
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,తిరువొత్తియూరు(చైన్నై): ప్రియుడితో రెండోసారి పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం కొదుంకులం కనియన్ విలై ప్రాంతానికి చెందిన మోహన్ రాజు (41) కార్లు కొనుగోలు చేయడంతోపాటు విక్రయాలు చేస్తుంటాడు. అతనికి భార్య సోనియాగాంధీ (35), కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో సోనియాగాంధీ కుమార్తెతో సహా అదృశ్యమైంది. 45 సవర్ల నగలు, రూ.13 లక్షలు తీసుకువెళ్లింది.
పోలీసులు గాలింపు చర్యలుచేపట్టి 68 రోజుల తర్వాత ఆమె ప్రియడు మనోజ్‌తో ఉండగా పట్టుకుని తీసుకువచ్చారు. వారిని కోర్టులో హాజరుపరచగా సోనియాగాంధీ భర్తతో కలిసి జీవించడానికి సమ్మతించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్కూలుకు వెళ్లిన పిల్లలను తీసుకువస్తానని బయటికి వెళ్లిన సోనియాగాంధీ మళ్లీ ప్రియుడు మనోజ్‌తో వెళ్లిపోయింది. ఆమె భర్త మోహన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదు, 12 సవర్ల బంగారు చైను తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Kukatpally Rave Party: సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా..
Comments
Please login to add a commentAdd a comment