
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మేడ్చల్‌రూరల్: తొలి ఏకాదశి పర్వదినం వేడుక ఓ ఇంట్లో విషాదం నింపింది. వేడుకలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెంది చెరువులో దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడి మృత్యువాత పడిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి నూతన్‌కల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని నూతన్‌కల్ గ్రామానికి చెందిన కనగల్ల సుశీల(55) ఇంట్లోనే కూతురు యశోద, అల్లుడు నివాసం ఉంటున్నారు.
మంగళవారం తొలి ఏకాదశి కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దలకు నైవేధ్యం సమర్పించారు. అనంతరం మద్యం తాగి భోజనం చేశారు. ఆ సమయంలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. మనస్థాపంతో సుశీల గ్రామంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment