ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది | Woman flee from home with jewellery, cash, pistol Etah (UP), | Sakshi
Sakshi News home page

ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది

Nov 10 2015 2:58 PM | Updated on Sep 3 2017 12:20 PM

ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది

ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది

కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి భారీ నగలు, నగదు సహా తుపాకితో ఓ మహిళ పారిపోయిన వైనం ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో కలకలం రేపింది.

లక్నో:  కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగలు, నగదుతో పాటు తుపాకీతో ఓ మహిళ పరారైన వైనం  ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో  కలకలం  రేపింది. ఫిరోజాబాద్ కు చెందిన సరిత సుమారు  రూ.20 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలతో  ఇంటి నుంచి వెళ్లిపోయింది.  గత రాత్రి కుటుంబ సభ్యులకు  మత్తు మందు కలిపి ఇచ్చిన ఆమె వారు మత్తులోకి జారుకోగానే, ఇంట్లో ఉన్న  లైసెన్స్డ్  తుపాకీతో సహా  ఉడాయించింది.

 

తెల్లారి తేరుకున్న  కుటుంబ సభ్యులు ...సరిత కనిపించకపోవడంతో పాటు ఇంట్లో విలువైన వస్తువులు మాయం కావడంతో స్థానిక కొత్వాల్ పోలీస్ స్టేషన్  ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిమిత్తం ఒక కమిటీని నియమించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.  యువతి పారిపోవడానికి  గల కారణాలను ఆరా తీస్తున్నామని, ఇంతవరకు  ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement