పాక్‌లో రేపిస్టులకు బహిరంగ ఉరి !  | Public hanging for rapists in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో రేపిస్టులకు బహిరంగ ఉరి ! 

Published Sat, Feb 8 2020 1:25 AM | Last Updated on Sat, Feb 8 2020 1:25 AM

Public hanging for rapists in Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్‌ పార్లమెంట్‌ శుక్రవారం ఆమోదించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్‌ ఖాన్‌ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు.

ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది. అయితే దీనిపై పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ మాత్రం పెదవి విరిచింది. ఈ చర్య ఐక్యరాజ్యసమితి నియమనిబంధనలను ఉల్లంఘించడమేనని చెప్పింది. ఈ చర్య నేరాలను తగ్గించదని చెప్పింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వంలోని సైన్స్‌ శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి, మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్‌ మజారిలు ఖండించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement