C 202 movie
-
50 రోజుల మైలురాయికి చేరువలో 'సి 202'
మున్నా కాశీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మించాడు. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం ఆరువారాలుగా థియేటర్లలో ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ సహా ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరో వారం తో 50 రోజుల మైలు రాయిని చేరుకోనుంది.ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ "సి 202 చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. మంచి రివ్యూస్, మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా దిగ్విజయంగా రన్ అవుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వారం లోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా చూడని వారు మీ సమీప థియేటర్లో నేడే చూడండి" అని తెలిపారు. -
హారర్ మూవీకి 'ఎ' సర్టిఫికెట్.. అప్పుడే రిలీజ్
మున్నా కాశీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ముఖ్య పాత్రల్లో నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది.గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. -
C 202 Trailer: ఒక్క డైలాగు లేదు.. సౌండ్‌తోనే భయపెట్టారుగా!
తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈరోజు ఒక డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ తో రెండు నిమిషాల ఎనిమిది సెకెన్ల ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ "ఈరోజు 'సి 202' (C 202) చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేసాం. ఒక్క డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్ లను చూపిస్తూ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మా సినిమా మీద అంచనాలు పెంచేలా రూపొందించాం. ఈ మూవీ షూటింగ్ అంతా రాత్రి సమయంలోనే చేశాం. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాం. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.