్పు సైతం కూలిపోయాయి. హేమేంద్ర సోదరుడు రాజ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరో నలుగురు(ఏడాదిన్నర బాలుడు కూడా) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ హోం థియేటర్ ఇచ్చింది సార్జూ అనే యువకుడని, అతనికి నవవధువుకి గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని తేల్చారు. మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంలో అతను ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేశాడట. హోం థియేటర్లో బాంబు ఫిక్స్ చేసి ఇచ్చాడట. అలా చివరకు రెండు ప్రాణాలు పోవడంతో పాటు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఇదీ చదవండి: ఊయలలో బొమ్మ.. కాలువలో నిహారిక -
మాజీ లవర్‌తో న్యూ ఇయర్ వేడుకల్లో స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భూలయ్యా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్యార్ కా పంచ్‌నామా చిత్రంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా పారిస్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023కి స్వాగతం పలుకుతూ ఆదివారం ఓకే ప్రదేశంలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. గతంలో సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేశారు కార్తీక్ ఆర్యన్. అయితే ఈ జంట బ్రేకప్ విషయాన్ని గురించి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒకసారి కరణ్ జోహార్ మాత్రమే తన చాట్ షోలో వీరిద్దరి రిలేషన్‌ను ప్రస్తావించారు. గతంలో ఈ జంట 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో నటిస్తున్నప్పుడు ఏడాది పాటు డేటింగ్లో ఉన్నారు. సినిమాల విషయాకొనిస్తే కార్తిక్ ఆర్యన్ చేతిలో 'షెహజాదా', 'సత్యప్రేమ్ కీ కథ', 'ఆషికి 3' 'కెప్టెన్ ఇండియా' ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో అనౌన్స్', 'గ్యాస్‌లైట్', 'నఖ్రేవాలి', విక్కీ కౌశల్‌తో లక్ష్మణ్ ఉటేకర్ అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
లైవ్‌లో ఎక్స్‌లవ్, బ్రేకప్‌పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే..
Rashmika Mandanna About Her Ex Love: రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరస సినిమాల సక్సెస్, సోషల్ మీడియా ఫ్యాన్డమ్ను ఎంజాయ్ చేస్తోంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నెట్టింట సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది రష్మిక. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆమె తాజాగా యూట్యూబ్‌లో సైతం అడుగు పెట్టింది. తాను యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేసినట్లు గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా లైవ్ సెషన్ నిర్వహించిన రష్మికకు ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తనకు నటన అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అలాగే ట్రావెలింగ్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, అవి ఎందుకు అంత ఇష్టమో కూడా వివరించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ తన ఎక్స్ లవ్, ఎంగేజ్మెంట్ బ్రేకప్‌పై ప్రశ్నించాడు. ‘ప్రతి ఒక్కరికి మీ ఎక్స్ లవ్ గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ మీరు తనతో ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంది’ అంటూ ఆరా తీశాడు.ఇక అన్ని ప్రశ్నలకు టకటక సమాధానాలు చెప్పిన రష్మిక.. దీనికి మాత్రం ఎలాంటి బదులు ఇవ్వకుండ ఆ ప్రశ్నను దాటేసింది. కాగా రష్మిక కన్నడ నటుడు, తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ మూవీ కోస్టార్ రక్షిత్ శెట్టితో కొంతకాలం ప్రేమలో మునిగి తేలిన సంగతివ తెలిసిందే. చదవండి: గుర్తు పట్టలేనంతగా ‘ఓయ్’ హీరోయిన్ షామిలీ, ఫొటోలు వైరల్ ఈ క్రమంలో 2018లో అతడితో నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక తెలుగులో ఆమె నటించిన గీతా గోవిందం మూవీ అనంతరం రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేసుకుంది. అప్పట్లో కన్నడ పరిశ్రమలో ఈ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి దగ్గర అయితే సెక్యూర్‌గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‌గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ-రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
పర్సనల్ వీడియోలు లీక్ చేసిన మాజీ ప్రియుడు.. చిక్కుల్లో ఎన్నారై యువతి
మాజీ ప్రియుడి కారణంగా ఓ ఎన్నారై యువతి చిక్కుల్లో పడింది. తనతో తిరిగి స్నేహం చేయలంటూ ఒత్తిడి చేస్తున్న అతనికి కుటుంబ సభ్యులతో కలిసి గట్టిగా బుద్ధి చెప్పింది. యువతి సాహచర్యం కోసం దిగజారి ప్రవర్తించిన ఆ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు. అహ్మదాబాద్ నగరానికి చెందిన పార్థ్ చంపానేరి (23)కి స్థానికంగా ఉన్న యువతితో గతేడాది పరిచయమైంది. తర్వాత కాలంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు చాలా చనువుగా మెలిగారు. ఈ సమయంలో ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫోటోలను పార్థ్, తన ఫోన్లో షూట్ చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో ఆ యువకుడితో స్నేహానికి ఆమెకి చెక్ పెట్టింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి పోయింది. అయితే తనతో స్నేహం కొనసాగాలించాలంటూ ఆ పార్థ్ ఆ యువతిని వేధించడం ప్రారంభించారు. దీంతో అతని ఫోన్ నంబర్ బ్లాక్‌లో పెట్టింది. తన ఫోన్ నంబర్ బ్లాక్ పెట్టడంతో నీచానికి దిగజారాడు పార్థ్. తామిద్దరు సన్నిహితంగా మెలిగిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ యువతి కుటుంబ సభ్యులకు సైతం పంపాడు. వెంటనే తన నంబర్ అన్ బ్లాక్ చేయాలని, తనతో మాట్లాడాలటూ కండీషన్ పెట్టాడు. అలా చేయని పక్షంలో పర్సనల్ వీడియోలను మరింతగా వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. పార్థ్ నుంచి వేధింపులు శృతిమించడంతో వెంటనే యువతి జరిగిన విషయం ఇండియాలో ఉన్న తండ్రికి తెలిపింది. వెంటనే అతను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పార్థ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. సోషల్ మీడియాతో పాటు అతని ఫోన్ నుంచి ఈ వీడియోలు డిలీట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అహ్మాదాబాద్ పోలీసులు తెలిపారు. -
డబ్బు, నగలు తీసుకుని.. మాజీ ప్రియుడితో పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య
సాక్షి,తిరువొత్తియూరు(చైన్నై): ప్రియుడితో రెండోసారి పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం కొదుంకులం కనియన్ విలై ప్రాంతానికి చెందిన మోహన్ రాజు (41) కార్లు కొనుగోలు చేయడంతోపాటు విక్రయాలు చేస్తుంటాడు. అతనికి భార్య సోనియాగాంధీ (35), కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో సోనియాగాంధీ కుమార్తెతో సహా అదృశ్యమైంది. 45 సవర్ల నగలు, రూ.13 లక్షలు తీసుకువెళ్లింది. పోలీసులు గాలింపు చర్యలుచేపట్టి 68 రోజుల తర్వాత ఆమె ప్రియడు మనోజ్‌తో ఉండగా పట్టుకుని తీసుకువచ్చారు. వారిని కోర్టులో హాజరుపరచగా సోనియాగాంధీ భర్తతో కలిసి జీవించడానికి సమ్మతించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్కూలుకు వెళ్లిన పిల్లలను తీసుకువస్తానని బయటికి వెళ్లిన సోనియాగాంధీ మళ్లీ ప్రియుడు మనోజ్‌తో వెళ్లిపోయింది. ఆమె భర్త మోహన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదు, 12 సవర్ల బంగారు చైను తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally Rave Party: సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా.. -
మాజీ లవర్ దురాగతం..భర్తతో కలిసి ఫిర్యాదు
సాక్షి, చిత్తూరు : మాజీ ప్రియుడి దురాగతాలపై ఓ మహిళ తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాప్ చేసి లొంగదీసుకుని, అనంతరం వ్యభిచారం చేయాలని బ్లాక్ మెయిల్ చేయడంతో బాధితురాలు భర్తతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించింది. శుక్రవారం చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో తన భర్తతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. వ్యభిచారంలోకి దిగాలని, లేకపోతే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ మాజీ ప్రియుడు బెదిరిస్తున్నాడని వాపోయింది. వివరాల్లోకి వెళితే... చిత్తూరు దుర్గానగర్ కాలనీకి చెందిన పవన్, తాను చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నట్లు తెలిపింది. అయితే తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, దీంతో బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ప్రకాశ్‌తో తనకు వివాహం జరిపించారని వివరించింది. విధి నిర్వహణ నిమిత్తం తన భర్త బయట ప్రాంతానికి వెళ్లడంతో తాను పుట్టింటికి రావాల్సి వచ్చిందని పేర్కొంది. కళాశాల స్నేహితులు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న పవన్.. తిరిగి స్నేహంగా ఉందామంటూ మాటలు కలిపాడని తెలిపింది. అయితే తమ పాత ఫొటోలు డిలీట్ చేయాలంటే తనతో ఒకసారి గడపాలని లొంగదీసుకున్నాడని వాపోయింది. అనంతరం తాను చెప్పిన వాళ్లతో గడపకపోతే ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరిస్తుండడంతో విషయాన్ని తన భర్తకు తెలిపినట్లు వివరించింది. ఈ నెల 6న భర్తతో కలిసి చిత్తూరులోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలి భర్త ప్రకాశ్ మాట్లాడుతూ.. ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో ఏ మహిళా బలి కాకూడదన్న ఉద్దేశంతో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చామని, తమకు న్యాయం చేయాలని కోరాడు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తే పవన్ దురాగతాలతో పాటు... చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపాడు. -
మాజీ లవర్‌పై యాసిడ్ పోస్తానన్నాడు..!
లండన్: మాజీ ప్రియురాలిని తీవ్రంగా వేధించిన నేరానికి ప్రవాస భారతీయుడికి బ్రిటన్‌లోని హారో క్రౌన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పశ్చిమలండన్కు చెందిన ప్రదీప్ థామస్(37), ఓ మహిళ(50) కొంతకాలం వరకు సన్నిహితంగా మెలిగారు. అనంతరం వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రదీప్ ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా పెట్టింది. ఇది జీర్ణించుకోలేని అతడు ఆమె వెంట పడటం ఆపలేదు. చంపేస్తా, యాసిడ్ పోస్తా అంటూ సెల్ఫోన్లో వేధించసాగాడు. ఆమె ఇతర పురుషులతో మాట్లాడినట్లు తెలిసినా, చూసినా ఊరుకునేవాడు కాదు. ఒక రోజు ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి లోపలికి రానివ్వకుంటే ఇంటిని తగుల బెడతానంటూ ఫోన్లో మెసేజ్‌లు పంపాడు. ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనలకు లోనైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు ప్రదీప్‌ను ఆగస్టులో అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 12, 13వ తేదీల్లో బాధితురాలికి అతడు 73 మిస్డ్ కాల్స్, 35 వాయిస్ మెసేజ్‌లు పంపినట్లు వెల్లడయింది. తనకు ఆమె దక్కలేదనే కోపంతోనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని తపి్పంచుకోజూశాడు. ఆమె ఇప్పటికీ తన ప్రియురాలేనని వాదించాడు. ఇవన్నీ పరిశీలించిన పోలీసులు కోర్టులో కేసు ఫైల్ చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. -
మద్యం మత్తులో మాజీ ప్రియుడు..
మహబూబాబాద్: ప్రేమించిన యువకుడే మాజీ ప్రేయసి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లున్న యువతిని ఇద్దరు యువకులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. వారు ఆ యువతి దుస్తులు చించి ఆకారణంగా దాడి చేసిన సంఘటన జిల్లాలో సంచలనం రెకెత్తించింది. జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్ర సమయంలో సికింద్రాబాద్ తండాకు చెందిన 18 సంవత్సారల యువతిని ఆమె మాజీ ప్రియుడు, పట్టణానికి చెందిన మాదాసు మల్లేష్ అతని స్నేహితుడు సునిల్‌తో కలిసి బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్లారు. మద్యం మత్తులో వారిని గమనించిన ఆమె ఆటోలో ఎక్కేందుకు నిరాకరించడంతో కొట్టి బలవంతంగా తాళ్ళపూసపల్లి సమీపంలోకి తీసుకెళ్లారు. సదరు యువతి కేకలు వేయడంతో అదవద్దని ఆమెపై దాడి చేసి దుస్తులు చించివేశారు. యువతి కేకలు విన్న స్థానికులు పరుగున సంఘటన స్థలానికి రావడంతో మల్లేష్, సునిల్ అక్కడి నుంచి పరార్ అయ్యారు. గాయపడిన యువతిని స్థానికులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. -
మాజీ ప్రేయసిని చంపబోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఇద్దరు ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు ఒకే ఆఫీసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వమని మాజీ ప్రియుడు అడిగితే.. నీకూ నాకూ కటీఫ్ కాబట్టి ఇక నా నంబర్ ఎందుకు, ఇవ్వబోనని ఆమె తెగేసి చెప్పింది. అతడు ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వచ్చింది. దాంతో ఒక్కసారిగా కోపం వచ్చిన ప్రియుడు తాము వెళ్తున్న కారులోనే ఆమెపై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు కారులోంచి బయటకు తోసేసే ప్రయత్నం చేశాడు. ఇదంతా మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగింది. మగర్‌పట్ట సిటీలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న జుబై పటేల్ (25) అనే వ్యక్తి, తన మాజీ ప్రియురాలిపై దాడి చేసినందుకు అతడిపై ఖడ్కి పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రాత్రి షిఫ్టు ముగించుకుని తిరిగి వస్తుంటే కారులో ఇద్దరి మధ్య ఫోన్ నంబర్ విషయమై గొడవ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా ఆమె మాత్రం తన కొత్త నంబర్ ఇచ్చేది లేదని చెప్పడంతో అతడికి బాగా కోపం వచ్చింది. ఆమెను కారులో విపరీతంగా కొట్టి, తలుపు తెరిచి కిందకు తోసేయబోయాడు. దాంతో భయపడిన డ్రైవర్ కారును ఆపగా, అమెను జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చేశాడు. ఆమె కడుపులో కొడుతూ.. చివరకు పీకనొక్కేయడానికి కూడా ప్రయత్నించాడు. అంతలో ఇతరులు వచ్చి విడదీశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మీద హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్పటారు. కొన్నేళ్ల క్రితం వరకు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ, పటేల్ తల్లిదండ్రులకు వాళ్ల పెళ్లి ఇష్టం లేకపోవడంతో విడిపోయారు. పటేల్ మాత్రం పెళ్లి మాట ఎలా ఉన్నా కొన్నాళ్లు కలిసుందామని ప్రతిపాదించాడు. దానికి ఆమె అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య విడిపోదామంటూ ఒక ఒప్పందం కూడా కుదిరింది. తాను ఆమెతో మాట్లాడదామని ప్రయత్నించినా ఆమె ఒప్పుకోకపోవడంతో నిరాశ చెందానని, అందుకే ఆమెను చంపేయాలనుకున్నానని పోలీసుల విచారణలో పటేల్ చెప్పాడు. -
మాజీ ప్రియుడి బ్లాక్‌మెయిల్‌తో పెళ్లి కాన్సిల్