బాగుంది అంటే చాలు | Munna Kasi New Movie Heza | Sakshi
Sakshi News home page

బాగుంది అంటే చాలు

Dec 11 2019 1:20 AM | Updated on Dec 11 2019 1:20 AM

Munna Kasi New Movie Heza  - Sakshi

‘‘సినిమా చూసిన తర్వాత అందులోని సందేశాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. మా సినిమాలో అవయవదానం గురించి చెప్పాం. సినిమా చూసి ప్రేక్షకులు బాగుందంటే చాలు’’ అన్నారు మున్నా కాశి. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. తనికెళ్ల భరణి, ముమైత్‌ ఖాన్, నూతన్‌ నాయుడు (బిగ్‌బాస్‌ ఫేమ్‌) కీలక పాత్రధారులు. కెవిఎస్‌ఎన్‌ మూర్తి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది.

మున్నా కాశి మాట్లాడుతూ– ‘‘మిస్టర్‌ 7,  యాక్షన్‌ 3డీ’ వంటి సినిమాలకు సంగీతం అందించాను. రామ్‌గోపాల్‌వర్మగారి ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’కు రెండు పాటలు చేశాను. ‘మామా చందమామ’ సంగీత దర్శకుడిగా నా చివరి చిత్రం. సంగీత దర్శకుడిగా బ్రేక్‌ తీసుకుని, ‘చంద్రముఖి, అరుంధతి’ లాంటి హారర్‌ కథలు అయితే బాగుంటుందని ఈ చిత్రం చేశాను. కథలో నాది లీడ్‌ రోల్‌ మాత్రమే. కథను మలుపు తిప్పే పాత్రలో తనికెళ్ల భరణిగారు నటించారు. నా తర్వాతి చిత్రం సెటైరికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement