Muhammad Khan
-
పాక్‌లో రేపిస్టులకు బహిరంగ ఉరి !
ఇస్లామాబాద్: పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ ఖాన్ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు. ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది. అయితే దీనిపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మాత్రం పెదవి విరిచింది. ఈ చర్య ఐక్యరాజ్యసమితి నియమనిబంధనలను ఉల్లంఘించడమేనని చెప్పింది. ఈ చర్య నేరాలను తగ్గించదని చెప్పింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వంలోని సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ చౌధరి, మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారిలు ఖండించారు. -
బాగుంది అంటే చాలు
‘‘సినిమా చూసిన తర్వాత అందులోని సందేశాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. మా సినిమాలో అవయవదానం గురించి చెప్పాం. సినిమా చూసి ప్రేక్షకులు బాగుందంటే చాలు’’ అన్నారు మున్నా కాశి. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. తనికెళ్ల భరణి, ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు (బిగ్‌బాస్ ఫేమ్) కీలక పాత్రధారులు. కెవిఎస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. మున్నా కాశి మాట్లాడుతూ– ‘‘మిస్టర్ 7, యాక్షన్ 3డీ’ వంటి సినిమాలకు సంగీతం అందించాను. రామ్‌గోపాల్‌వర్మగారి ‘కిల్లింగ్ వీరప్పన్’కు రెండు పాటలు చేశాను. ‘మామా చందమామ’ సంగీత దర్శకుడిగా నా చివరి చిత్రం. సంగీత దర్శకుడిగా బ్రేక్ తీసుకుని, ‘చంద్రముఖి, అరుంధతి’ లాంటి హారర్ కథలు అయితే బాగుంటుందని ఈ చిత్రం చేశాను. కథలో నాది లీడ్ రోల్ మాత్రమే. కథను మలుపు తిప్పే పాత్రలో తనికెళ్ల భరణిగారు నటించారు. నా తర్వాతి చిత్రం సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు. -
ఆమె భర్త కోసం తాలిబన్ల వేట మొదలైంది..!
మైమానా: అప్ఘానిస్తాన్‌లో భార్యతో గొడవపడి ఆమె ముక్కు కోసేసిన భర్త కోసం పోలీసులే కాదు ఏకంగా తాలిబన్లు కూడా వెతుకుతున్నారు. అతడి కోసం తాము తీవ్రంగా గాలింపులు జరుపుతున్నామని, అతడు ఎక్కడ ఉన్నా పట్టుకొని అసలు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఓ మహిళపై అలాంటి పని ఎందుకు చేయాలో ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నాక తాము ఏం చేయాలో అదే చేస్తామని అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల గ్రూపు అధికార ప్రతినిధి జబీనుల్లా ముజాహిద్ తెలిపాడు. అప్ఘానిస్తాన్ లోని ఘోర్మాక్ జిల్లాలో రెజాగుల్ (20) అనే మహిళ ముక్కును ఆమె భర్త ముహమ్మద్ ఖాన్(25) చిన్న కత్తితో కోసి పరారైన విషయం తెలిసిందే. రెండో పెళ్లి ప్రయత్నంలో ఉన్న అతడిని ప్రశ్నించిన కారణంగానే ఆమెపై భౌతికంగా ముహమ్మద్ ఖాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు స్పందిస్తూ ఆన్ లైన్ లో తాము ఆ ఫొటోలు చూశామని, ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ఆ పనిని తాము కూడా ఖండిస్తున్నామని, అతడి కోసం గాలిస్తున్నామని, దొరికితే తగిన శిక్ష విధించడం మాత్రం ఖాయమని హెచ్చరించారు. ఖాన్ తమతో చేతులు కలిపాడని మీడియాలో వస్తున్న వార్తలను తాలిబన్లు ఖండించారు. -
ముక్కుకోసేసిన భర్త... భార్యకు అండగా ప్రభుత్వం
కాబూల్: భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయిన భర్త ఆమె ముక్కు కోసేసిన దారుణ ఘటన అప్ఘానిస్తాన్ లోని ఘోర్మాక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెజాగుల్ (20), ముహమ్మద్ ఖాన్(25) ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి చిన్న పాప ఉంది. అయితే ఏడేళ్ల బాలికను ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఖాన్. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో ఖాన్, కత్తి తీసుకొని భార్య రెజా ముక్కు కోసేశాడు. అనంతరం ఖాన్ అతని సోదరుడు కలిపి ఆమెను బైక్ పై తీసుకొని వెళుతుండగా, బాధితురాలు అరుపులు విన్న స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఇద్దరూ అక్కడినుంచి ఉడాయించారు. గాయపడిన బాధితురాల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో రెజా పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. తెగిపడిన ముక్కును శస్త్రచికిత్స చేసే సదుపాయం తమ తగ్గర లేదని తెలిపారు. దీనిపై స్పందించిన అప్ఘానిస్తాన్ ప్రభుత్వం రెజాను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. చికిత్స, ఆపరేషన్ నిమిత్తం ఆమెను టర్కీ తరలించేందుకు తగిన ఏర్పాటు చేస్తోంది. అయితే ఉద్యోగం నిమిత్తం తరచూ ఇరాన్ వెళ్లే ఖాన్, తిరిగి వచ్చి భార్యను హింసించేవాడని రెజా తల్లి ఆరోపించింది. పెళైన దగ్గరినుంచీ తన కూతురికి నరకం చూపించాడని వాపోయింది. గొలుసులతో బంధించి, బూతులు తిడుతూ దారుణంగా ప్రవర్తించేవాడంది. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అతడు తనకు దొరికితే ముక్కలు ముక్కలు నరకుతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అప్ఘాన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో భయపడిన భర్త.. తాలిబన్ల అధీనంలోనున్న ప్రాంతంలో తలదాచుకున్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తాలిబన్ల అదుపులో వున్న నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. అటు రక్తమోడుతున్న బాధితురాలి ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. -
పాక్‌లో ఇద్దరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావెన్స్లో ఇద్దరు ఖైదీలకు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారని మీడియా వెళ్లడించింది. 2002 కరాచీలో ముహ్మమద్ ఖాన్ ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఖాన్‌ను సర్గోదా జిల్లా జైలులో ఉరి తీసినట్లు తెలిపింది. అలాగే 1998లో వరుస సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన కైజర్‌ను మెయిన్వాలి సెంట్రల్ జైల్లో ఉరి తీశారని పేర్కొంది.