Zomato Asks Girl From Bhopal to Stop Sending Food to Her Ex Boyfriend - Sakshi
Sakshi News home page

మాజీ లవర్‌కు ఫుడ్‌ ఆర్డర్‌.. ఇది ప్రేమ/ పగ?.. జొమాటో ఇచ్చిన ట్విస్ట్‌ వేరే లెవల్‌

Published Thu, Aug 3 2023 5:50 PM | Last Updated on Fri, Aug 4 2023 12:13 PM

Zomato Asks Girl From Bhopal To Stop Sending Food To Her Ex Boyfriend - Sakshi

భోపాల్‌: ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ యాప్‌.. జొమాటో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో మొబైల్‌, అందులో యాప్‌ ఉంటే చాలు.. కేవలం ఒక క్లిక్‌తో కస్టమర్లు వద్దకే పుడ్‌ డెలివరీ చేస్తుంది. తాజాగా ఓ ఘటనపై జోమాటో సంస్థ స్పందించి ట్వీట్‌ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడి కోసం జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. 

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత జొమాటో అనితకు ఊహించిన  షాకిచ్చింది. అంకిత పెట్టిన పుడ్‌ ఆర్డర్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకుంది. అనగా డెలివరీ అందుకున్న కస్టమర్‌ ఆ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అంకిత ఆర్డర్‌ పెట్టింది తన మాజీ లవర్‌ కోసం... అతనేమో ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. ఇలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు జరిగింది.

దీంతో ఏకంగా జొమాటోనే జోక్యం చేసుకుంది. "భోపాల్‌కు చెందిన అంకితా దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై పుడ్‌ పంపడం ఆపండి. ఇది మూడోసారి - అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నాడు" అని ట్వీట్‌ చేసింది. దీంతో పాటు  అదనంగా .."దయచేసి ఎవరైనా అంకితా ఖాతాలో క్యాష్‌ ఆన్‌ డెలవరీ బ్లాక్ చేసినట్లు చెప్పగలరు. ఆమె ఈ విషయం తెలియక 15 నిమిషాలకు ఒకసారి మళ్లీ ప్రయత్నిస్తోంది" అని తెలిపింది. కాగా ఈ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో 9 లక్షల వ్యూస్‌, 12,000 లైక్‌లు, 855 రీట్వీట్‌లు వచ్చాయి.ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు .. ఈ ఐడియా ఏదో బాగుందని  ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.
 

చదవండి   ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌.. ఏకంగా కాలేజ్‌కి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement