Hyderabad: Young Woman Commits Suicide Due To Health Problems- Sakshi
Sakshi News home page

Hyderabad KPHB Colony: కేపీహెచ్‌బీ కాలనీ.. హాస్టల్‌లో యువతి ఆత్మహత్య 

Published Mon, Dec 27 2021 8:53 AM | Last Updated on Mon, Dec 27 2021 12:40 PM

Hyderabad: Young Woman Commits Suicide Due To Health Problems - Sakshi

తనూజ(ఫైల్‌)

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్‌): అనారోగ్య కారణాలతో ఓ యువతి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లాకు చెందిన పాలపర్తి శాంతి (26) భాగ్యనగర్‌ ఫేజ్‌–2లోని తనూజ హాస్టల్‌లో నివాసం ఉంటూ బాలానగర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా తలనొప్పి తదితర అనారోగ్య కారణాలతో బాధపడుతుంది.

ఆదివారం ఉదయం శాంతి ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన శాంతి తల్లి హాస్టల్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేసి వాకబు చేసింది. హాస్టల్‌ నిర్వాహకులు శాంతి గదికి వెళ్ళి చూడగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆమె తల్లికి, సోదరికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన తరలివచ్చి పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. 
చదవండి: హైదరాబాద్‌: అన్నను కొట్టి చంపిన తమ్ముడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement