![Afghanistan Woman Suicide Before Taliban Stone Her - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/17/afghanistan-taliban.jpg.webp?itok=Ou1NyQts)
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మహిళల హక్కులను కాలరాస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. వాళ్లను విద్య, ఉద్యాగోలకు దూరం చేస్తున్నారు. అంతేకాదు అమ్మాయిలు ఏదైనా తప్పు చేస్తే అత్యంత పాశవికంగా బహిరంగంగా రాళ్లతో కొట్టిచంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తాలిబన్ల అరాచకాలకు భయపడి బలవన్మరణానికి పాల్పడింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఏం జరిగిందంటే?
అఫ్గాన్ ఘోర్ ప్రావిన్సులో ఓ మహిళ ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తాలిబన్లు ఆ వ్యక్తిని అక్టోబర్ 13న ఊరి తీశారు. మహిళను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. తాలిబన్ల చేతిలో భయానకంగా చావడం కంటే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోవాలని ఆ మహిళ భావించింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తాలిబన్లు గతేడాది అగస్టులో అఫ్గాన్‌ను తమ హస్తగతం చేసుకుని అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి మహిళలపై కఠిన ఆంక్షలు విధించి వాళ్ల హక్కులను కాలరాస్తున్నారు. అమ్మాయిలు ఆరో తరగతి వరకే చదువుకోవాలని నిబంధన పెట్టారు. మీడియాలో పనిచేసే దాదాపు 80 శాతం మంది మహిళలను ఉగ్యోగాల నుంచి తొలిగించారు. అంతేకాదు ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి పారిపోతే దారుణంగా రాళ్లతో కొట్టి చంపుతున్నారు.
చదవండి: జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...: వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment