fled
-
పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్‌పాల్ సింగ్?
ఖలిస్థాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు గత నాలుగు రోజులుగా భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా. నేటీకి అతని ఆచూకీ లభించడం లేదు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ సరిహద్దులు దాటి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఓ పాడుబడ్డ కారులో అతని దుస్తులు లభించడంతో పోలీసులు ఈ విధంగా భావిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ మెర్సిడెస్ నుంచి దిగి బ్రెజా కారులో షాకోట్‌కు పారిపోయాడని పోలీసులు తెలిపారు. అనతరం ఖలీస్తానీ వేర్పాటువాదీ తన బట్టలు మార్చుకొని తన మద్దతుదారులకు చెందిన బైక్‌పై పంజాబ్ వదిలి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు అమృతపాల్ సింగ్ దుస్తులు, బ్రెజ్జా కారు, మరికొన్ని కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు పారిపోవడానికి సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వందమందికి పైగా అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) కోసం ఉపయోగిస్తున్న అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్ కవర్ సంస్కృతి?: సుప్రీం కోర్టు అలాగే అమృత్‌పాల్ మామ హర్జీత్ సింగ్, డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్ జలంధర్‌లో పోలీసులకు లొంగిపోయారు. వీరి కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు పంజాబ్‌లో శనివారం నుంచి మూతపడిన ఇంటర్నెట్ సేవలు నేడు(మంగళవారం)పాక్షింగా పునరుద్ధరించనున్నారు. కాగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అత్యంత సన్నిహతుడిని విడిపించుకునేందుకు తన మద్దతుతారులతో కలిసి అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసినప్పటి నుంచి ఈ పరిణామం తీవ్రరూపం దాల్చింది. డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకొని కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఖలిస్తాన్ 2.0 -
సూట్ కేసులతో పరుగులు... ఇవి రాజపక్సవేనా?
Suitcases Loaded On Sri Lanka Navy Ship: శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు కూడా. ఈ మేరకు వారంతా ఆయన కార్యాలయం, అధికార నివాసం రెండింటిని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో గోటబయ పరారయ్యరంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెద్ద పెద్ద సూట్‌కేసులు తీసుకుని శ్రీలంక నేవీ ఓడలో పారిపోయారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి. అందుకు సంబంధించిన పోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్‌కేసులతో ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు అనే నేవీ ఓడలో తీసుకువెళ్తున్నట్లు వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ విషయమై కొలంబో పోర్ట్‌లోని అధికారిని ప్రశ్నించగా...ఆయన కూడా ఒక బృందం పెద్ద పెద్ద సూట్‌కేసులతో గజబాహు అనే ఓడ ఎక్కి వెళ్లినట్లు తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది కూడా. ఐతే అతనితోపాటు ఎవరెవరు వెళ్లారు, ఎలా వెళ్లాడనేది వివరణ ఇవ్వలేదు. మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ ఆయన్ని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు పేర్కొంది. పైగా శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు అధ్యక్క్షుడు పరారయ్యడంటూ... విమానాశ్రయంలోని లంక అధ్యక్షుడు గోటబయ కాన్వాయ్‌ని చూపిస్తూ... వార్తలు ప్రసారం చేశాయి. కానీ లంక అధ్యక్షుడు గోటబయ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారో లేదా అనేది స్పష్టం కాలేదు. Lmao people actually made the president pack his suitcase and run for his life😂😂 #GoHomeGota #අරගලයටජය #GoHomeRanil pic.twitter.com/gw7Zkr1I5a — ♡ Sanda ♡ (@TachyonJaneesha) July 9, 2022 (చదవండి: ఇంటి నుంచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు!) -
కొలంబోలో రణరంగం
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం, ఆహార కొరతతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శనివారం సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన అధ్యక్షుడు గొటబయా రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం రణరంగం సృష్టించారు. ‘దేశమంతా కొలంబో’కు అంటూ ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా వేలాది మంది నిరసనకారులు గొటబయా రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు. పరిస్థితిని ముందే గ్రహించిన ఆయన శుక్రవారమే తన నివాసం నుంచి పరారయ్యారు. ప్రధాని విక్రమసింఘే నివాసానికి జనం నిప్పుపెట్టారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజల భద్రత కోసం, ప్రతిపక్ష నాయకుల సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రధాని విక్రమసింఘే ట్విట్టర్లో స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకొనేదాకా విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని, ఈ తర్వాతే రాజీనామా చేస్తారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఈ ఏడాది మే నెలలో గొటబయా రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో విక్రమసింఘే నూతన ప్రధానిగా నియమితులైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయా కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పదవి నుంచి వైదొలుగుతానని స్పీకర్‌కు సమాచారమిచ్చారు. జనం అధీనంలోకి ప్రెసిడెంట్ హౌస్ సెంట్రల్ కొలంబోలో హై సెక్యూరిటీ కలిగిన ఫోర్ట్ ఏరియాలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, జవాన్లు మోహరించారు. దేశంలో సంక్షోభాన్ని పరిష్కరించలేని అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. శ్రీలంక జాతీయ జెండాలను చేబూని బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు పరుగులు తీశారు. అధ్యక్షుడు దిగిపోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి రణరంగాన్ని తలపించింది జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో కనీసం 45 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులను నేషనల్ హాస్పిటల్‌కు తరలించారు. అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాన్ని నిరసనకారులు స్వా«ధీనం చేసుకున్నారు. గోడలు ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొట్టి సేద తీరడం గమనార్హం. మరికొందరు లోపల వంటలు చేసుకొని, ఆరగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొలంబోలో ప్రధానమంత్రి విక్రమసింఘే ప్రైవేట్ నివాసాన్ని సైతం జనం చుట్టుముట్టారు. విధ్వంసం సృష్టించారు. నివాసానికి నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కొలంబోకు రైళ్లను నడపాలని ఒత్తిడి చేస్తూ నిరసనకారులు గాల్లే, కాండీ, మతారా తదితర ప్రాంతాల్లో రైల్వే అధికారులతో ఘర్షణకు దిగారు. అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వం ప్రెసిడెంట్ హౌస్‌ను నిరసనకారులు చుట్టుముట్టినట్లు సమాచారం అందుకున్న ప్రధాని విక్రమసింఘే వెంటనే అన్ని పార్టీలతో అత్యవసర భేటీ నిర్వహించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ మహిందా యాపా అబేయవర్దనే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు గొటబయా రాజపక్స తప్పుకోవాలని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు తేల్చిచెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తక్షణమే రాజీనామా చేయండి అని విక్రమసింఘే, గొటబయాకు స్పీకర్ అబేయవర్దనే సూచించారు. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడానికి, కొత్త ప్రధాని నేతృత్వంలో మధ్యంతర అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొద్ది కాలంలోపే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకరించాక రాజీనామా చేస్తానంటూ ప్రధాని ప్రకటన విడుదల చేశారు. గొటబయాకు సొంత పార్టీ ఎంపీల లేఖ గొటబయా రాజపక్సకు చెందిన శ్రీలంక పొడుజనా పెరమునా పార్టీ ఎంపీలు ఆయనను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పదవి నుంచి తప్పుకోవాలని, అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కొలంబోలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు తొలుత నిర్ణయించారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. గొటబయా ఎక్కడున్నారు? నిరసనకారుల ముట్టడిని ముందే గ్రహించిన అధ్యక్షుడు గొటబయా శుక్రవారమే శ్రీలంక నావికాదళానికి చెందిన నౌకలో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా చానల్ ప్రకటించింది. కొలంబో పోర్టు నుంచి రెండు నౌకల్లో లగేజీతో సహా కొందరు ప్రముఖులు వెళ్లిపోయినట్లు హార్బర్ మాస్టర్ చెప్పారు. వారు ఎవరన్నది తాను బయటపెట్టలేనని అన్నారు. అలాగే వీఐపీ వాహన శ్రేణి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గొటబయా ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో తలదాచుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. (చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్) -
అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్
Russian troops first sign of illness from radiation: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా దాడి సాగిస్తూనే ఉంది. రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన పేరుతో ఉక్రెయిన్ పై మరిన్ని వైమానిక బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక దాడుల కారణంగా ఉక్రెయిన్ ఊహించనట్లుగానే యూరప్ దేశాలకు పెనుముప్పు వాటిల్లనుంది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించినప్పుడే చెర్నోబిల్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంలో భాగంగా అణుకర్మాగారంపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ సేనలు అణుకర్మాగారంలో వ్యాపించిన మంటలను అదుపు చేసి పర్యవేక్షించారు. అంతేకాదు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ అణుకర్మాగారం అతిపెద్దదని గతంలో అది ఎంత పెను విధ్వంసం సృష్టించిందో కూడా వివరించారు. అయితే ఇప్పుడూ ఆ అణుకర్మాగారం నుంచి రేడియేషన్లు వెలువుడుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అందులో భాగంగానే చెర్నోబిల్ వద్ద రష్యా దళాలు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం బెలారస్‌లోని ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలి వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈమేరకు ఉక్రెనియన్ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్చుక్ కూడా రష్యన్లు రేడియేషన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. చెర్నోబిల్ వద్ద కార్మికులు నివసించే సమీపంలోని స్లావుటిచ్ పట్టణం నుంచి రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయమై యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో చెర్నోబిల్‌కు తన తొలి సహాయం అందించనున్నట్లు ఐఏఈఏ పేర్కొనడం విశేషం. (చదవండి: మా ఆంక్షలు నిర్వీర్యం చేయోద్దు!..హెచ్చరించిన యూఎస్) -
ఆగని వలసలు... పారిపోతున్న వేలాది మంది పౌరులు
కీవ్: మానవీయ కారిడార్ల ప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మంగళవారం వేలాది మంది ఉక్రేనియన్ పౌరులు దేశం విడిచివెళ్లారు. ఇప్పటికే 20 లక్షల మంది దేశం వదిలివెళ్లారని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. పలు నగరాల్లో యుద్ధం కారణంగా నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో చాలా నగరాల్లో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యా. కాల్పులు, దాడులు కొనసాగడంతో వీరి ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం కాల్పుల విరమణ కొనసాగడంతో చాలామంది ప్రాణాలరిచేతిలో పెట్టుకొని పారిపోవడం కనిపించింది. మంగళవారం ఉదయం నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమలు చేస్తున్నామని రష్యా అధికారులు, ఉక్రెయిన్ ఉప ప్రధాని ప్రకటించారు. సుమీ, మారిపోల్ నగరాల నుంచి ప్రజలు బస్సుల్లో తరలిపోతున్న వీడియోలను ఉక్రెయిన్ అధికారులు విడుదల చేశారు. మారిపోల్ జనాభా దాదాపు 4.3 లక్షలు కాగా సుమారు 2 లక్షల మంది తరలిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఒకరికి పదిమంది రష్యా బలగాలను తమ సైనికులు ధైర్యంగా అడ్డుకుంటున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే ఒక్క ఉక్రెయిన్ సైనికుడికి ఎదురుగా 10 మంది రష్యన్ సైనికులుంటున్నారని, ఒక్క ఉక్రెయిన్ ట్యాంకుకు 50 రష్యా ట్యాంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. యుద్ధ విమానాలందించాలన్న జెలెన్స్కీ అభ్యర్థనపై చాలా దేశాలు చర్చిస్తున్నాయని అమెరికా తెలిపింది. నైతికత మరిచిన రష్యా బలగాలు తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో లూటీలను ప్రోత్సహిస్తున్నాయని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆరోపించారు. పలు నగరాల్లో తమ సైనికులు తీవ్ర ప్రతిఘటన చూపుతున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద నగరం ఖర్కివ్‌లో చాలాచోట్ల జనావాసాలపై బాంబింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు దాడుల్లో 406 మంది పౌరులు చనిపోయిఉంటారని ఐరాస అంచనా వేసింది. యుద్ధం ఆరంభమై రెండువారాలవుతున్న వేళ దక్షిణ ఉక్రెయిన్‌పై చాలావరకు రష్యా ఆధిపత్యం సాధించింది. కానీ రాజధాని కీవ్‌లో ప్రజలు, సైనికులు నగరాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చారు. చాలా చోట్ల చెక్పాయింట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. కీవ్‌పై పట్టుకోసం రష్యా బలగాలు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలపై బాంబింగ్‌ను ముమ్మరం చేశాయి. (చదవండి: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్!) -
ఉక్రెయిన్ వలసలు 10 లక్షలు
కీవ్: రష్యా దాడుల పర్యవసానంగా ఉక్రెయిన్ జనాభాలో 2% మంది నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కేవలం వారం రోజుల్లోనే 10 లక్షల మంది వలసబాటపట్టారని తెలిపింది. ఈ శతాబ్దంలోనే అత్యంత వేగవంతమైన వలసలుగా అభివర్ణించింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరంతోపాటు, వ్యూహాత్మకమైన రెండు నౌకాశ్రయాలపై రష్యా సైన్యం దాడులు ముమ్మరమయ్యాయి. సుమారు 15 లక్షల జనాభా కలిగిన ఖర్కీవ్ నగర జనావాసాలపై ఒక వైపు బాంబుదాడులు జరుగుతున్నా ప్రజలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఐరాస వలసల విభాగం తెలిపింది. ఖర్కీవ్ రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా వచ్చిన రైళ్లలోకి ఎక్కి వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల భారీ సంఖ్యలో బారులు తీరిన ట్యాంకులు, ఇతర వాహనాలు రెండు రోజులుగా అక్కడే తిష్టవేశాయని తెలిపింది. అజోవ్ సముద్ర తీర నగరం మరియుపోల్‌ను రష్యా బలగాలు దిగ్బంధించాయని, నల్లసముద్రంలోని మరో కీలక నౌకాశ్రయం పరిస్థితి అస్పష్టంగా ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పారు. మరో పెద్ద నగరం ఖెర్సన్ తమ పూర్తి అధీనంలోకి వచ్చిందని రష్యా బలగాలు ప్రకటించుకున్నాయి. దాడులు మొదలైనప్పటి నుంచి 227 మంది పౌరులు చనిపోగా, 525 మంది క్షతగాత్రులైనట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ తెలపగా, 2 వేల మందికి పైగానే చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే, సైన్యానికి జరిగిన నష్టాన్ని తెలపలేదు. మొదటిసారిగా, రష్యా కూడా తమ బలగాలకు వాటిల్లిన నష్టం వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు సుమారు 500 సైనికులు చనిపోగా, 1,600 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇదే ప్రతిఘటనను కొనసాగించండి రష్యా సేనలను ప్రజలు ప్రతిఘటిస్తున్న తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రశంసలు కురిపించారు. ఇదే ప్రతిఘటనను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్రమణదారులను ప్రశాంతంగా ఉండనివ్వవద్దన్నారు. వారు నైతిక స్థైర్యం కోల్పోతారన్నారు. రష్యా సైనికులు సూపర్‌పవర్ సైనికులు కాదు, అయోమయంలో ఉన్న పిల్లలని అభివర్ణించారు. (చదవండి: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థిపై కాల్పులు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) -
డబ్బు, నగలు తీసుకుని.. మాజీ ప్రియుడితో పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య
సాక్షి,తిరువొత్తియూరు(చైన్నై): ప్రియుడితో రెండోసారి పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం కొదుంకులం కనియన్ విలై ప్రాంతానికి చెందిన మోహన్ రాజు (41) కార్లు కొనుగోలు చేయడంతోపాటు విక్రయాలు చేస్తుంటాడు. అతనికి భార్య సోనియాగాంధీ (35), కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో సోనియాగాంధీ కుమార్తెతో సహా అదృశ్యమైంది. 45 సవర్ల నగలు, రూ.13 లక్షలు తీసుకువెళ్లింది. పోలీసులు గాలింపు చర్యలుచేపట్టి 68 రోజుల తర్వాత ఆమె ప్రియడు మనోజ్‌తో ఉండగా పట్టుకుని తీసుకువచ్చారు. వారిని కోర్టులో హాజరుపరచగా సోనియాగాంధీ భర్తతో కలిసి జీవించడానికి సమ్మతించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్కూలుకు వెళ్లిన పిల్లలను తీసుకువస్తానని బయటికి వెళ్లిన సోనియాగాంధీ మళ్లీ ప్రియుడు మనోజ్‌తో వెళ్లిపోయింది. ఆమె భర్త మోహన్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదు, 12 సవర్ల బంగారు చైను తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Kukatpally Rave Party: సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా.. -
చేసిన రిస్క్‌కు ఫలితం దక్కింది
టొరంటో: సౌదీఅరేబియాలో మహిళలను బానిసలుగా చూస్తారని ఆ దేశ యువతి రహాఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్(18) అన్నారు. ఇంట్లో వేధింపులు తాళలేక పారిపోయి వచ్చి.. బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో దాక్కుని తన సమస్యను ఐరాస దృష్టికి తెచ్చిన రహాఫ్‌కు కెనడా ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అంతర్జాతీయంగా వార్తలో నిలిచిన రహాఫ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను చేసిన రిస్క్‌కు తగిన ప్రతిఫలం దక్కిందని వ్యాఖ్యానించారు. ‘నా కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తారనే భయంతోనే థాయ్‌లాండ్‌కు పారిపోయి వచ్చాను. అందుకే నన్ను తీసుకెళ్లడానికి బ్యాంకాక్‌కు వచ్చిన సోదరుడు, తండ్రితో వెళ్లలేదని అన్నారు. ఇకపై కెనడాలోనే చదువుకుని.. ఉద్యోగం చేస్తూ.. సాధారణ జీవితం గడపాలని ఉంది. కెనడాలో జీవించడం చాలా బాగుంది. సౌదీలో ఉంటే నా కలలు కలలుగానే మిగిలిపోయేవి. ఇక్కడ నాకు లభించిన స్వాగతం చూస్తుంటే నాకు మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంద’ని రహాఫ్ తెలిపారు. కాగా, ఇంట్లో వేధింపులకు తాళలేక రహాఫ్ గతవారం థాయ్‌లాండ్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న ఆమెను సరైన పత్రాలు లేకపోవడంతో థాయ్‌లాండ్ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ హోటల్ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. ఐరాస శరణార్థి సంస్థ చొరవతో కెనడా రహాఫ్‌కు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమె శనివారం కెనడాకు చేరుకున్నారు. -
ఢిల్లీలో హత్య...ఉత్తరాఖండ్‌లో మకాం?
సాక్షి, డిల్లీ : గత ఏడాది ఢిల్లీలో ఓ డాక్టర్‌ను హత్య చేసి కలకలం సృష్టించిన సూయూష్ గుప్తా అనే నిందితుడు ఉత్తరాఖండ్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ లాడ్జ్‌లో అతడు దాగి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. గుప్తా తన తోటి వైద్యుడు, స్నేహితుడైన డాక్టర్ శశ్వత్ పాండేను గతేడాది (2017) ఆగస్ట్‌లో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరరాయ్యాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పలుమార్లు అతడి కుటుంబానికి నోటీసులు పంపినా, అతని కోసం గాలింపు చేపట్టినా, చివరకు లక్ష రూపాయల రివార్డును ప్రకటించినా అతడి జాడ లేకపోయింది. అయితే తాజాగా అతడి ఆచూకీపై ఓ పోలీసు అధికారి వెల్లడిస్తూ, ‘అతను గతేడాది ఆగస్ట్‌లో హరిద్వార్ లోని ఒక లాడ్జ్‌లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. కానీ అప్పటి నుంచి ఆచూకీ లభించలేదు. గుప్తా అక్కడ ఉన్నప్పుడు తన ఫోన్‌ను అక్కడ పనిచేసే వ్యక్తికి ఇచ్చి, ఏడాది తరువాత స్విచ్చాన్ చేయమన్నాడు. కానీ అతను మాత్రం నవంబర్లోనే ఆన్ చేశాడు. సిగ్నల్స్ ద్వారా దాన్ని ట్రేస్ చేసి పట్టుకున్నాము. కానీ అప్పటికే అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పాండేను చంపేముందు గుప్తా తన అకౌంట్లో నుంచి 8లక్షల రూపాయలను డ్రా చేశాడు. గుప్తాకు పాండే తప్ప మరో స్నేహితుడు లేడు. త్వరలోనే ఒక బృందాన్ని ఉత్తరఖాండ్‌కు పంపిస్తాం’ అని పోలీసు అధికారి తెలిపారు. -
టెస్ట్ డ్రైవ్ అని చెప్పి.. ఆడి కారుతో..
బంజారాహిల్స్: టెస్ట్ డ్రైవ్ పేరుతో ఖరీదైన ఆడి కారుతో ఉడాయించిన యువ డాక్టర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ అపోలో ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రీ ఓన్డ్ కార్స్ డీలర్ వద్దకు ఈ నెల 27న ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చి తన పేరు గౌతంరెడ్డి అని అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఓ కారు కొనుగోలు చేయాలని అందుకోసం టెస్ట్ డ్రై వ్ చేయాలంటూ అడిగాడు. దీంతో డీలర్ కాగితపు నరేంద్రకుమార్ ఆ యువ డాక్టర్‌కు ఏపీ 28 డీఆర్ 0005 ఆడి క్యూ3 కారును టెస్ట్ డ్రైవ్ కోసం ఇస్తూ తమ వద్ద పని చేస్తున్న కాశిని పర్యవేక్షకుడిగా పంపించాడు. కారు నడుపుతూ గౌతంరెడ్డి అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకోగానే తన పక్కనే కూర్చున్న కాశిని ఒక్కసారి దిగాలని తానే సొంతంగా కొద్ది దూరం నడుపుతానంటూ చెప్పడంతో కాశి కారు దిగాడు. అంతలోనే గౌతంరెడ్డి కారుతోసహా ఉడాయించాడు. సాయంత్రమైనా తిరిగిరాకపోయేసరికి డీలర్ నరేంద్రకుమార్ అపోలో ఆస్పత్రిలో డాక్టర్ గౌతంరెడ్డి కోసం వాకబు చేయగా అలాంటివారు ఎవరూ లేరని తేలింది. తాము మోసపోయామని తెలుసుకొని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గౌతంరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 379కింద కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారు విలువ సుమారుగా రూ. 40 లక్షల వరకు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రేప్ చేయబోతే..
కృష్ణా: లిఫ్ట్ అడిగి అపరిచిత కారెక్కిన ఓ మహిళపై కారు డ్రైవర్ అత్యాచారానికి యత్నించగా, అతని కళ్లలో కారం కొట్టి తప్పించుకున్న సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం మండలం సీతాపురం తండా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు గ్రామానికి చెందిన మహిళ(27) ఊరి నుంచి రెడ్డి గూడెం వెళ్లేందుకు సోమవారం రాత్రి 10గంటల సమయంలో బస్సు కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో అటువైపుగా కారులో వచ్చిన బాబూరావు అనే వ్యక్తి రెడ్డిగూడెంకు బండి వెళ్తోందని ఆమెను ఎక్కించుకున్నాడు. కారు సీతాపురం చేరిన తర్వాత కూనపరాజు పర్వకు వెళ్లే రహదారి వైపు దారి మళ్లించి మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణలో పడిన ఆమె అందుబాటులో ఉన్న కారాన్ని తీసుకుని మృగాడి కళ్లలో కొట్టి, కారు దిగి కేకలు వేసింది. ఎవరూ లేకపోవడంతో తల్లికి ఫోన్ చేసింది. బాధితురాలి తల్లి రెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి బాబూరావు కారు వదిలి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కారును సీజ్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఆమె భర్త కోసం తాలిబన్ల వేట మొదలైంది..!
మైమానా: అప్ఘానిస్తాన్‌లో భార్యతో గొడవపడి ఆమె ముక్కు కోసేసిన భర్త కోసం పోలీసులే కాదు ఏకంగా తాలిబన్లు కూడా వెతుకుతున్నారు. అతడి కోసం తాము తీవ్రంగా గాలింపులు జరుపుతున్నామని, అతడు ఎక్కడ ఉన్నా పట్టుకొని అసలు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఓ మహిళపై అలాంటి పని ఎందుకు చేయాలో ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నాక తాము ఏం చేయాలో అదే చేస్తామని అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల గ్రూపు అధికార ప్రతినిధి జబీనుల్లా ముజాహిద్ తెలిపాడు. అప్ఘానిస్తాన్ లోని ఘోర్మాక్ జిల్లాలో రెజాగుల్ (20) అనే మహిళ ముక్కును ఆమె భర్త ముహమ్మద్ ఖాన్(25) చిన్న కత్తితో కోసి పరారైన విషయం తెలిసిందే. రెండో పెళ్లి ప్రయత్నంలో ఉన్న అతడిని ప్రశ్నించిన కారణంగానే ఆమెపై భౌతికంగా ముహమ్మద్ ఖాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు స్పందిస్తూ ఆన్ లైన్ లో తాము ఆ ఫొటోలు చూశామని, ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ఆ పనిని తాము కూడా ఖండిస్తున్నామని, అతడి కోసం గాలిస్తున్నామని, దొరికితే తగిన శిక్ష విధించడం మాత్రం ఖాయమని హెచ్చరించారు. ఖాన్ తమతో చేతులు కలిపాడని మీడియాలో వస్తున్న వార్తలను తాలిబన్లు ఖండించారు. -
ముక్కుకోసేసిన భర్త... భార్యకు అండగా ప్రభుత్వం
కాబూల్: భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయిన భర్త ఆమె ముక్కు కోసేసిన దారుణ ఘటన అప్ఘానిస్తాన్ లోని ఘోర్మాక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెజాగుల్ (20), ముహమ్మద్ ఖాన్(25) ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి చిన్న పాప ఉంది. అయితే ఏడేళ్ల బాలికను ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఖాన్. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో ఖాన్, కత్తి తీసుకొని భార్య రెజా ముక్కు కోసేశాడు. అనంతరం ఖాన్ అతని సోదరుడు కలిపి ఆమెను బైక్ పై తీసుకొని వెళుతుండగా, బాధితురాలు అరుపులు విన్న స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఇద్దరూ అక్కడినుంచి ఉడాయించారు. గాయపడిన బాధితురాల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో రెజా పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. తెగిపడిన ముక్కును శస్త్రచికిత్స చేసే సదుపాయం తమ తగ్గర లేదని తెలిపారు. దీనిపై స్పందించిన అప్ఘానిస్తాన్ ప్రభుత్వం రెజాను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. చికిత్స, ఆపరేషన్ నిమిత్తం ఆమెను టర్కీ తరలించేందుకు తగిన ఏర్పాటు చేస్తోంది. అయితే ఉద్యోగం నిమిత్తం తరచూ ఇరాన్ వెళ్లే ఖాన్, తిరిగి వచ్చి భార్యను హింసించేవాడని రెజా తల్లి ఆరోపించింది. పెళైన దగ్గరినుంచీ తన కూతురికి నరకం చూపించాడని వాపోయింది. గొలుసులతో బంధించి, బూతులు తిడుతూ దారుణంగా ప్రవర్తించేవాడంది. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అతడు తనకు దొరికితే ముక్కలు ముక్కలు నరకుతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అప్ఘాన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో భయపడిన భర్త.. తాలిబన్ల అధీనంలోనున్న ప్రాంతంలో తలదాచుకున్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తాలిబన్ల అదుపులో వున్న నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. అటు రక్తమోడుతున్న బాధితురాలి ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబంపై అమానుషం
ఢిల్లీ: వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన ఓ ఆటో డ్రైవర్ దారుణంగా వ్యవహరించాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చాల్సిందిపోయి, వారిని నిలువునా దోచుకున్న వైనం ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్ పూజ కోసం బిహార్ లోని సొంత ఊరికి వెళ్లి తిరిగి ఢిల్లీకి తిరిగి వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబానికి ఈ ఘోరమైన అనుభవం గత శుక్రవారం ఎదురైంది. కలకలం రేపిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ వాస్తవ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య, కొడుకు తీవ్రగాయాలతో ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబోధ్ శ్రీవాస్తవ్ (42) భార్య సుష్మ, కొడుకు ప్రియన్ తో కలిసి ఢిల్లీకి వస్తూ అనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడినుంచి ఇంటికి రావడానికి ఆటో మాట్లాడుకున్నారు. అతి వేగంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ ను రెండు సార్లు వారించాడు శ్రీ వాస్తవ్. అయినా వినకుండా మరింత వేగం పెంచాడా డ్రైవర్. దీంతో అదుపు తప్పిన ఆటో డివైడర్ ఢీకొట్టి పల్టీ కొట్టింది. శ్రీవాస్తవ ఆటో కిందపడి చనిపోయాడు. అయితే బాధితులను ఆదుకోవాల్సిన ఆటోడ్రైవర్ మనసులో దుర్బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు కానీ, వారికి సంబంధించిన మూడు బ్యాగులను, ల్యాప్ ట్యాప్ ను తీసుకుని అక్కడినుంచి ఉడాయించాడు. వేగంగా నడపొద్దని తన భర్త వారించినా వినకుండా డ్రైవర్ చాలా ర్యాష్ గా మాట్లాడి మరింత వేగం పెంచాడని శ్రీవాస్తవ్ భార్య సుష్మ ఆరోపించారు. దీంతో ఆటో తిరగబడి పోయిందని ఆమె తెలిపారు. తన భర్త ఆటో కింద పడిపోగా, కొడుకు దూరంగా పడిపోవడం తనకు లీలగా గుర్తుందని తెలిపింది. ఆటోను పక్కకు తీసిన డ్రైవర్ సామాను ఆటోలో పెడుతోంటే, తమకు సాయం చేస్తున్నాడనుకున్నాననీ, కానీ తమ బ్యాగులు తీసుకుని అక్కడినుంచి పరారవుతాడని అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ తరువాత కొద్దిసేపు తనకేమీ తెలియలేదనీ, మెల్లిగా తేరుకుని, ఆ దారిన వెళుతున్న వాహనదారులను సాయమడిగి ఆసుపత్రికి చేరామంటూ ఆ దుర్ఘటను గుర్తు చేసుకున్నారు. తన భర్త మరణానికి కారణమైన ఆ ఆటోడ్రైవర్ ని గుర్తు పడతానని తెలిపారు. -
ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది
లక్నో: కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగలు, నగదుతో పాటు తుపాకీతో ఓ మహిళ పరారైన వైనం ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో కలకలం రేపింది. ఫిరోజాబాద్ కు చెందిన సరిత సుమారు రూ.20 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత రాత్రి కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపి ఇచ్చిన ఆమె వారు మత్తులోకి జారుకోగానే, ఇంట్లో ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో సహా ఉడాయించింది. తెల్లారి తేరుకున్న కుటుంబ సభ్యులు ...సరిత కనిపించకపోవడంతో పాటు ఇంట్లో విలువైన వస్తువులు మాయం కావడంతో స్థానిక కొత్వాల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిమిత్తం ఒక కమిటీని నియమించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యువతి పారిపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని, ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. -
దంపతులపై దాడి 5 లక్షల దోపిడి