
సాక్షి, బాలానగర్( హైదరాబాద్): సూసైడ్ నోట్‌ను చిన్న కూతురు చేతిలో పెట్టిన ఓ తల్లి వెళ్లిపోయిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. బాలానగర్ సీఐ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన శాలిని, శంకర్ దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
కరీంనగర్ వెళ్తున్నానని చెప్పి చిన్నకూతురు అనన్య(8)తో బయలు దేరిన శాలిని హైదరాబాద్‌లోని బాల్‌రెడ్డినగర్‌లో నివసించే తన అక్క శ్రుతి ఇంటికి వచ్చింది. కూతురు చేతిలో సూసైడ్ లెటర్ పెట్టి గేటులోపలకు పంపి ఆటోలో వెళ్లిపోయింది. చిన్నారి చేతిలో లెటర్ చూసి ఆందోళన చెందిన శ్రుతి బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఆమెను కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment