ఆమె భర్త కోసం తాలిబన్ల వేట మొదలైంది..! | Taliban search for man who cuts off wife's nose: officials | Sakshi
Sakshi News home page

ఆమె భర్త కోసం తాలిబన్ల వేట మొదలైంది..!

Published Wed, Jan 20 2016 6:48 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

ఆమె భర్త కోసం తాలిబన్ల వేట మొదలైంది..! - Sakshi

ఆమె భర్త కోసం తాలిబన్ల వేట మొదలైంది..!

మైమానా: అప్ఘానిస్తాన్లో భార్యతో గొడవపడి ఆమె ముక్కు కోసేసిన భర్త కోసం పోలీసులే కాదు ఏకంగా తాలిబన్లు కూడా వెతుకుతున్నారు. అతడి కోసం తాము తీవ్రంగా గాలింపులు జరుపుతున్నామని, అతడు ఎక్కడ ఉన్నా పట్టుకొని అసలు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఓ మహిళపై అలాంటి పని ఎందుకు చేయాలో ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నాక తాము ఏం చేయాలో అదే చేస్తామని అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల గ్రూపు అధికార ప్రతినిధి జబీనుల్లా ముజాహిద్ తెలిపాడు.

అప్ఘానిస్తాన్ లోని ఘోర్మాక్ జిల్లాలో రెజాగుల్ (20) అనే మహిళ ముక్కును ఆమె భర్త ముహమ్మద్ ఖాన్(25)  చిన్న కత్తితో కోసి పరారైన విషయం తెలిసిందే. రెండో పెళ్లి ప్రయత్నంలో ఉన్న అతడిని ప్రశ్నించిన కారణంగానే ఆమెపై భౌతికంగా ముహమ్మద్ ఖాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాలిబన్లు స్పందిస్తూ ఆన్ లైన్ లో తాము ఆ ఫొటోలు చూశామని, ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ఆ పనిని తాము కూడా ఖండిస్తున్నామని, అతడి కోసం గాలిస్తున్నామని, దొరికితే తగిన శిక్ష విధించడం మాత్రం ఖాయమని హెచ్చరించారు. ఖాన్ తమతో చేతులు కలిపాడని మీడియాలో వస్తున్న వార్తలను తాలిబన్లు ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement