Munna Kasi
-
50 రోజుల మైలురాయికి చేరువలో 'సి 202'
మున్నా కాశీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మించాడు. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రం ఆరువారాలుగా థియేటర్లలో ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ సహా ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరో వారం తో 50 రోజుల మైలు రాయిని చేరుకోనుంది.ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ "సి 202 చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. మంచి రివ్యూస్, మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా దిగ్విజయంగా రన్ అవుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వారం లోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా చూడని వారు మీ సమీప థియేటర్లో నేడే చూడండి" అని తెలిపారు. -
హారర్ మూవీకి 'ఎ' సర్టిఫికెట్.. అప్పుడే రిలీజ్
మున్నా కాశీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ముఖ్య పాత్రల్లో నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది.గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. -
హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా రానున్న 'సి 202' ఫస్ట్ లుక్ రిలీజ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'సి 202' (C 202) ఫస్ట్ లుక్ విడుదలయింది. ఈ చిత్రాన్ని మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకంపై మనోహరి కె ఎ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ నటిస్తుండగా మున్నా కాశి హీరోగా పలకరించనున్నాడు. ఇందులో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను వంటి నటులు కూడా ఉన్నారు. హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా 'సి 202' రానుంది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది.జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ.. 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా అద్భుతమైన సస్పెన్స్‌తో తెరకెక్కించాం. హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమాని చిత్రకరించాము. షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలతో పాటు మంచి లైటింగ్ పరికరాలను ఉపయోగించాము. మా చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తారు. ఈ చిత్రంలో 21 నిమిషాల పాటు గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. నా గత చిత్రం హేజా(Heza) మంచి పేరు తెచ్చిపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఆ చిత్రాన్ని చూసి నన్ను చాలా మంది పార్ట్-2 ఎప్పుడని అడుగుతున్నారు. దానికి సీక్వెల్ త్వరలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మంచి హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202)తో మీ ముందుకు వస్తున్నాం. త్వరలో ట్రైలర్ ను విడుదల చేస్తాం' అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మున్నా కానీ హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం అందించారు. -
బాగుంది అంటే చాలు
‘‘సినిమా చూసిన తర్వాత అందులోని సందేశాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. మా సినిమాలో అవయవదానం గురించి చెప్పాం. సినిమా చూసి ప్రేక్షకులు బాగుందంటే చాలు’’ అన్నారు మున్నా కాశి. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. తనికెళ్ల భరణి, ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు (బిగ్‌బాస్ ఫేమ్) కీలక పాత్రధారులు. కెవిఎస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. మున్నా కాశి మాట్లాడుతూ– ‘‘మిస్టర్ 7, యాక్షన్ 3డీ’ వంటి సినిమాలకు సంగీతం అందించాను. రామ్‌గోపాల్‌వర్మగారి ‘కిల్లింగ్ వీరప్పన్’కు రెండు పాటలు చేశాను. ‘మామా చందమామ’ సంగీత దర్శకుడిగా నా చివరి చిత్రం. సంగీత దర్శకుడిగా బ్రేక్ తీసుకుని, ‘చంద్రముఖి, అరుంధతి’ లాంటి హారర్ కథలు అయితే బాగుంటుందని ఈ చిత్రం చేశాను. కథలో నాది లీడ్ రోల్ మాత్రమే. కథను మలుపు తిప్పే పాత్రలో తనికెళ్ల భరణిగారు నటించారు. నా తర్వాతి చిత్రం సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు. -
హారర్ కథ
సంగీత దర్శకుడు మున్నాకాశి హీరోగా నటించి, దర్వకత్వం వహించిన చిత్రం ‘హేజా’. ఏ మ్యూజికల్ హారర్ అనేది ట్యాగ్‌లైన్. కేవీయస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మున్నాకాశి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ద్వారా హీరోగా, దర్శకునిగా పరిచయం అవుతున్నాను. మంచి కథాంశంతో రూపొందించిన మ్యూజికల్ హారర్ మూవీ ఇది. ఈ సినిమాకి సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్‌గా ఉంటాయి’’ అన్నారు. కో–ప్రొడ్యూసర్ వి.యన్ వోలేటి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ఎంతో క్లారిటీతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అన్నారు. తనికెళ్ల భరణి, ముమైత్‌ఖాన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. -
మ్యూజికల్ హారర్
‘‘మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన మున్నా కాశీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’ (ఎ మ్యూజికల్ హారర్). ముమైత్ ఖాన్, నూతన నాయుడు (బిగ్ బాస్ ఫేమ్), లక్ష్మణ్ (ఆర్ఎక్స్ 100ఫేమ్), లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మున్నా కాశీ మాట్లాడుతూ– ‘‘ఒక మ్యూజికల్ హారర్‌గా మంచి కథతో తెరెకెక్కించాం. టీజర్‌కి, పాటలకి మంచి స్పందన వస్తోంది. సినిమా బాగా రావడానికి కారణమైన కేవీఎస్ఎన్ మూర్తి, సహ నిర్మాత వి.యన్జ వోలెటిగార్లకు కృతజ్ఞతలు. విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు కెవీఎస్ఎన్ మూర్తి. -
రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’
మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని మంచి ప్రశంసలు పొందారు మున్నా కాశీ. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హేజా’. వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముమైత్ ఖాన్, బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు, ఆర్.ఎక్స్ 100 ఫేమ్ లక్ష్మణ్, లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగాజరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైమ్ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. ఒక మ్యూజికల్ హారర్‌గా అధ్బుతమైన కథాంశంతో తెరెక్కుతున్న చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్ఆర్ హైలెట్ గా నిలవనుంది. టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన సహనిర్మాత వి.యన్ వోలెటి, నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీ మిక్సింగ్‌తో రూపొందుతోంది. సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం’ అన్నారు. -
ఆసక్తికరంగా ‘హేజా’ టీజర్
మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. చాల రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ స్తుండగా వీఎన్వీ క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంట్రస్టింగ్‌గా కట్ చేసిన టీజర్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సూపర్బ్ అనిపించేలా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశీ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మరి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్‌గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూవీ అవుట్‌పుట్ చాల బాగా ఉంది. ఈ సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతుంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేస్తాం’ అన్నారు.