రేప్ చేయబోతే.. | Man attempts to rape, women rescued self by throwing chilli powder into his eyes | Sakshi
Sakshi News home page

రేప్ చేయబోతే..

Published Tue, Jul 5 2016 9:10 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

రేప్ చేయబోతే.. - Sakshi

రేప్ చేయబోతే..

కృష్ణా: లిఫ్ట్ అడిగి అపరిచిత కారెక్కిన ఓ మహిళపై కారు డ్రైవర్ అత్యాచారానికి యత్నించగా, అతని కళ్లలో కారం కొట్టి తప్పించుకున్న సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం మండలం సీతాపురం తండా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు గ్రామానికి చెందిన మహిళ(27) ఊరి నుంచి రెడ్డి గూడెం వెళ్లేందుకు సోమవారం రాత్రి 10గంటల సమయంలో బస్సు కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో అటువైపుగా కారులో వచ్చిన బాబూరావు అనే వ్యక్తి రెడ్డిగూడెంకు బండి వెళ్తోందని ఆమెను ఎక్కించుకున్నాడు.

కారు సీతాపురం చేరిన తర్వాత కూనపరాజు పర్వకు వెళ్లే రహదారి వైపు దారి మళ్లించి మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణలో పడిన ఆమె అందుబాటులో ఉన్న కారాన్ని తీసుకుని మృగాడి కళ్లలో కొట్టి, కారు దిగి కేకలు వేసింది. ఎవరూ లేకపోవడంతో తల్లికి ఫోన్ చేసింది. బాధితురాలి తల్లి రెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి బాబూరావు కారు వదిలి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కారును సీజ్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement