50 రోజుల మైలురాయికి చేరువలో 'సి 202' | Munna Kasi Starrer C 202 Movie Successfully Running in Seventh Week | Sakshi
Sakshi News home page

50 రోజుల మైలురాయికి చేరువలో 'సి 202'

Published Mon, Dec 2 2024 7:55 PM | Last Updated on Mon, Dec 2 2024 7:55 PM

Munna Kasi Starrer C 202 Movie Successfully Running in Seventh Week

మున్నా కాశీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన హారర్‌ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మించాడు. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం ఆరువారాలుగా థియేటర్లలో ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ సహా ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరో వారం తో 50 రోజుల మైలు రాయిని చేరుకోనుంది.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ "సి 202 చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. మంచి రివ్యూస్‌, మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా దిగ్విజయంగా రన్‌ అవుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వారం లోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు  ధన్యవాదాలు. ఇంకా చూడని వారు మీ సమీప థియేటర్‌లో నేడే చూడండి" అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement