Rashmika Mandanna About Her Ex Love And Break Up In Live Session Deets Inside - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna Break Up: ఎక్స్‌లవ్‌, ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌పై రష్మిక స్పందన

Published Sat, Mar 12 2022 9:12 AM | Last Updated on Sat, Mar 12 2022 9:57 AM

Rashmika Mandanna About Her Ex Love And Break Up In Live Session - Sakshi

Rashmika Mandanna About Her Ex Love: రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరస సినిమాల సక్సెస్‌, సోషల్‌ మీడియా ఫ్యాన్‌డమ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నెట్టింట సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది రష్మిక. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆమె తాజాగా యూట్యూబ్‌లో సైతం అడుగు పెట్టింది. తాను యూట్యూబ్‌ ఛానల్‌ను స్టార్ట్‌ చేసినట్లు గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా లైవ్‌ సెషన్‌ నిర్వహించిన రష్మికకు ఫ్యాన్స్‌ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తనకు నటన అంటే ఎంతో ఇష్టమని చెప్పింది.

చదవండి: ఓటీటీలోకి అజిత్‌ ‘వలిమై’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

అలాగే ట్రావెలింగ్‌, డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టమని, అవి ఎందుకు అంత ఇష్టమో కూడా వివరించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ తన  ఎక్స్‌ లవ్, ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌పై ప్రశ్నించాడు. ‘ప్రతి ఒక్కరికి మీ ఎక్స్‌ లవ్‌ గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ మీరు తనతో ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంది’ అంటూ ఆరా తీశాడు.ఇక అన్ని ప్రశ్నలకు టకటక సమాధానాలు చెప్పిన రష్మిక.. దీనికి మాత్రం ఎలాంటి బదులు ఇవ్వకుండ ఆ ప్రశ్నను దాటేసింది. కాగా రష్మిక కన్నడ నటుడు, తన తొలి చిత్రం ‘కిరిక్‌ పార్టీ’ మూవీ కోస్టార్‌ రక్షిత్‌ శెట్టితో కొంతకాలం ప్రేమలో మునిగి తేలిన సంగతివ తెలిసిందే.

చదవండి: గుర్తు పట్టలేనంతగా ‘ఓయ్‌’ హీరోయిన్‌ షామిలీ, ఫొటోలు వైరల్‌

ఈ క్రమంలో 2018లో అతడితో నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక తెలుగులో ఆమె నటించిన గీతా గోవిందం మూవీ అనంతరం రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్‌ చేసుకుంది. అప్పట్లో కన్నడ పరిశ్రమలో ఈ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి దగ్గర అయితే సెక్యూర్‏గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ-రష్మికలు డేటింగ్‌ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement