తక్కువ ధరకు ఫుడ్‌.. జొమాటో కొత్త ఫీచర్‌ | Zomato Launches new feature Rescue To Combat Food Wastage | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు ఫుడ్‌.. జొమాటో కొత్త ఫీచర్‌

Published Mon, Nov 11 2024 10:31 AM | Last Updated on Mon, Nov 11 2024 11:53 AM

Zomato Launches new feature Rescue To Combat Food Wastage

ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్‌ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.

కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్‌లు ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్‌లు క్యాన్సిల్‌ అవుతున్నాయి. ఈ ఫుడ్‌ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది.

"జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్‌ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్‌ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్‌లు క్యాన్సిల్‌ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్‌ చేశారు.

కొత్త ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..
ఒక కస్టమర్‌ ఆర్డర్‌ని క్యాన్సిల్‌ చేసిన తర్వాత, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్‌లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్‌ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసిన కస్టమర్‌కు, రెస్టారెంట్ పార్టనర్‌కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. 

అయితే, ఐస్‌క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్‌ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్‌ గోయల్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement